అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియని ఇంకెన్నాళ్లు భరించాలో.. ట్విస్టుల మీద ట్విస్టులు.. నసలా గంగవ్వ వాగుడు

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియని బిగ్ బాస్ ఇరికించేశాడు. అయితే ఇదే సమయంలో విష్ణు ప్రియ తన బుద్ధి చూపించింది. తన క్లాన్ కోసం ఆడింది.

9th week Nomination Process: బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ అదిరిపోయింది. మెగా చీఫ్ అయిన విష్ణుప్రియని బిగ్ బాస్ ఇరికించేశాడు. ఇంట్లోని ఐదుగురు కంటెస్టెంట్లను నామినేట్ చేసి జైల్లో వేయమని విష్ణుప్రియను ఆదేశించాడు. దీంతో విష్ణు ప్రియ తన బుద్ధి చూపించింది. తన క్లాన్ కోసం విష్ణు ప్రియ ఆడింది. తనకు ఇష్టులైన పృథ్వీ, నిఖిల్‌, అవినాష్, హరితేజలను మాత్రం నామినేషన్లోకి రాకుండా చూసుకుంది. అయితే బిగ్ బాస్ మాత్రం మంచి ట్విస్టులనే ఇచ్చాడు. అసలు సోమవారం నాటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

అవినాష్ తన హెల్త్ బాగా లేదని బయటకు వెళ్లాడు. అలా అవినాష్ బయటకు వెళ్లడంతో ఇంటి సభ్యులంతా వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే తెల్లారే సరికి మళ్లీ అవినాష్ తిరిగి వచ్చాడు. దీంతో ఇంట్లో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది. అనంతరం మెగా చీఫ్ విష్ణు ప్రియ చేత నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ స్టార్ట్ చేయించాడు. ఎవరో ఒకరిని నామినేట్ చేయాలి.. తన క్లాన్ నుంచి, తనకు నచ్చిన వారిని మాత్రం నామినేషన్లోకి రాకుండా చూసుకుంది. బాగా ఆడావ్ అని చెబుతూనే అందరినీ నామినేన్లోకి పడేసింది.

తనని చివరగా చీఫ్ చేసిన గౌతమ్‌నే ముందుగా విష్ణు నామినేట్ చేసింది. ఆడవాళ్లంటే గౌరవం ఉన్నట్టుగా చెబుతావ్.. కానీ నువ్వే యష్మీ మీద అరిచావ్ అని ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది విష్ణు. ఈ ప్రాసెస్‌లోనే గౌతమ్, యష్మీ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. అక్కా కాసేపు ఆగు.. ఇది నా నామినేషన్ ప్రాసెస్ అంటూ గౌతమ్ సెటైర్లు వేశాడు. అక్కా అని అనకు.. నాకు నచ్చదు.. అలా పిలవకు అంటూ యష్మీ ఫైర్ అయింది. గౌతమ్, విష్ణు మధ్య నామినేషన్ వాగ్వాదాం జరుగుతూ ఉంటే.. పృథ్వీ ఏదో సాధించినట్టుగా నవ్వేశాడు. దీంతో పృథ్వీ మీద గౌతమ్ కౌంటర్లు వేశాడు. దాంతో పృథ్వీకి సపోర్ట్‌గా నిఖిల్ వచ్చాడు. ఇదంతా చూస్తూ విష్ణు కూడా ఎంజాయ్ చేసినట్టుగా ఉంది. కానీ వారిని మాత్రం ఆపే ప్రయత్నం చేయలేదు.

ప్రేరణని నామినేట్ చేస్తూ బజ్జీల గురించి చెప్పింది. ఫేక్ ఫ్రెండ్ అని అన్నావ్.. అది నాకు నచ్చలేదు అంటూ విష్ణు ప్రియ నామినేట్ చేసింది. వీరిద్దరి నామినేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే మధ్యలోకి నయని, హరితేజ దూరారు. దీంతో గొడవ మరింత పెద్దగా మారింది. సంచాలక్‌కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటూ తేజని నామినేట్ చేసింది విష్ణు. నువ్వు చేసిన పనికి హార్ట్ చివుక్కుమంది అంటూ కొత్త కొత్త పెద్ద పెద్ద పదాలను వాడేసింది విష్ణు. అయితే తేజ తన డిఫెన్స్ స్టార్ట్ చేయడంతో విష్ణు తెల్లమొహం వేసింది. తేజకు ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నమిలేసింది.

మూడు వారాలున్న వాళ్లు ముఖ్యమా?.. అరవై రోజుల నుంచి వాళ్లు ఈ ఇంట్లో ఉండటం ముఖ్యమా? అని విష్ణు బ్రెయిన్‌ను పృథ్వీ వాష్ చేసేశాడు. దీంతో రాయల్ క్లాన్ నుంచే కంటెస్టెంట్లను నామినేట్ చేసింది. ఆ తరువాత వచ్చి టాస్కులు సరిగ్గా ఆడలేదంటూ నయనిని నామినేట్ చేసింది. నయని డిఫెన్స్ చేసుకుని పాయింట్లు చెబుతూ ఉంటే కూడా విష్ణు నోరెత్తలేకపోయింది. ఇక గంగవ్వ ఏదేదో పిచ్చి పిచ్చి వాగుతూ అంటే.. అసలు ఆమె బాధ ఏంటి? అని నయని చిరాకు పడింది. గంగవ్వ ఇంట్లో ఏమీ చేయకపోయినా.. అందరి మీదా ఇష్టమొచ్చినట్టుగా నోరు పారేసుకుంటున్నా.. మధ్యలోకి దూరుతూ ఉన్నా.. ఆమెను మాత్రం ఎవ్వరూ నామినేట్ చేయడం లేదు.. నామినేట్ చేసే సాహసాన్ని ఎవ్వరూ చేయరు కూడా.

గంగవ్వని నామినేట్ చేస్తే నెగెటివ్ అయిపోతామని కంటెస్టెంట్లు భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఐదో నామినేషన్ కోసం ఎక్కువ టైం తీసుకుంటూ ఉండటంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఏదో ఒక పేరు చెప్పాలని నబిల్ పేరు చెప్పినట్టుగా ఉంది. బ్రదర్ ఫీలింగ్ అని విష్ణు ఏదో చెప్పబోతోంటే.. నబిల్ ఫైర్ అయ్యాడు. నాకు ఈ ఇంట్లో ఏ సిస్టర్ లేరు అంటూ కౌంటర్ వేశాడు. వైల్డ్ కార్డులు వచ్చాక మారిపోయావ్.. ఫైర్ తగ్గింది.. అంటూ కారణాలు చెప్పింది. నా ఫైర్ వల్లే మెగా చీఫ్ అయ్యావ్ అని, ఎప్పుడూ పృథ్వీ వెంటే తిరుగుతూ ఉంటే వేరే వాళ్లు, వాళ్ల ఆట నీకు ఏం తెలుస్తుంది అంటూ నబిల్ తన పాయింట్లను చెబుతుంటే.. విష్ణు సైలెంట్ అయిపోయింది.

ఇక తనని ఎవరు మెగా చీఫ్ చేశారు? రాయల్ క్లాన్ చేసిందా? ఓజీ క్లాన్ చేసిందా? అని విష్ణు ప్రియ ఆలోచనలు చేసింది. రాయల్ క్లాన్‌కు ఆప్షన్ లేదు కాబట్టి నిన్ను చేశారు అని ఓజీ క్లాన్ అంతా కూడా విష్ణుకి బ్రెయిన్ వాష్ చేశారు. నువ్వు మాత్రం మన క్లాన్ నుంచే నామినేట్ చేశావ్ అని పృథ్వీ అంటే.. నేను అందరినీ ఎలా కాపాడగలను అని విష్ణు ప్రియ కాస్త ఎదురించింది. నబిల్‌ను మాత్రం విష్ణు సారీ అడిగింది. నేను తప్పు చేశా క్షమించు కావాలంటే నెక్ట్స్ వీక్ నామినేట్ చేసుకో అని దండం పెట్టేసింది.

విష్ణు ఐదుగుర్ని నామినేట్ చేసి జైల్లో వేసింది. అయితే పోలీస్ సైరన మోగినప్పుడు జైలు కీ పట్టుకుని.. ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేసి.. ఇంకో కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాల్సి ఉంటుందన్నాడు. ఒకసారి కీ పట్టిన వ్యక్తి.. ఇంకోసారి ఆ వ్యక్తి కీ పట్టుకోకూడదని చెబుతాడు. విష్ణు ప్రియ ఈ కీ కోసం ప్రయత్నం చేయొద్దని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో మొదటి సైరెన్‌కు పృథ్వీ కీ పట్టుకుని నబిల్‌ను సేవ్ చేసి.. అవినాష్‌ని నామినేట్ చేస్తాడు. ఆ తరువాత సైరెన్‌కి..  యష్మీ కీ పట్టుకుని ప్రేరణని సేఫ్ చేసి.. హరితేజను లోపలకి పంపిస్తుంది.

ఆ తరువాత మూడో సైరెన్‌కి రోహిణి కీ పట్టుకుని.. అవినాష్‌ని కాపాడి పృథ్వీని లోపలకు పంపించేస్తుంది. ఆ తరువాత అవినాష్ కీ పట్టుకుని.. తేజను కాపాడి యష్మీని లోపలకు పంపుతాడు. ఆపై ప్రేరణ కీ పట్టి.. పృథ్వీని కాపాడి తేజని లోపలకు పంపించేస్తుంది. అలా లోపలకు బయటకు అంటూ ట్విస్టుల మీద ట్విస్టుల జరిగాయి. అలా చివరకు ఈ తొమ్మిదో వారంలో.. గౌతమ్, నయని, హరితేజ, యష్మీ, తేజలు నామినేట్ అయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget