అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Bigg Boss Telugu Season 8: విష్ణు ఇక మారదు... చించేందుకు ఎగబడ్డ కంటెస్టెంట్లు... ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం ఆఖరి మెగా ఛీప్ అయ్యేందుకు ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. . ఇందులో ఇంటి సభ్యులంతా పాల్గొనచ్చని ఆఫర్ ఇచ్చాడు.

Bigg Boss 12th Week Mega Chief Contender Task: బిగ్ బాస్ ఇంట్లో పన్నెండో వారం నామినేషన్స్ కాస్త వెరైటీ జరిగిన సంగతి తెలిసిందే. నామినేషన్స్‌లో సీత చెప్పిన పాయింట్లకు నిఖిల్ తెగ బాధపడ్డాడు. యష్మీ మళ్లీ ఫ్లిప్ స్టార్ అని నిరూపించుకుంది. ఇక ఇంట్లో ఆఖరి మెగా ఛీప్ అయ్యేందుకు ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా పాల్గొనచ్చని, గార్డెన్ ఏరియాలో ఉన్న ఐదు బొమ్మలకు టీ షర్టులు పెట్టాల్సి ఉంటుందని, సమాయనుగుణంగా వచ్చే టీ షర్టుల్ని భద్ర పర్చుకోవడం లేదా చించేసుకోవడం చేసుకోవాలని, బజర్ మోగే వరకు టీ షర్ట్‌ని కాపాడుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. అలా చివరకు టీ షర్ట్ బొమ్మకు తొడిగితే.. ఆ కంటెస్టెంట్ మెగా చీఫ్ కంటెండర్ అవుతారని చెప్పాడు. అసలు బుధవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

సీత చెప్పిన నామినేషన్ పాయింట్లను, అమ్మాయిలను వాడుకుంటున్నాడు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని నిఖిల్ బాధపడ్డాడు. నేను నిన్ను ఎప్పుడైనా వాడుకున్నానా? అని యష్మీతో నిఖిల్ మాట్లాడాడు. లేదు అని యష్మీ అంటే.. మరి సీత చెబుతుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నావ్.. చెప్పాలి కదా?.. కానీ ఎందుకు తల ఊపావ్ అని నిలదీశాడు. దీంతో యష్మీ ఏదో ఒకటి చెప్పి మాట మార్చేసింది. ఆ మాటకి తల ఊపలేదు అని చెప్పింది. ఆ తరువాత తన తండ్రి మాటల్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.

స్ట్రాంగ్ ఉమెన్‌ని వాడుకోలేదు.. ఒకరిని తొక్కాలని అనుకోలేదు..అలా షోని గెలవాని అనుకోలేదు.. ఇది ఆడియెన్స్‌కు చెబుతున్నా.. నాకు వెళ్లాలని అనిపిస్తోంది.. నాకు ఓట్లు వేయకండి.. వెళ్లాలని ఉంది.. అంటూ నిఖిల్ బాధపడ్డాడు. ఆ తరువాత గౌతమ్ తనలో తాను ఇలా అనుకుంటాడు. నువ్వేం ఆడుతున్నావ్.. టాప్ 5లో ఎందుకు పెడుతున్నావ్ అని నా మొహం అడిగేస్తున్నారు.. కొంత మంది పేరెంట్స్ చెప్పారని నాతో బాగుంటున్నారు.. అని ఇలా తనలో తాను గౌతమ్ అనుకున్నాడు. 

ఆ తరువాత నిఖిల్ తన బాధను మర్చిపోయి.. నేను ఉండాలని అనుకుంటా.. పోరాడి వస్తా.. నా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తా.. నామినేషన్స్‌లో ఉన్నా.. గట్టిగా ఆడుతా.. కప్పు తీసుకొని వస్తా.. అని ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేశాడు. మెగా చీఫ్‌గా ఉన్న టైంలో తాను కాస్త కఠినంగా వ్యవహరించానని, తన మాట తీరు బాగా లేదని, అందరినీ హర్ట్ చేశానని, క్షమించని ప్రేరణ కోరింది. ఆ తరువాత యష్మీ వచ్చి నిఖిల్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. అతను నన్ను ఎప్పుడూ ఆటలో వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ నన్ను తప్పు అని అంటున్నారు.. నేను ఏంటో ఇక్కడే నిరూపించుకుని వెళ్తాను.. అని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

క్లీనింగ్ విషయంలో అవినాష్‌కు, విష్ణుకి మధ్యలో చిన్న వాగ్వాదం జరిగింది. క్లీనింగ్ సరిగ్గా చేయడం లేదని నామినేషన్స్ వేసుకుంటే వేసుకోండని విష్ణు నిర్లక్ష్యంగా మాట్లాడింది. దీనికి నామినేషన్ వరకు ఎందుకు అని రోహిణి అంటే.. మధ్యలో ఎందుకు దూరుతున్నావ్.. నన్ను కరెక్ట్ చేయాలని చూడకు అంటూ విష్ణు పిచ్చి పిచ్చిగా వాగేసింది. ఎందుకు కోప్పడ్డావ్ అని పృథ్వీ అడిగితే.. గతంలో అవినాష్ మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు కూడా నా మీద ఇలానే చెప్పాడు.. అవన్నీ గుర్తుకు వచ్చాయ్.. అందుకే సీరియస్ అయ్యా అని క్లారిటీ ఇచ్చింది.

Also Read: బిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 79 రివ్యూ: కన్నడ బ్యాచ్ విడిపోక తప్పదేమో... ఆడోళ్ల ఎమోషన్‌ను వాడుకుంటాడు - నిఖిల్‌ మీద సీత నింద

తేజ నిద్రపోతే స్విమ్మింగ్ పూల్‌లో దూకమని టాస్క్ ఇచ్చాడు అవినాష్. అలా దూకితే ముద్దు పెడతాను అని యష్మీ ఆఫర్ ఇచ్చింది. కానీ చివరకు ప్రేరణకు ముద్దు పెట్టింది యష్మీ. ఆ తరువాత తేజకు నిఖిల్ ముద్దు పెడితే.. తాను పెట్టినట్టుగా యాక్షన్ చేసింది యష్మీ. ఆ విషయం తెలియక తేజ సంబరపడిపోయాడు. కానీ ముద్దు పెట్టింది నిఖిల్ అని తెలిసి నిరుగారిపోయాడు. ఆ తరువాత ఇంట్లో ఆఖరి మెగా చీఫ్ కంటెండర్ అయ్యేందుకు బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఈ క్రమంలో వచ్చిన ప్రేరణ, అవినాష్, గౌతమ్, నబిల్‌లను టీ షర్టులని చించేశారు. పృథ్వీ, తేజ, విష్ణు, యష్మీ టీ షర్టుల్ని బొమ్మలకు తొడిగేశారు. అలా ఈ నలుగురూ మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. మిగిలిన నిఖిల్, రోహిణిల్లోంచి ఎవరు మెగా చీఫ్ కంటెండర్ కానున్నారని మిగిలిన కంటెస్టెంట్లు డిసైడ్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. మరి కంటెస్టెంట్లు ఎవరిని మెగా చీఫ్ కంటెండర్‌గా ఎంచుకుంటారో.. ఆ ఐదుగురికి ఎలాంటి టాస్క్ పెడతారో.. ఎవరు చివరి మెగా చీఫ్ అవుతారో చూడాలి.

ఈ టాస్కులో యష్మీ, విష్ణుప్రియలు దూకుడుగా ఆడారు. పృథ్వీ టీ షర్ట్‌ని యష్మీ చించేందుకు, విష్ణు కాపాడేందుకు ప్రయత్నించింది. నిఖిల్, విష్ణు, నబిల్ ఇలా సపోర్ట్ చేయడంతో పృథ్వీ టీ షర్ట్ బొమ్మ మీదకు చేరింది. నా ఆట ఎలా ఉంది? అంటూ ఖాళీగా ఉన్న యష్మీని విష్ణు ప్రియ రెచ్చగొట్టింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విష్ణుకి కాస్త పిచ్చి అని ఈ వాగ్వాదం చూస్తే అర్థం అవుతోంది. ఎందుకు వాదనకు దిగుతుందో.. తన వాదనే కరెక్ట్ అని ఎందుకు నోరు ఎత్తుందో కనీసం అర్థం చేసుకోకుండా సీన్ చేసింది విష్ణుప్రియ. మళ్లీ యష్మీ మీదే విష్ణు నిందలు వేస్తూ వెళ్లిపోయింది.

Also Readబిగ్ బాస్ 8 తెలుగు ఎపిసోడ్ 78 రివ్యూ: 'మామా ఏక్ పెగ్ లా' అంటోన్న యష్మీ... విష్ణు ప్రియకు ‘బత్తాయి’, పృథ్వీకి బలుపు - బతికిపోయిన అవినాష్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Vizag Crime News: లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Embed widget