Bigg Boss Telugu Season 8 : యష్మీకి నాన్న సలహాలు.. నిఖిల్‌కు అమ్మ సూచనలు.. భార్యతో అవినాష్ కామెడీ
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ ఎపిపోడ్ కాస్త సరదాగా.. కాస్త ఎమోనల్‌గా సాగుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో యష్మీ నాన్న, నిఖిల్ అమ్మ, అవినాష్ భార్య వచ్చారు.

Yashmi Father Nikhil Mother And Avinash Wife in the House: బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ ఎపిపోడ్ కాస్త సరదాగా.. కాస్త ఎమోనల్‌గా సాగుతున్నాయి. బుధవారం నాటి ఎపిసోడ్‌లో యష్మీ నాన్న, నిఖిల్ అమ్మ, అవినాష్ భార్య వచ్చారు. ఇక యష్మీకి తన నాన్న సరైన సలహాలు ఇచ్చాడు. వాటిని ఫాలో అయితే ఇంకొన్ని వారాలు ఈ ఇంట్లో ఉంటుంది. చివరి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక నిఖిల్ తన తల్లి చెప్పిన సూచనలు కనుక ఫాలో అయితే.. కచ్చితంగా విన్నర్ అవుతాడు. ఇక అవినాష్ అయితే తన భార్యతో కలిసి యాక్షన్ రూంలో కామెడీ చేశాడు. ఈ బుధవారం ఎపిసోడ్ ఎలా సాగిందంటే..
యష్మీ ఫాదర్ రమేష్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన టైంలో అందరూ ఫ్రీజ్‌లో ఉన్నారు. తండ్రిని చూసి పప్పా అని యష్మీ అరిచేసింది. ఆ దెబ్బకు టాప్ లేచిపోద్దేమో అనిపించింది. ఇంట్లో ఎవరో పోయినట్టుగా ఏడ్పులతో విసిగించింది. ఆ ఏడ్పులు ఎందుకు? అని యష్మీని నాన్న మందలించాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు. ఇక యష్మీకి మంచి సలహాలు ఇచ్చాడు.
నీ టాస్కులు తగ్గాయ్.. గేమ్‌లు బాగా ఆడాలి.. వేరే ఏదో ఆలోచిస్తున్నావ్.. ఇంకో నాలుగు వారాలే ఉన్నాయ్.. నీ కోసం నువ్వు ఆడు.. బిగ్ బాస్ తరువాత ఎవరి లైఫ్ వాళ్లది.. నీకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది బయట.. ఏం చేయాలనుకుంటుందో అది చేయ్.. కానీ అది బయటకు చెప్పకు.. వేరే వాళ్లతో చర్చలు పెట్టకు.. నీ కోసం నువ్వు ఆడితే.. కచ్చితంగా గెలుస్తావ్.. ఇంట్లో నీ గురించి ఏమైనా మాట్లాడుకోనివ్వు.. అది వదిలేయ్.. నీ ఆట నువ్వు ఆడుకో అని మంచి సలహాలు ఇచ్చాడు. ఆ తరువాత యష్మీ కోసం వాళ్ల నాన్న ఆడిన టాస్కుతో 21 వేల ప్రైజ్ మనీ వచ్చేసింది.
ఆ తరువాత కాసేపు పెళ్లి టాస్కుని కంటిన్యూ చేశారు. కానీ అదేమీ నవ్వులు పూయించలేదు. నిఖిల్ మదర్ సులేఖ ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ మదర్ పేరు పేరునా ప్రతీ ఒక్కర్నీ పలకరించింది. గౌతమ్‌తో గొడవలు పెట్టుకోకు.. యష్మీని దూరంగా పెట్టు.. ప్రేరణతో ఎక్కువగా ఉండకు అంటూ ఇలా మంచి సూచనలు ఇచ్చింది. నామినేషన్స్‌లో నీ కారణాలతో నువ్వు నామినేట్ చేయ్.. వేరే వాళ్ల గురించి ఆలోచించకు.. గ్రూపు గేమ్ ఆడకు.. నీ కోసం నువ్వు ఆడుకో అంటూ ఇలా మంచి సూచనలు ఇచ్చింది. ఆ తరువాత నిఖిల్ మదర్ ఆడిన టాస్కుతో మటన్ వచ్చేసింది.
ఆ తరువాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. అంతా అలిసిపోయినట్టు ఉన్నారు.. కాసేపు పడుకోండి అని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. అలా ఇంటి సభ్యులంతా పడుకున్న టైంలో అవినాష్ భార్య అనూజ ఎంట్రీ ఇచ్చింది. అవినాష్ పక్కన పడుకుని చేతులు వేయడంతో.. అతను షాక్ అయ్యాడు. ఆ తరువాత భార్యతో కలిసి అవినాష్ గడిపేందుకు యాక్షన్ రూంలో బిగ్ బాస్ బాగా సెటప్ చేశాడు. క్యాండిల్ లైట్ డిన్నర్‌లా అవినాష్‌కు మంచి ఆఫర్ ఇచ్చాడు. అక్కడ కూడా బిగ్ బాస్‌తో, కెమెరాలతో అవినాష్ కామెడీ చేశాడు. ఏ పరిస్థితుల్లోనైనా నవ్వించడం అవినాష్‌కు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. అవినాష్, అనూజలకు ఇంటి సభ్యులతో కంపాటిబిలిటీ టెస్ట్ పెట్టించాడు. అందులో గెలిచినందుకు 51 వేల ప్రైజ్ మనీ వచ్చింది. అలా ఈ బుధవారం నాటి ఎపిసోడ్ కాస్త ఎమోషనల్‌గా, కాస్త సరదాగా సాగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

