Bigg Boss 8 Telugu Day 25 Promo: విష్ణు ప్రియ అంటే ప్రేమ, ఎట్టకేలకు ఓపెన్ అయిన పృథ్వీ... బాగ్ బాస్ మామూలోడు కాదు
బిగ్ బాస్ సీజన్ 8 డే 25 ప్రోమో తాజాగా రిలీజ్ కాగా, అందులో బిగ్ బాస్ విష్ణు ప్రియపై మనసులో ఉన్న మాటను పృథ్వీ బయట పెట్టేలా చేశారు బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 8 డే 25 కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఇందులో బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా బెలూన్ టాస్క్ ను పెట్టారు. అయితే టాస్క్ లో కంటెస్టెంట్స్ ను మునిగిపోయేలా చేసి, విష్ణు ప్రియపై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టేలా చేశారు బిగ్ బాస్. ఇంకా ఈ ప్రోమోలో ఉన్న విశేషాలు ఏంటి? పృథ్వీ, విష్ణు ప్రియ మధ్య ఏం జరిగింది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
పట్టుకుని ఉండు లేదా పగిలిపోతుంది
బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోకి ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని, వాళ్లు హౌస్ లోకి అడుగు పెట్టకుండా ఉండాలంటే 12 టాస్క్ లను హౌస్ మేట్స్ గెలవాల్సి ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండు టాస్కులు పెట్టగా, ఒక టాస్క్ ఓడిపోయారు హౌస్ మేట్స్. మరో టాస్క్ విన్ అయ్యి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపగలిగారు. ఇక తాజాగా 'పట్టుకుని ఉండండి లేదంటే పగిలిపోతుంది' అంటూ బిగ్ బాస్ బెలూన్ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ లో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ, కాంతారా క్లాన్ నుంచి నబిల్ అఫ్రిది పాల్గొన్నారు. ఇద్దరూ స్ట్రాంగ్ కావడంతో ఎవరు విన్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. "ఫ్రేమ్ మీద హ్యాండిల్ కి కట్టి ఉన్న మేకు బెలూన్ కి తగలకుండా చూసుకోవాలి హౌస్మేట్స్" అంటూ బిగ్ బాస్ టాస్క్ మొదలు పెట్టారు. అయితే ఈ ఛాలెంజ్ లో ఇటు పృథ్వీ, అటు నబిల్ చాలా సేపు పాల్గొన్నట్టుగా అనిపించింది.
Contestants battle it out in the intense Balloon Task! Who will rise to the challenge? #BiggBossTelugu8 #StarMaa @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/oKm6VnfxXX
— Starmaa (@StarMaa) September 26, 2024
read also : బిగ్ బాస్ వైల్డ్ కాtర్డ్ ఎంట్రీ లిస్ట్.. ఆ నలుగురు కన్ఫామ్ అట
విష్ణు ప్రియపై ప్రేమ.. ఓపెన్ అయిన పృథ్వీ
ఇక టాస్క్ సీరియస్ గా కొనసాగుతుండగా సంచాల గా ఉన్న మణికంఠ పాట పాడడంతో లేడి కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకున్నారు. కొంతమంది మాత్రం డిమోటివేట్ చేసినట్టుగా అవుతుంది అంటూ డిసప్పాయింట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ పృథ్వీని పాట పాడమని ఆదేశించారు. "పృథ్వీ మన కోసం ఒక పాట పాడతాడు" అని బిగ్ బాస్ అనగానే "ఎవరెవరో నాకెదురైనా" అంటూ యానిమల్ సాంగ్ పాడడం మొదలు పెట్టాడు పృథ్వీ. వెంటనే నబిల్ "హౌస్ లో ఆ పాటను పృథ్వి ఎవరి కోసం పాడుతున్నాడో అడగండి బిగ్ బాస్" అని అన్నాడు. వెంటనే పృథ్వీ "హౌస్ లో అయితే విష్ణు ప్రియ కోసం" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు. అయితే చాలా రోజుల నుంచి పృథ్వీతో లవ్ ట్రాక్ కోసం మొదటి రోజు కాఫీ ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెట్టి ఇంకా ట్రై చేస్తున్న విష్ణు ప్రియ ఈ మాట విని తెగ సంతోష పడిపోయింది. మొత్తానికి ఇన్ని రోజులకు విష్ణు ప్రియపై ప్రేమను కురిపించాడు పృథ్వి. అయితే జస్ట్ ఫన్ కోసమే అలా చెప్పాడా ? లేదంటే లవ్ ట్రాక్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడా? అనేది చూడాలి.
Read Also : బిగ్ బాస్ 8 నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్ళే.. లిస్ట్ లో సోనియా ఉందిగా