Bigg Boss 8 Telugu Episode 36 Day 35: గేర్ మార్చిన బిగ్ బాస్... ఇది కదా కావాల్సింది - ఆటకు గంగవ్వ మైనస్ అవుతుందా?
Bigg Boss 8 Telugu Episode 36: వైల్డ్ కార్డుల్లో అదిరిపోయే కంటెస్టెంట్లను దించాడు బిగ్ బాస్. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్, రోహణి, గౌతం, అవినాష్, గంగవ్వలు ఎంట్రీ ఇచ్చారు.
Wild Card Entries In Bigg Boss 8 Telugu, Royal Clan Vs Og Clan: బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు పదహారు మంది ఉన్నారు. వైల్డ్ కార్డులు ఎనిమిది మంది, ఓల్డ్ కంటెస్టెంట్లు ఎనిమిది మందితో బిగ్ బాస్ ఇక ఆటలు ఆడించేలా ఉన్నాడు. వైల్డ్ కార్డుల్లో అదిరిపోయే కంటెస్టెంట్లను దించాడు. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మెహబూబ్, రోహణి, గౌతం, అవినాష్, గంగవ్వలు ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డుల ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ కళకళలాడుతూ ఉంది. ఇక ఈ ఆదివారం నాడు వైల్డ్ కార్డులే కాకుండా సినిమా ప్రమోషన్స్ కూడా జరిగాయి.
స్వాగ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీంలు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాయి.రెండు వైల్డ్ కార్డు ఎంట్రీలు జరిగిన ప్రతీ సారి.. ఓ సినిమా ప్రమోషన్ జరిగింది. అలా హరితేజ, టేస్టీ తేజల ఎంట్రీ తరువాత స్వాగ్ టీం ప్రమోషన్ జరిగింది. శ్రీ విష్ణు, రీతూ వర్మలు ఓ టాస్క్ ఆడించారు. ఆ టాస్కులో హరితేజ, టేస్టీ తేజ విన్ అయ్యారు. దీంతో ఇరవై లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. దీంతో మొత్తంగా 38 లక్షలకు ప్రైజ్ మనీ చేరింది.
ఆ తరువాత నయని పావని, మెహబూబ్ ఎంట్రీ జరిగింది. వీరితో సుహాస్, సంగీర్తన ఆట ఆడించారు. ఈ టాస్కులో నయని, మెహబూబ్‌ల మీద సీత, విష్ణు గెలిచారు. దీంతో వారికి రేషన్, బెడ్రూం కంట్రోల్ పవర్ వచ్చింది. ఆ తరువాత గౌతం, రోహిణిలతో సుధీర్ బాబు ఆట ఆడించాడు. ఆ టాస్కులో సీత, విష్ణు ఓడిపోయారు. గెలిచిన గౌతమ్, రోహిణలకు స్టార్ వచ్చింది. దాని ప్రయోజనాలు తరువాత చెబుతాను అని బిగ్ బాస్ అన్నాడు.
ఇక చివరకు అవినాష్, గంగవ్వల ఎంట్రీ వచ్చింది. వారికి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ఆ టాస్కులో గంగవ్వ, అవినాష్ గెలిచాడు. వాళ్లకి వచ్చిన పవర్ గురించి తరువాత చెబుతాను అని బిగ్ బాస్ అన్నాడు. ఇలా ఆదివారం నాటి ఎపిసోడ్ ఫుల్ సర్ ప్రైజ్‌లతో నడిచింది. వైల్డ్ కార్డులంటే ఎవరో కొత్తవాళ్లు వస్తారని ఓల్డ్ కంటెస్టెంట్లు అనుకుని ఉంటారు. కానీ ఇలా వారి సీనియర్లే వస్తారని ఊహించి ఉండరు. మరి ఇకపై ఈ రెండు టీంల ఆటలు, వారి మధ్య పోటీలు ఎలా ఉంటాయో చూడాలి.
కాకపోతే ఈ వైల్డ్ కార్డుల్లో ఒక్క గంగవ్వ విషయమే తేడా కొట్టేలా ఉంది. హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ ఇలా అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మెహబూబ్, గౌతం నుంచి ఎంటర్టైన్మెంట్ ఆశించలేం. ఇక గంగవ్వ నుంచి పెద్దగా టాస్కులను ఆశించకూడదు. ఆమెను అందరూ సింపతీ కార్డులోనే చూస్తారు. ఆమెను నామినేట్ చేయరు. ఆమెతో గొడవ పెట్టుకోరు. అందరూ ఆమె చుట్టూ చేరి సింపతీ వర్కౌట్ చేయించుకుంటారు. మరి గంగవ్వతో ఈ సీజన్‌కు ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా అన్నది మున్ముందు తెలుస్తుంది.