అన్వేషించండి

Bigg Boss 8: ఓల్డ్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్... హీటెక్కిన నామినేషన్స్‌, 6లో నలుగురు లేడీసే

Bigg Boss Season 8: బిగ్ బాస్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీలతో 8 మంది అడుగు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ నామినేషన్స్ ప్రక్రియలో నామినేట్ అయిన ఆరుగురు ఎవరో తెలుసా? అందులో ఇద్దరు వైల్డ్ కార్డులు ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 8లో ఆట రసవత్తరంగా మారింది. ఇంతకు ముందు ఆ ఇంటిలో ఆడిన అనుభవం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డుల ద్వారా అడుగు పెట్టడంతో ఓల్డ్ వర్సెస్ న్యూ అన్నట్టు ఆట మంచి ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ ఇంటిలోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు అడుగు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ నామినేషన్ల ప్రక్రియలో నామినేట్ అయిన ఆరుగురు ఎవరో తెలుసా?

ఇంటిలో అడుగుపెట్టిన రెండో రోజే గంగవ్వకు షాక్!
బిగ్ బాస్ సీజన్ 4లో గంగవ్వ పార్టిసిపేట్ చేసింది. అప్పుడు ఆమె తనకు ఇల్లు లేదని అడగడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత షో హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున మద్దతుతో సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. ఇప్పుడు మరొకసారి బిగ్ బాస్ ఇంటికి వచ్చింది. అయితే గంగవ్వకు ఈ సారి రెండో రోజే షాక్ తగిలింది. ఆమెకు ఇటువంటి షాక్ తగలడం కొత్త ఏమీ కాదు.

బిగ్ బాస్ 4వ సీజన్ మీకు గుర్తుందా? అందులో మొదటి వారం గంగవ్వను నామినేట్ చేశారు. అప్పుడు ఆయా కంటెస్టెంట్లు చెప్పిన కారణాలు ప్రేక్షకులకు సిల్లీగా అనిపించాయి. మరి ఈసారి ఇంటిలో సభ్యులు ఏయే కారణాలు చెప్పారో చూడాలి. గంగవ్వ టాస్క్ సరిగ్గా ఆడలేదు అని చెబితే మాత్రం అంత కంటే తప్పు మరొకటి ఉండదు. ఆదివారం జరిగిన టాస్కుల్లో ఆవిడ మిగతా వాళ్ళ కంటే బాగా ఆడినట్లు స్పష్టంగా కనపడింది. 

వైల్డ్ కార్డు హరితేజ మొదలు పెట్టిన నామినేషన్లు!
బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్లకు మొదటి వారం నామినేషన్స్ ఉండదని ప్రచారం జరిగింది. అయితే... ఆ ప్రచారంలో నిజం లేదు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ హరితేజతో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలు అయింది. ఇంటి సభ్యుని మెడలో ఫోటో వేసి అతనిని నామినేట్ చేయడం ఈ వీక్ స్టైల్.

బిగ్ బాస్ సీజన్ 8లో ఓల్డ్ కంటెస్టెంట్లకు 'ఓజీ' క్లాన్ అని, వైల్డ్ కార్డ్ ద్వారా అడుగు పెట్టిన కొత్త కంటెస్టెంట్లకు రాయల్ క్లాన్ అని పేర్లు పెట్టిన సంగతి తెలిసింది. రాయల్ క్లాన్ సభ్యులలో ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశం ఓజీ క్లాన్ సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు. అప్పుడు గంగవ్వతో పాటు మెహబూబ్ దిల్ సేను పాత సభ్యులు నామినేట్ చేశారు. మరి వాళ్ళిద్దరికీ ఏయే కారణాలు చెప్పారో చూడాలి.

Also Read: కృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు


నామినేట్ అయిన ఆరుగురు ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం నామినేట్ అయిన ఆరుగురు సభ్యులలో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు గంగవ్వ, మెహబూబ్‌ దిల్ సే కాగా... మిగతా నలుగురు పాత కంటెస్టెంట్లు. వారిలో యష్మీ గౌడ, విష్ణు ప్రియా భీమనేని, కిరాక్ సీత, పృథ్వీ ఉన్నారు. మరి ఈ వీకెండ్ ఎవరు ఎవిక్ట్ అవుతారో చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ. అందరి కంటే ఎక్కువ నామినేషన్స్ యష్మీ గౌడ మీద పడినట్టు టాక్.

Also Read'బిగ్ బాస్ 8'లో హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్... కృష్ణ ముకుంద మురారి భామ ప్రేరణ బ్యాగ్రౌండ్ ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget