(Source: ECI/ABP News/ABP Majha)
Bigg Boss: బిగ్ బాస్ నామినేషన్స్.. హాట్.. హాటర్.. హాటెస్ట్..!
Bigg Boss 8 Telugu Nomination: తొలివారం బిగ్‌బాస్ నామిషన్స్ జరిగాయి. వాడివేడిగా సాగిన నేటి నామినేషన్లో బేబక్క, మణికంఠ, పృథ్వీ.. ఉన్నారు. మిగతా నామినేషన్స్ ప్రక్రియ రేపు కొనసాగనుంది.
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. మొట్ట మొదటి నామినేషన్స్.. హాట్ హాటర్ హాటెస్ట్ గా జరిగాయి. చీఫ్స్ గా కూర్చున్న నిఖిల్, యశ్మీ, నైనిక సమక్షంలో.. ఫైర్ బ్రాండ్ సోనియా.. నామినేషన్ ప్రక్రియను ఫోర్స్ గా మొదలు పెట్టింది. సీజన్ 8లో ఆట ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు.. ఇంట్రో ఆన్సర్ ఇచ్చినట్టుగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. బేబక్క, ప్రేరణపై నామినేషన్లు వేసిన సోనియా.. ముందుగా బేబక్కపై తన అసంతృప్తిని వెళ్లగక్కింది. వంట చేసే బాధ్యత తీసుకున్న ఆమె.. ఆ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని.. ఆ కారణంగా హౌస్ మేట్స్ అంతా ఆకలితో ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పింది.
కుక్కర్ పనితీరుపై సరైన అవగాహన బేబక్కకు లేని కారణంగా.. పప్పు మాడిపోయిందని.. చివరికి ఆ మాడిపోయిన పప్పు తన దురదృష్టం కొద్దీ తనకే వచ్చిందని సోనియా కామెంట్ చేసింది. అయితే.. హౌస్ మేట్స్ అంతా రిక్వెస్ట్ చేసిన కారణంగానే తాను వంటకు అంగీకరించానని బేబక్క బదులిచ్చింది. తర్వాత.. ప్రేరణపై అసహనాన్ని వ్యక్తం చేసింది సోనియా. జాలీ కోసం వచ్చినట్టుగా ఆడుతోందని.. సీరియస్ నెస్ లేదని అందుకే తాను నామినేట్ చేస్తునన్నానని సోనియా చేసిన కామెంట్ కు.. ప్రేరణ బాగానే డిఫెండ్ చేసుకుంది. అందరిగురించీ అనవసరంగా మాట్లాడుతున్నావంటూ సోనియా చేసిన కామెంట్ కు సీరియస్ రిప్లై ఇచ్చింది.
తాను ఏదీ అనవసరంగా మాట్లాడ్డం లేదని స్ట్రాంగ్ గా చెప్పింది. చివరికి.. ముగ్గురు చీఫ్ లలో.. యశ్మీ ముందుగా వెళ్లి కత్తిని పట్టుకుని.. బేబక్క ఫొటోపై గుచ్చింది. వంట విషయం బిగ్ బాస్ ఇంటికి సంబంధించింది కాబట్టి.. తాను ఆ పాయింట్ లో బేబక్కను ఫిక్స్ చేస్తున్నట్టు యశ్మీ చెప్పుకొచ్చింది. అలా.. బేబక్క.. ఈ సీజన్ కు మొదటి నామినేషన్ ను సొంతం చేసుకుంది. తర్వాత వంతు.. నబిల్ అఫ్రిదీకి దక్కింది. కట్టె.. కొట్టె.. తెచ్చె.. అన్నట్టుగా సూక్ష్మంగా తన పాయింట్స్ వివరించుకుంటూ వెళ్లిన నబిల్.. మణికంఠ, బేబక్కపై నామినేషన్స్ వేశాడు. మణికంఠ ఎందుకో అందరికీ దూరంగా ఉంటున్నాడని.. కలిసి మెలిసి ఉండడం లేదని.. తనకు మరో పాయింట్ లేదు కాబట్టి అదే పాయింట్ పై మణికంఠను నామినేట్ చేస్తున్నానని నబిల్ చెప్పాడు.
కానీ.. తాను పెరిగిన పరిస్థితుల కారణంగా అలా ఉండాల్సి వస్తోందని, తనకు గతంలో ఒంటరితనం అనుభవం ఉందని.. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే తాను అందరితో కలిసి మాట్లాడుతున్నానని మణికంఠ వివరణ ఇచ్చుకున్నాడు. తర్వాత.. బేబక్కతో తనకు అంతగా కనెక్షన్ లేదని.. బిగ్ బాస్ ఇంటిలో ఉన్న మిగతా అందరితో తాను ఎంతో కొంత కలిసిపోయానని.. బేబక్కతో మాత్రం ఆ చనువు లేని కారణంగానే నామినేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. చివరికి.. ముగ్గురు చీఫ్ ల నుంచి మళ్లీ వేగంగా ముందుకొచ్చి కత్తిని అందుకున్న యశ్మీ.. ఈ సారి మణికంఠ ఫొటోపై ఆ కత్తిని దింపింది. యశ్మీ ఉద్దేశం ఏంటో.. తాను అర్థం చేసుకోగలనని కాస్త సర్కాస్టిక్ గా రిప్లై ఇచ్చిన మణి.. థాంక్యూ చీఫ్ అంటూ తనే డిస్కషన్ క్లోజ్ చేశాడు. అలా.. బిగ్ బాస్ హౌస్ లో రెండో నామినేషన్ మణికంఠపై కన్ఫమ్ అయ్యింది.
హౌస్ లో కాస్త ఎక్కువ సరదా సరదాగా ఉంటున్న శేఖర్ బాషా.. మణికంఠ, బేబక్కపై నామినేషన్ల అస్త్రం ఎక్కుపెట్టాడు. అనవసరమైన డామినేషన్ ప్రదర్శిస్తున్నావంటూ మణికంఠపై తన అసంతృప్తిని శేఖర్ వివరించాడు. తనకు క్లారిటీ ఎక్కువగా ఉందని.. అలాంటి తనపై నామినేషన్ వేయడం ఏంటంటూ మణికంఠ సమాధానం ఇస్తూ.. మధ్యలో ఓకేనా.. అని ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. దానికి.. నాట్ ఓకే అంటూ వెంటనే అందుకున్న శేఖర్ బాషా.. తన పాయింట్ ను కంటిన్యూ చేశాడు. తర్వాత.. వంట చేసుకునే విధానంలో ఎదురైన ఇబ్బందులు వివరిస్తూ రెండో నామినేషన్ ను బేబక్కపై వేశాడు శేఖర్ బాషా. అయితే.. వంట విషయంలో పెట్టుకున్న నిబంధనలను తప్పుబడుతూ అది తనకు నచ్చలేదంటూ.. బేబక్కను కార్నర్ చేశాడు.
Also Read: బిగ్‌బాస్‌కి కలిసోచ్చిన లావ్ ట్రాక్స్ - ఈ ఏడు సీజన్స్‌లో హాట్‌టాపికైన ప్రేమ జంటలు ఇవే, ఈసారి...
చివరికి.. చీఫ్ ల నుంచి వేగంగా ముందుకు వచ్చిన నైనిక.. కత్తిని అందుకుని మణికంఠ ఫొటోపై దింపింది. తన ఆట తీరులో కొన్ని లోపాలు ఉన్నాయంటూ నైనిక చేసిన పాయింట్ కు.. కౌంటర్ ఇచ్చాడు మణి. ఆ తర్వాత జరిగిన పర్సనల్ డిస్కషన్ లో.. శేఖర్ బాషా నిర్ణయాన్ని బేబక్క అభినందించింది. బడ్డీ అని చూడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా నామినేషన్ వేసినందుకు గర్వపడుతున్నానంటూ.. శేఖర్ ను సపోర్ట్ చేయడం.. వ్యూవర్స్ కు కాస్త పాజిటివ్ గా అనిపించే విషయమే. నామినేషన్లు వేసే నాలుగో అవకాశాన్ని బేబక్క దక్కించుకుంది. పృథ్వీ, నబిల్ పై నామినేషన్లు వేసిందామె. హౌస్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ కావడం లేదన్న కారణాన్ని చూపిస్తూ బేబక్క చేసిన ఆరోపణకు.. పృథ్వీ కూడా పాజిటివ్ గా స్పందించాడు. తనకు వంటకు సంబంధించిన ప్రతి విషయంలో మిగతా హౌస్ మేట్స్ అంతా ఎంతో కొంత హెల్ప్ చేశారని.. అందుకే పృథ్వీని నామినేట్ చేస్తున్నానని బేబక్క చెప్పింది.
అయితే.. ఈ ఆర్గ్యుమెంట్ లో కిరాక్ సీత మధ్యలో కల్పించుకునేసరికి.. చీఫ్ నిఖిల్ కాస్త సీరియస్ అయ్యాడు. మధ్యలో మాట్లాడొద్దన్నాడు. ఆ రైట్ నిఖిల్ కు లేదంటూ కిరాక్ సీత డైలాగ్ వార్ కు దిగింది. నిఖిల్ కూడా సీరియస్ గా మాట్లాడుతూ సీతకు దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. చివరికి బేబక్క కల్పించుకుని పృథ్వీ విషయంలో తన వెర్షన్ వినిపించింది. బుర్ర వాడి నామినేషన్లు వేయాలని.. సిల్లీ రీజన్స్ కు నామినేట్ చేయవద్దంటూ చెప్పాడు. చివరికి తన యాంగర్ ను తానే కంట్రోల్ చేసుకుని.. బేబక్కకు సారీ చెప్పాడు. తర్వాత నబిల్ పై నామినేషన్ వేసిన బేబక్క.. హౌస్ మేట్స్ తో అతను అంతగా యాక్టివ్ గా కలవడం లేదని ఆరోపించింది.
Also Read: చిచ్చు పెట్టిన వంట, రచ్చ రేపిన నామినేషన్స్! ఏకంగా కత్తి దింపుతున్న కంటెస్టెంట్స్
ఎవరైనా చెబితే తప్ప మాట్లాడ్డం కాదని.. సొంతగా వాయిస్ రైజ్ చేయాలని.. నబిల్ మరింత పవర్ ఫుల్ గా ఆడాలన్న ఆకాంక్షతోనే నామినేషన్ వేస్తున్నట్టుగా చెప్పింది. కానీ.. తాను యాక్టివ్ గానే ఉన్నానని, బేబక్క రీజన్స్ తప్పని నబిల్ రిప్లై ఇచ్చాడు. కామ్ గా ఉండడం తన స్టైల్ మాత్రమే అని.. బేబక్క రీజన్ మాత్రం తప్పు అని అన్నాడు. ఆ తర్వాత.. చీఫ్స్ నుంచి నిఖిల్ వేగంగా ముందుకు వచ్చి కత్తిని అందుకుని పృథ్వీ ఫొటోపై దింపాడు. కోపాన్ని అదుపులో పెట్టుకోకపోవడం సరికాదంటూ.. పృథ్వీపై నామినేషన్ కన్ఫమ్ చేయడాన్ని నిఖిల్ సమర్థించుకున్నాడు. అలా... ఇవాళ్టి నామినేషన్లలో బేబక్క, మణికంఠ, పృథ్వీ.. ఓటింగ్ ఫైట్ లో నిలబడ్డారు. రేపటి ఎపిసోడ్ లో మిగతా నామినేషన్లు పూర్తయితే.. సీజన్ 8 తెలుగు బిగ్ బాస్ మొదటి వారంలో ఎవరెవరు నామినేషన్లలో ఉన్నారన్నదీ తేలిపోనుంది.