Bigg Boss Telugu Season 8: యష్మీ గౌడ కాదు, ఫ్లిప్ స్టార్... విష్ణు ప్రియకి ఓట్లు వేస్తే వేస్టే... ఈ వారమైనా పంపించేస్తారా?
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం నామినేషన్ ప్రాసెస్వె రైటీగా జరిగింది. గౌతమ్, తేజ, పృథ్వీ, యష్మీ, అవినాష్, విష్ణు ఈ వారం నామినేట్ అయ్యారు.
11th week Nomination Process Vishnu And Yashmi Worst Behaviour: బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం నామినేషన్ ప్రాసెస్ కాస్త వెరైటీగా జరిగింది. ఒక్కో కంటెస్టెంట్ ఒక్కర్ని మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. బ్రష్ పట్టుకున్న కంటెస్టెంట్‌కు నామినేట్ చేసే పవర్ వస్తుందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. మెగా చీఫ్ అయిన కారణంగా ఈ నామినేషన్ ప్రాసెస్‌ను ప్రేరణ స్టార్ట్ చేసింది. గౌతమ్‌ని నామినేట్ చేస్తూ.. గ్రూపులో గేం సరిగ్గా ఆడడు.. అంటూ ఇలా ఏవేవో కారణాలు చెప్పింది. ఇక గౌతమ్ డిఫెండ్ చేసుకుంటూ.. మీది గ్రూపు గేమా?.. మీ ఫ్రెండ్స్‌లో తప్పులు ఏమీ కనిపించవా? వారిని నామినేట్ చేయవా? అని గౌతమ్ తిరిగి నిలదీశాడు.
ఆ తరువాత బ్రష్ పట్టుకుని నిఖిల్ నామినేట్ చేసేందుకు వచ్చాడు. తేజని నిఖిల్ నామినేట్ చేస్తూ.. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో తప్పు చేశాడని చెప్పాడు. నేను చేసింది తప్పు అయితే యష్మీ చేసింది ఏంటి? అని తేజ అడిగితే.. నిఖిల్ సమాధానం చెప్పలేకపోయాడు. అక్కడే నిఖిల్ గ్రూపు గేమ్ ఎక్స్ పోజ్ అయింది. నిఖిల్ కోసం పృథ్వీ వచ్చి తేజని ట్రిగ్గర్ చేశాడు. దమ్ము లేదా? అంటూ రెచ్చగొట్టేశాడు. ఈ కన్నడ బ్యాచను జనాలు ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంచుతారో చూడాలి.
గౌతమ్ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు. ఎదుటి వాళ్ల గురించి పట్టించుకోడు. ఫిజికల్ అవుతాడు.. గౌరవం ఇవ్వడు.. పక్కోడి గురించి పట్టించుకోడు.. ఆయన చేతికి ఉన్న కడెం వల్ల గాయాలు అవుతున్నాయి అంటూ ఇలా కారణాలు చెప్పుకొచ్చాడు. మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు కడెం అవసరం లేదు అంటూ పొగరుగా మాట్లాడాడు పృథ్వీ. అక్కడ కూడా పృథ్వీకి పాయింట్ అర్థం కాలేదు. ఏదో డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి.. చేసుకోవాలన్నట్టుగా చేశాడు. నీ బెదిరింపులకు నేను భయపడను అంటూ గౌతమ్ గట్టిగా కౌంటర్ వేశాడు.
తేజ వచ్చి యష్మీని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో నేను చేసింది తప్పు అయితే.. నా వెంటే వచ్చి ఎగ్ వేసిన యష్మీ చేసింది కూడా తప్పే.. నిఖిల్‌కు సపోర్ట్ చేసిన యష్మీ సండే ఎపిసోడ్‌లో నబిల్‌కు సపోర్ట్ చేసింది.. అదేదో ఆ రోజే నబిల్ పేరు చెప్పొచ్చు కదా.. అని లాజిక్ తీశాడు. ఇలా తన మాటలు ఫ్లిప్ చేసి. నిర్ణయాలు మార్చుకుని యష్మీ మళ్లీ దొరికిపోయింది. తేజ పాయింట్లను ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక యష్మీ నోరు పెద్దగా చేసి తేజ మీదకు వచ్చింది. తేజను ట్రిగ్గర్ చేసే ప్రయత్నం చేసింది. యష్మీ వరెస్ట్ బిహేవియర్‌ను సోమవారం ఎపిసోడ్‌లో చూడొచ్చు. ఈ వరెస్ట్ బిహేవియర్‌కు ఈ వారం మూల్యం చెల్లించుకుంటుందేమో చూడాలి.
పృథ్వీ అయితే సిల్లీ పాయింట్లతో అవినాష్‌ను కావాలనే నామినేట్ చేశాడు. రోహిణి అయితే విష్ణు ఇచ్చిన మాట తప్పిందని, ఏదో చేయాలి కాబట్టి.. చేయాలన్నట్టుగా చేసిందని చెప్పుకొచ్చింది. పృథ్వీతో గొడవ అయిందని రోహిణికి సపోర్ట్ చేస్తానని చెప్పింది విష్ణు. ఆ తరువాత మళ్లీ పృథ్వీతో ట్రాక్ సెట్ అయ్యాక.. అతడికే సపోర్ట్ చేసింది. కానీ విష్ణు మాత్రం వేరే కారణం చెప్పింది. మీరు నా గురించి మాట్లాడిన మాటలు నాకు తెలియడంతో.. నా మనసు విరిగింది అందుకే నీకు సపోర్ట్ చేయలేదు అని రోహిణి గురించి విష్ణు చెప్పింది. ఇక్కడ నాకు, పృథ్వీకి ఎన్ని గొడవలు అయినా, ఏం జరిగినా.. నా ప్రయార్టీ మాత్రం పృథ్వీకే ఉంటుంది అని విష్ణు అందరికీ చెప్పింది.
అసలు విష్ణు ప్రియ బిగ్ బాస్ ఇంటికి ఎందుకు వెళ్లిందో మర్చిపోయింది. బయట తనకు ఇంకా ఎవ్వరూ దొరకరేమో అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. అసలు ఈమెను ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు ఉంచుతున్నారు? జనాలు ఏం చూసి ఆమెను సేవ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. గౌతమ్, తేజ, పృథ్వీ, యష్మీ, అవినాష్, విష్ణు ఈ వారం నామినేట్ అయ్యారు. మరి యష్మీ, విష్ణుల్లోంచి ఎవరో ఒకరు బయటకు వెళ్తారని అంతా అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.