అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: సిరి కోసం గేమ్ ఆడి.. అడ్డంగా బుక్కైన మానస్..
సెకండ్ రౌండ్ లో సన్నీ-సిరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండడంతో వీరిద్దరూ ఛాలెంజ్ లో తలపడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చేది నీళ్ల టాస్క్ కావడంతో సిరి పెర్సనల్ ప్రాబ్లమ్ వలన ఆడలేనని చెప్పింది.
సన్నీకి ఇచ్చిన పవర్ తో ఒక హౌస్ మేట్ దగ్గర ఉన్న సగం గోల్డ్ తీసుకొని వేరొక హౌస్ మేట్ కి ఇవ్వాలి. సిరిని సెలెక్ట్ చేసుకొని ఆమె దగ్గర సగం గోల్డ్ ని షణ్ముఖ్ కి ఇచ్చాడు సన్నీ. ఫస్ట్ రౌండ్ లో మానస్-ప్రియాంకల దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండడంతో వాళ్లు మొదటి ఛాలెంజ్ లో మొదటి కెప్టెన్సీ పోటీదారులయ్యేందుకు పోటీ పడ్డారు.
మొదటి కెప్టెన్సీ పోటీదారులుగా ప్రియాంక..
పంప్ సహాయంతో బెలూన్స్ లో గాలిని నింపుతూ పగలగొట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ని పగలగొడతారో వాళ్లే మొదటి కెప్టెన్సీ పోటీదారులవుతారు. ఈ టాస్క్ లో ప్రియాంక ఎక్కువ బెలూన్స్ పగలగొట్టడంతో ఆమె మొదటి కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికైంది.
సిరి అంతగా ఏడవడానికి కారణం ఏంటని రవి ఆమె దగ్గరకు వెళ్లి అడిగాడు. షణ్ముఖ్ అంతగా ఏమన్నాడని ప్రశ్నించగా.. నాదే తప్పని చెప్పింది సిరి. ఇద్దరూ ఒకరినొకరు సీరియస్ గా తీసుకుంటున్నారనిపిస్తుందని రవి అన్నాడు. మీరే ఆలోచించుకోండి అంటూ సలహా ఇచ్చాడు.
శ్రీరామ్ కి పవర్ రూమ్ యాక్సెస్..
శ్రీరామచంద్రకి పవర్ రూమ్ యాక్సెస్ రావడంతో కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన అతడికి 30 గోల్డ్ ఇచ్చి పవర్ టూల్ తీసుకోమని ఆఫర్ చేశారు బిగ్ బాస్. ఆ టూల్ ను తనే తీసుకుంటానని చెప్పాడు శ్రీరామ్. కానీ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకొచ్చి ఇంటి సభ్యులతో బేరం పెట్టాడు. పవర్ గురించి చదివే ముందు హౌస్ మేట్స్ కి ఆఫర్ ఇస్తున్నానని చెప్పిన శ్రీరామ్.. పవర్ టూల్ కావాలంటే 50 గోల్డ్ తనకు ఇవ్వాలని అడిగాడు. హౌస్ మేట్స్ అందరూ ఆలోచించే సమయంలో రవి తనకు పవర్ కావాలని అడిగాడు. వెంటనే శ్రీరామ్ కి గోల్డ్ ఇచ్చి పవర్ టూల్ తీసుకున్నాడు రవి. ఇంతకీ పవర్ ఏంటంటే.. 'మీ దగ్గర ఉన్న సగం బంగారాన్ని తిరిగి బిగ్ బాస్ కి ఇవ్వండి. మీరు ఇస్తున్న సగం బంగారాన్ని తిరిగి స్టోర్ రూమ్ లో పెట్టండి' అని చెప్పారు బిగ్ బాస్. రవి దగ్గర గోల్డ్ లేకపోవడంతో గమ్మునుండిపోయాడు. శ్రీరామ్.. రవికి బాగా వేశాడని హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుకున్నారు.
సెకండ్ రౌండ్ లో సన్నీ-సిరి దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండడంతో వీరిద్దరూ ఛాలెంజ్ లో తలపడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చేది నీళ్ల టాస్క్ కావడంతో సిరి పెర్సనల్ ప్రాబ్లమ్ వలన ఆడలేనని చెప్పింది. దీంతో ఆమెకి బదులుగా వేరొక హౌస్ మేట్ ఆడి గెలిస్తే ఆ గెలుపు సిరిదే అని చెప్పారు. దానికోసం సిరి.. షణ్ముఖ్ సలహా మేరకు మానస్ ని ఎంపిక చేసుకుంది.
టాస్క్ ఏంటంటే.. పోటీదారులిద్దరూ స్విమ్మింగ్ పూల్ స్టార్టింగ్ లో ఉన్న టీషర్ట్ ను ఒక్కొక్కటిగా ధరించి పూల్ లోకి దూకి.. పూల్ ఇంకోవైపు ఉన్న టీషర్ట్స్ లో మళ్లీ ఇంకొకటి ధరించి పూల్ లోకి దూకి స్టార్ట్ పాయింట్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగేప్పటికీ ఎవరైతే ఎక్కువ టీషర్ట్స్ ధరిస్తారో వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో మానస్ 22 టీషర్ట్స్ ధరించాడు. సన్నీ సరిగ్గా టీషర్ట్స్ వేసుకోకపోవడంతో సంచాలక్ గా వ్యవహరించిన రవి కొన్ని కౌంట్ చేయలేదు. దీంతో సన్నీకి 19 టీషర్ట్స్ వచ్చాయి.
దీంతో సన్నీ ఫైర్ అయ్యాడు. ఒక్కదానికి కూడా లేబుల్ లేదని..ప్రతీసారి తనకే ఇలా జరుగుతుందని మండిపడ్డాడు. దీంతో రవి అతడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. 'నేను పడ్డ కష్టం నీకు కనిపించలేదా..? నేను ఎక్కువ టీషర్ట్స్ ధరించినా ఉపయోగం లేకుండా పోయిందని' ఎమోషనల్ అయిపోయాడు సన్నీ.
'వాడ్ని అడిగితే వాడు కూడా చెప్పడు సరిగ్గా అంటే ఏంటో.. మళ్లీ ఫ్రెండు' అంటూ మానస్ ని తిట్టుకున్నాడు సన్నీ. ఆ తరువాత మానస్ తో వెళ్లి డిస్కషన్ పెట్టాడు. మానస్ కూడా సన్నీ సరిగ్గా టీషర్ట్స్ వేసుకోలేదని చెప్పడం, 'అర్ధం కాకున్నా.. హడావిడిలో కూడా సరిగ్గా టీషర్ట్స్ వేసుకొని ఆడాలని' కాజల్ అనడంతో సన్నీ మరింత కోప్పడ్డాడు. మీరు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తే ఎలా అంటూ హర్ట్ అయ్యాడు. ఆ తరువాత సన్నీ వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దూకాడు. మానస్ కూడా పూల్ లోకి వెళ్లాడు.
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్కమింగ్ టాలెంట్కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion