Bigg Boss 5 Telugu: సెకండ్ ప్లేస్ లో సిరి.. క్లాస్ పీకిన నాగార్జున..
ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున సిరికి క్లాస్ పీకారు.
బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇక మిగిలిన ఐదుగురు సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్ లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
'హౌస్ లో ఆరుగురు ఉన్నారు.. నేను ఆరు నిమిషాల టైం ఇస్తున్నాను.. హౌస్ లో మీ పొజిషన్ ఏంటో మాకు తెలియాలి. కానీ ఈసారి చాలా సీరియస్ గా ఉండాలని' చెప్పారు నాగార్జున. ముందుగా మానస్ టాప్ ప్లేస్ లో నుంచున్నాడు. వెంటనే కాజల్.. 'నేను కూడా నెంబర్ వన్ లో నుంచోవాలనుకుంటున్నాను' అని చెప్పింది. దానికి నాగార్జున 'మరి మొన్న ఎందుకు వన్ ఎవరికో ఇచ్చేశావ్..?' అని ప్రశ్నించారు.
తరువాత సన్నీ కూడా టాప్ ప్లేస్ లో నుంచున్నాడు. దానికి నాగ్ 'నువ్ అర్హుడివా..?' అని ప్రశ్నించారు. 'అనిపించింది సార్' అని చెప్పాడు. షణ్ముఖ్ కూడా టాప్ ప్లేస్ లో నుంచొని.. 'ఫస్ట్ ఈ హౌస్ కి వచ్చినప్పుడు నేను విన్ అయిపోవాలని రాలేదు. నేర్చుకుందాం అనుకున్నాను. కానీ కొన్ని వారాల తరువాత నాకు విన్ అవ్వాలని అనిపించింది' అని చెప్పాడు.
షణ్ముఖ్ దిగిన వెంటనే.. సిరి సెకండ్ ప్లేస్ లో నుంచొని 'నేను చాలా క్లియర్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను(ఫస్ట్ ప్లేస్ లో షన్నుని చూడాలనుకుంటుంది)' అని చెప్పింది. 'మీరు మీ గురించి స్టాండప్ అవ్వనప్పుడు జనాలు మీకోసం ఎలా స్టాండ్ తీసుకుంటారు..?' అని నాగార్జున ప్రశ్నించారు.
Evari place ento decide cheddam!#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/QaW9UXc9iq
— starmaa (@StarMaa) December 11, 2021
Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
Also Read: 'సుడిగాలి' సుధీర్కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి