అన్వేషించండి

Bigg Boss 8 : పృథ్వీ కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలు... పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది జెలసీ వల్లేనా?

Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 8 షో 14 మంది కంటెస్టెంట్స్ తో మొదలవగా, ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారం నామినేషన్స్ లో సోనియా, యష్మి గౌడ మధ్య జరిగిన గొడవ హైలెట్.

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం నామినేషన్లలో కంటెస్టెంట్స్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు వేరొకటి చెబుతూ నామినేట్ చేశారు. అందులో హైలెట్ యష్మి గౌడ, సోనియా. ఏకంగా సోనియాను టార్గెట్ చేస్తూ "ఆ ఇద్దరిని వాడుకుంటున్నావు" అని ముఖం మీద చెప్పేస్తుంది యష్మి గౌడ. అయితే సోనియా కూడా తక్కువేం కాదు కదా అసలే ఆడ పులి ఇచ్చి పడేసింది. 

ఒక్కడి కోసం ఇద్దరమ్మాయిల గొడవ 
తన నామినేషన్ మొదలు పెట్టడమే మణికంఠను మళ్లీ నామినేట్ చేసి సీరియస్ డిస్కషన్ చేసింది. గేమ్ లో నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది యష్మి. అయితే తాను స్ట్రాంగ్ కాదంటూ యష్మి గౌడ ఇచ్చిన స్టేట్మెంట్ ను  మణికంఠ అస్సలు ఒప్పుకోలేదు. పైగా "నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా నేను షోలో ఉంటాను" అని మరింత నమ్మకంగా చెప్పాడు. ఆ తర్వాత సోనియా మీద నోరు వేసుకొని పడిపోయింది. గతవారం యష్మి చీఫ్ గా కరెక్ట్ గా లేదంటూ సోనియా నామినేట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ టైంలోనే యష్మి గౌడ - సోనియాను నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇప్పుడు అనుకున్నట్టే చేసింది. "ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది" అంటూ తన రీజన్ చెప్పింది.

వెంటనే సోనియా "నేను గేమ్ లోకి దిగాక ఎవరిని కొడతానో నాకే తెలియదు. ఇక్కడున్న అందరికంటే, మగవాళ్ళ కంటే కూడా ఎక్కువ యాంగర్ నాకే ఉంది. కాకపోతే నేను ఎవరిని హార్ట్ చేయకూడదు అనుకున్నాను కాబట్టి నా యాంగర్ ని కంట్రోల్ చేసుకున్నాను. అయినప్పటికీ నా వంతుగా నేను ఆడాను" అని సమాధానం చెప్పింది సోనియా. వెంటనే అందుకున్న యష్మి "నువ్వు వాళ్ళిద్దర్నీ ఆయుధాలుగా వాడుకుంటావు గాని ఆడడానికి నువ్వు మాత్రం ముందుకు రావు" అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలా ఇద్దరి మధ్య జరిగిన గొడవతో ఏకంగా వీళ్ళిద్దరి మధ్య పర్సనల్ గా అసలు ఏం జరుగుతుంది అనే విషయం బయటపడింది. 

Also Readబిగ్​బాస్​కి మూడో కంటెస్టెంట్​గా వెళ్లాడు.. మూడో వారంలోనే వచ్చేశాడు.. అభయ్ నవీన్ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా?

జెలసినే వల్లే పడట్లేదా ? 
మూడో వారానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ లో కాసేపు ఫ్లర్ట్ గేమ్ ఆడారు హౌస్ మేట్స్. ఆ టైంలో సోనియా పృథ్వి తో మాట్లాడుతూ "ఏం జరుగుతోంది రా నీకు, యష్మికి మధ్య" అని అడిగిన విషయం గుర్తుండే ఉంటుంది. "నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటావు అని యష్మితో చెప్పావట. అయితే మళ్లీ మళ్లీ అలాంటి డ్రెస్ వేసుకోవడానికి ట్రై చేస్తాను అని ఆమె చెప్పిందట. నువ్వంటే ఆమెకు ఇష్టం అంట కదా" అని ప్రశ్నించింది. ఇక తాజాగా జరిగిన నామినేషన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవకు కారణం పృథ్వీనే అని అనిపిస్తుంది. యష్మి గౌడ వాళ్లిద్దర్నీ వాడుకుంటున్నావ్ అని నామినేట్ చేయగా, "నువ్వు ఎప్పుడూ పృథ్వీనే చూస్తే ఎలా తెలుస్తుంది" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సోనియా.

వెంటనే యష్మి గౌడ "అవును.. నేను ఎప్పుడూ వాడినే చూస్తాను. కానీ నా గేమ్ ఆడాల్సి వచ్చినప్పుడు నేనే ఆడతాను" అంటూ అసలు విషయాన్ని ఒప్పుకుంది. ఇక వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ నామినేషన్స్ డిస్కషన్ చూస్తుంటే ఇద్దరూ పృథ్వి కోసం కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. అయితే సోనియా ఎప్పుడూ పృథ్వీని వదిలి పెట్టకపోవడంతో అదే జెలసితో యష్మి గౌడ సోనియాపై ఈ విధంగా ఫైర్ అవుతోందని అనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఏం జరిగినా సరే యష్మి గౌడ పృథ్వీని సమర్థిస్తూ వస్తుంది తప్ప ఎక్కడా కోప్పడట్లేదు. ఆమె కోపం అంతా పృథ్వికి దగ్గరగా ఉంటున్న సోనియా పైన చూపిస్తుంది.

Read Also : Bigg Boss 8 Telugu Episode 23 Day 22: ఉంటే నువ్వుండాలి లేదా నేనుండాలి... మణికంఠ, యష్మీ సవాల్ - సోనియా ఓవర్ కాన్ఫిడెన్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
'మీరు కావాలని అనలేదని అర్థమైంది' - నటుడు కార్తీ క్షమాపణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన
Youtuber Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు
Revanth Reddy: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు ఇంటి స్థలం పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Israel Lebanon War: ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
ఇజ్రాయెల్ -లెబనాన్ దేశాల మధ్య వైరం ఎలా మొదలైంది, ఎప్పటిదో తెలుసా ?
YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Embed widget