News
News
X

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

Bigg Boss 6 Telugu: మొదటివారం నుంచి ఇంటికి కెప్టెన్ అవుదామనుకున్న రేవంత్ కోరిక ఈ వారం తీరినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 33వ ఎపిసోడ్ కి చేరుకుంది. తన బర్త్ డే సందర్భంగా తమ కోరికలను  చెప్పమని అడిగాడు బిగ్ బాస్. ఒక్కొక్కరూ ఒక్కో కోరికను చెప్పసాగారు. శ్రీహాన్ తన పేరుతో పెట్టిన ‘శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్’ ద్వారా సాయం చేయమని స్నేహితులను కోరాడు. అలాగే తన తల్లిదండ్రులతో తరచూ మాట్లాడమని ప్రేయసి సిరికి చెప్పాడు. ఇక బాలాదిత్య తన కూతురికి మంచి పేరు పెట్టాలని కోరాడు. ఇక రేవంత్ తన భార్యని, తల్లిని తలచుకుని,వాళ్లు ఎలా ఉన్నారో తెలియజేయాలని కోరాడు. ఇక ఆర్జే సూర్య తన తల్లి, తండ్రి, బుజ్జమ్మ ఎలా ఉన్నారో వీడియో చూపించమని కోరారు. ఇనయ తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయిపోయింది. సుదీప తన భర్త రంగనాథ్ ఫోటో, టీషర్టు అడిగింది. 

కుక్క బొచ్చు కావాలట...
ఇక గీతూ ఎప్పటిలాగే వెరైటీగా ప్రవర్తించింది. తల్లినో, తండ్రినో, భర్తనో కాకుండా తన కుక్కల్ని తలచుకుంది. తన రెండు కుక్కల బొచ్చులు కావాలని అడిగింది. అది తనకు చాలా అమూల్యమైనదని అంది. ఇక ఆది రెడ్డి తన కూతురి బర్త్ డే బిగ్ బాస్ హౌస్‌లో జరగాలని కోరుకున్నాడు. అలా జరిగితే బాగా ఓట్లు పడతాయని తెలుసు కాబట్టే తెలివిగా కోరాడు. 

రేవంత్ కెప్టెన్ అయ్యాడా?
ఇక బిగ్‌బాస్ కెప్టెన్ గీతూని బాగా ఆడిన ఆరుగురి పేర్లు చెప్పమని అడిగాడు. ఆమె ఫైమా, రేవంత్, సూర్య, బాలాదిత్య, గీతూ, రాజ్‌లను సెలెక్ట్ చేసింది. దీంతో ఇనయా అలిగింది. తనను కావాలనే సెలెక్ట్ చేయలేదని బాధపడింది. కెప్టెన్సీ కంటెండర్లకు గొడ్డలితో కట్టెలు కొట్టే టాస్క్ ఇచ్చారు. ఈ కెప్టెన్సీ టాస్కులో రెండు లెవెల్స్ లో పోటీ జరుగుతుందని చెప్పారు బిగ్ బాస్. ఇందులో మొదటి లెవెల్ లోనే ఫైమా, రాజ్, గీతూలు ఓడిపోయారు. మిగతా ముగ్గురూ రెండో రౌండ్ కి వెళ్లారు. మొదటి లెవెల్ లో కట్టెలు కొట్టి, బిగ్ బాస్ కన్ను పజిల్ ను అమర్చే టాస్కును ఇచ్చారు. ఇందులో అతి తక్కువ సమయంలో ఈ రెండు పనులు పూర్తి చేసి మొదటి లెవెల్లో మొదటి స్థానంలో నిలిచాడు సూర్య. తరువాత బాలాదిత్య, రేవంత్ వరుసగా నిలిచారు. ఫైమా, రాజ్, గీతూ అవుట్ అయ్యారు. రెండో లెవెల్ గేమ్ తరువాతి ఎపిసోడ్లో జరగనుంది.  ఇందులో అందుతున్న సమాచారం ప్రకారం రెండో లెవెల్లో రేవంత్ గెలిచి కెప్టెన్ అయ్యాడట. 

గీతూ ఎందుకలా చెప్పింది?
ఎపిసోడ్ మొదట్లోనే రేవంత్ గురించి కాస్త చెడు అభిప్రాయం కలిగే ప్రయత్నం చేపింది గీతూ. రేవంత్ తో ‘నువ్వు చాలా ఫ్రీగా ఉంటున్నావ్ అన్నా. దాని వల్ల అమ్మాయిలు కంఫర్టో కాదో తెలుసకోండి’ అంది. దానికి రేవంత్ ‘ఏ విషయం గురించి చెబుతున్నావ్’ అని అడిగాడు. దానికి గీతూ ‘నువ్వు నాకు ముద్దుపెట్టావ్. నేను కంఫర్టబుల్ గా లేను. అలాగే ఫైమా మీద పడుకున్నావ్. ఆ విషయంలో ఆమె కంఫర్టో కాదో తెలియదు కదా’ అంది. దానికి రేవంత్ ‘ఛీ ఛీ నాకు ఆ ఉద్ధేశం లేదు’ అని చెప్పుకొచ్చాడు. ఫైమా వచ్చాక సారీ చెప్పాడు. దానికి ఫైమా ‘నేనేం ఫీలవ్వలేదు, ఎవరైనా ఏమైనా అన్నారా’ అని అంది. గీతూ పక్క వాళ్ల తప్పులను ఎంచడంలో చూపించే శ్రద్ధ, తన ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకునే అంశంపై మాత్ర పెట్టదు.  

News Reels

Also read: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?

Also read: ఎపిసోడ్‌లో హైలైట్ ఫైమానే, అందరినీ నవ్వించింది ఈమె ఒక్కతే, గీతూ ఎప్పటిలాగే ఓవర్ యాక్షన్

Published at : 07 Oct 2022 07:31 AM (IST) Tags: Geethu Bigg boss 6 Telugu Written Updates Bigg Boss 6 Telugu highlights Bigg Boss 6 Telugu Episode 33 Revanth become Captain

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్నది ఆదిరెడ్డి కాదు శ్రీహాన్?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.