News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ

‘బిగ్ బాస్’ హౌస్‌లో శివాజీ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఆయన మైండ్‌గేమ్‌ను అర్థం చేసుకున్న కంటెస్టెంట్స్, హౌస్ మేట్స్ క్రమంగా ఆయనపై ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

‘బిగ్ బాస్’ సీజన్-7లో గురువారం ఎపిసోడ్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్‌తో కాయిన్స్ పంపకాల విషయంపై మాట్లాడాడు. తాను న్యాయంగా అందరికీ కాయిన్స్ ఇచ్చానని తెలిపాడు. ప్రియాంకకు 10 ఇచ్చా, అనుదీప్‌కు 8 ఇచ్చా.. నేను నీకు ఎక్కువగా ఇచ్చి ఉంటే జనాలు నన్ను దొంగ అనుకుంటారు అని పల్లవి ప్రశాంత్‌తో తెలిపాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ బజర్ దగ్గర నిలుచున్న ప్రిన్స్ యావర్‌కు ఫుడ్ ఇచ్చాడు. ఆ తర్వాత శివాజీ.. ప్రిన్స్ అడిగాడంటూ మరో రెండు చపాతీలు తీసుకుని ఇచ్చాడు. ఇది కంటెస్టెంట్లకు అస్సలు నచ్చలేదు. ఈ విషయాన్ని ఆట సందీప్ గట్టిగా అడిగాడు.. ఇక్కడ పనిచేస్తున్నవారు కూడా కంటెస్టెంట్లే. బజర్ దగ్గర కూర్చొని తినడం ఏమిటని అడిగాడు. 

ఆ తర్వాత శోభాశెట్టి కూడా శివాజీపై అరుస్తూ మాట్లాడింది. ‘‘ప్రతిసారి జనాలు జనాలు అనొద్దు. మమ్మల్ని మీరు తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 28 ఏళ్ల మెచ్యుర్డ్ అమ్మాయి. ఏది మంచిదో ఏది చెడో తెలుసుకోగలను. మీరు చెప్పక్కర్లేదు. ఇది తప్పేమో, జనాలు ఏమనుకుంటారో అని అనొద్దు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో శివాజీ కూడా గట్టిగానే మాట్లాడాడు. ‘‘ఏదీ నీకు వర్కవుట్ కాదు. ప్రతి దాన్ని ఇష్యూ చేయాలని చూస్తావు’’ అని అన్నాడు. దీనిపై శోభాశెట్టి స్పందిస్తూ.. ‘‘ప్రతి దాన్ని ఇష్యూ చేయాలని చూసేది మీరు. నేను కాదు. నా క్యారెక్టర్ ఇదే. నేను ఇలాగే ఉంటా’’ అని పేర్కొంది. శోభాశెట్టితో గొడవ తర్వాత శివాజీ పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. ‘‘వాడికి (యావర్‌కు) లోపలికి వచ్చి తిను, ఎందుకు వారికి అవకాశం ఇస్తావని చెప్పాను కదా. నలుగురు ఐదుగురు ఎగబడతారేంది వారు. ఏదొచ్చినా నలుగురు ఎగబడుతున్నారు. రెండు నిమిషాలు పట్టదు.. ఎత్తిపడేస్తా’’ అని అన్నాడు. 

పవర్ అస్త్ర కంటెస్టెంట్స్‌గా ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్

ఏటీఎం బజర్ నొక్కి యావర్ ఛాన్స్ కొట్టాడు. తన పార్టనర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నాడు. ప్రత్యర్థులుగా అమర్ దీప్, గౌతమ్‌లను ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్.. ‘గ్లాస్ ఈజ్ షార్ట్.. ఫిల్ ఇట్ ఫాస్ట్’ అనే టాస్క్ ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువగా ఏడ్చి కన్నీటిని ఆ గ్లాసులో నింపుతారో.. ఆ టీమ్ విన్ అయినట్లని బిగ్ బాస్ తెలిపాడు. అయితే, ఈ టాస్క్‌ను పూర్తిగా చూపించలేదు. ఇప్పటికే లైవ్‌లో ఈ టాస్క్ చూసిన మీమర్స్ ట్రోల్ చేయడంతో ఎక్కువ ఫూటేజ్‌ను టెలికాస్ట్ చేయలేదు. ఈ టాస్క్‌లో యావర్, పల్లవి ప్రశాంత్‌లు విజేతలుగా నిలిచారని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లు.. అమర్ దీప్, గౌతమ్ వద్ద ఉన్న కాయిన్స్ మొత్తం తీసుకుని విజేతలుగా నిలిచారు. ఇద్దరూ పవర్ అస్త్ర కంటెస్టెంట్‌లుగా నిలిచారు.

మూడో కంటెస్టెంట్ పోటీ కోసం గాలా పార్టీ

మూడో కంటెస్టెంట్‌ను ఎంపిక చేయడం కోసం బిగ్ బాస్.. గాలా పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఎవరైతే క్రియేటివ్‌గా తయారై మెప్పిస్తారో.. వారిలో ఒకరు పవర్ అస్త్ర కోసం పోటీ పడేందుకు మూడో కంటెస్ట్‌గా ఎంపిక అవుతారని బిగ్ బాస్ వెల్లడించారు. దీంతో కంటెస్టెంట్‌లు అంతా రకరకాల వేషాలు వేసుకుని మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేశారు. భయానకమైన మేకప్‌లతో ప్రేక్షకులను ఇరిటేట్ చేశారు. మరి, ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Also Read: ఓరి వీరి వేషాలో, చూస్తుంటునే డోకు వస్తోందిగా - వింత అవతారాల్లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు, దెయ్యం పిల్లగా ప్రియాంక!

Published at : 28 Sep 2023 10:37 PM (IST) Tags: Shobha Shetty amardeep Shivaji Bigg Boss Telugu 7 Bigg Boss 7 Telugu prince yawar

ఇవి కూడా చూడండి

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

టాప్ స్టోరీస్

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు

Jharkhand CM: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు - ఆరోసారి సమన్లు పంపిన అధికారులు