News
News
X

Bigg Boss 5 Telugu: లహరి-శ్రీరామ్ లకు పెళ్లి చేసిన హౌస్ మేట్స్.. ప్రియాకు బ్యాడ్ న్యూస్.. 

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలోకి వచ్చేసింది. ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారంలోకి వచ్చేసింది. ఈ వారం నామినేషన్ ఎపిసోడ్ లో ఎంత పెద్ద రచ్చ జరిగిందో తెలిసిందే. ఇప్పటికీ హౌస్ లో నామినేషన్ కి సంబంధించిన నెగెటివిటీ కొనసాగుతూనే ఉంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న లహరి, ప్రియాంక, మానస్, శ్రీరామచంద్ర, ప్రియాలు ఉన్నారు. వీరిలో హౌస్ నుంచి బయటకు వెళ్లేదెవరో వీకెండ్ లో తెలిసిపోతుంది. ఇదిలా ఉండగా.. నిన్నటి నుంచి హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. 

Also Read: 'అబ్బాయిలతో మాట్లాడితే తేడాగా చూస్తావ్.. బాడీ షేమింగ్ చేస్తావ్..' ప్రియాపై హమీద ఫైర్..

ఈ టాస్క్ లో హైదరాబాద్ అమ్మాయి లహరికి, అమెరికా అబ్బాయ్ శ్రీరామచంద్రను ఇచ్చి పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ తో ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు హౌస్ మేట్స్. ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో ఒకటి బయటకి వచ్చింది. అందులో షణ్ముఖ్.. శ్వేతాపై కౌంటర్ వేయడంతో ఆమె సీరియస్ అయిపోయింది. షణ్ముఖ్ వెళ్లి సారీ చెప్పినా.. ఆమె యాక్సెప్ట్ చేయలేదు. 

ఇక తాజాగా మరో ప్రోమోను వదిలారు. అందులో హౌస్ మేట్స్ అంతా డాన్స్ చేస్తూ కనిపించారు. మ్యారేజ్ బ్రోకర్ అయిన షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. శ్రీరామ్ పెళ్లి క్యాన్సిల్ చేయమని అడుగుతుంది సిరి. నాకేంటి అని షణ్ముఖ్ అడగ్గా.. సిరి అతడిని హగ్ చేసుకుంటూ కనిపించింది. ఆ తరువాత హమీద తనకొక్క ఛాన్స్ ఇవ్వమని శ్రీరామ్ ను అడుగుతూ కనిపించింది. మరోపక్క శ్రీరామ్ ను చిన్నప్పటినుంచి ప్రేమిస్తున్నాను అంటూ సిరి వెంటపడుతూ ఉంటుంది. మొత్తానికి ఈ ప్రోమోను చాలా ఎంటర్టైనింగ్ గా కట్ చేశారు. ప్రోమో చివర్లో అందరూ కలిసి లహరి-శ్రీరామచంద్రలకు పెళ్లి చేసేశారు. ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లో ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రియా.. ఏదో బ్యాడ్ న్యూస్ విన్నట్లుగా ముఖకవళికలు మార్చేసింది.  

Published at : 22 Sep 2021 05:02 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Lahari Priya sreeramachandra

సంబంధిత కథనాలు

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?

Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల