By: ABP Desam | Updated at : 22 Sep 2021 10:32 AM (IST)
ప్రియాపై హమీద ఫైర్..
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి నామినేషన్ ప్రక్రియ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే..
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సభ్యులు లహరి, ప్రియాంక, మానస్, శ్రీరామచంద్ర, ప్రియా.
Also Read: బిగ్ బాస్ ప్రోమో: నోరుజారిన ఫలితం.. ప్రియాను వెంటాడుతున్న లహరి, రవిల లేట్ నైట్ హగ్!
ఆ తరువాత ప్రియా ఏడుస్తూ ఉండగా.. ప్రియాంక, మానస్ లు వచ్చి ఆమెని ఊరుకోబెట్టే ప్రయత్నం చేశారు. లహరి 'సింగిల్ మెన్', 'మ్యారీడ్ మెన్' వ్యాఖ్యల గురించి.. రవిని ప్రశ్నించింది. అయితే, తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రవి చెప్పాడు. ఆ తరువాత ప్రియా, లహరి, రవి కూర్చొని డిస్కషన్ పెట్టారు. 'లహరిని మీ దగ్గర తక్కువ చేసి మాట్లాడానా..?' అని ప్రియాని అడిగాడు రవి. 'సింగిల్ మెన్ ని వదిలేసి.. నాతోనే ఉంటుంది.. నేను చెప్పలేకపోతున్నా' అని అన్నావ్ బ్రో అని ప్రియా చెప్పింది. ఆ తరువాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న రవి, లహరి మాట్లాడుకున్నారు. 'ఆమె ఇప్పటికీ రియలైజ్ అవ్వట్లేదని' లహరి అనగా.. తనను బ్యాడ్‌గా ప్రొజెక్ట్ చేయాలని ప్రియా చూస్తోందని రవి అన్నాడు. గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉన్న ప్రియా.. తాను చూసిందే చెప్పానని, ఏదీ కల్పించి చెప్పలేదమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక ఉదయాన్నే 'సరైనోడు..' సాంగ్ కి హౌస్ మేట్స్ అందరూ డాన్స్ చేశారు. హౌస్ మేట్స్ అందరి ముందు లహరికి క్షమాపణలు చెప్పింది ప్రియా. అలానే నిత్య(రవి భార్య)కు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వమని రవి అడిగాడు. మొదట ఒప్పుకోని ప్రియా.. ఆ తరువాత జరిగిన విషయాన్ని నిత్య, లహరి ఫ్యామిలీకు కెమెరా ముందు చెప్పింది.
'హైదరాబాద్ అమ్మాయ్.. అమెరికా అబ్బాయ్'..
హౌస్ మేట్స్ అందరికీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంతకీ టాస్క్ పేరేంటంటే.. 'హైదరాబాద్ అమ్మాయ్.. అమెరికా అబ్బాయ్'.
ఈ టాస్క్ లో లహరి.. హైదరాబాద్ అమ్మాయిగా, యానీ-నటరాజ్ ఆమె పేరెంట్స్ గా.. జెస్సీ ఆమె టీనేజ్ బ్రదర్ గా.. రవి.. అమ్మాయి మావయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా, మానస్.. అమ్మాయి పొరుగింటి వారుగా నటించాలి.
శ్రీరామ్.. అమెరికా నుంచి తిరిగొచ్చిన అబ్బాయ్ గా, విశ్వ.. అబ్బాయ్ పర్సనల్ అసిస్టెంట్ గా, ప్రియా.. అబ్బాయి తల్లిగా, సిరి.. అబ్బాయి చిన్ననాటి స్నేహితురాలుగా, కాజల్.. అబ్బాయి వాళ్ల అక్కగా, సన్నీ.. అబ్బాయి ఫ్రెండ్ గా, హమీద.. అబ్బాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, షణ్ముఖ్.. మ్యారేజ్ బ్రోకర్ గా, లోబో.. ఈవెంట్ మేనేజర్, శ్వేతా.. లోబోకి అసిస్టెంట్ గా నటించాలి.
ఈ టాస్క్ రేపటి ఎపిసోడ్ లో కంటిన్యూ అవ్వనుంది.
Also Read: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్‌లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్‌కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Income Tax Rule: బిగ్‌బాస్, లాటరీ విజేతలకు 'పన్ను పోటు' ఎంత! తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు