News
News
X

Bigg Boss 5 Telugu: 'నన్ను తీసి పడేస్తారు.. జోకర్ అంటారు, లఫంగ్ అంటారు' మండిపడ్డ లోబో.. 

నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది.

FOLLOW US: 

నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. లహరి-శ్రీరామచంద్రల పెళ్లి చెడగొట్టమని మానస్.. మ్యారేజ్ బ్రోకర్ షణ్ముఖ్, ఈవెంట్ మేనేజర్ లోబోలకు కోటి రూపాయలు ఆఫర్ చేశాడు. ఆ తరువాత రవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగా ప్రియా నెక్లెస్ ను దొంగిలించాల్సి ఉంటుంది. పట్టుబడినా.. టాస్క్ గురించి ఎవరికైనా చెప్పినా కెప్టెన్సీ టాస్క్ కి పోటీదారులైనా అవకాశాన్ని కోల్పోతారని హెచ్చరించారు బిగ్ బాస్. 

ఆ తరువాత షణ్ముఖ్-జెస్సీ కలిసి సిరి గురించి డిస్కషన్ పెట్టాడు. తనకు సిరిని ఇంక దూరం పెట్టాలని ఉందని.. సేఫ్ గేమ్ ఆడుతూ తన యూనిక్ స్టైల్ ను లూజ్ అవుతుందని షణ్ముఖ్ అన్నాడు. బహుశా తనే సిరి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు షణ్ముఖ్ చెప్పాడు. 

ప్రియా చేసిన కామెంట్స్ ను గుర్తు తెచ్చుకుంటూ ఫీలైపోయింది లహరి. రవితో కలిసి గార్డెన్ ఏరియాలో నడుస్తూ.. ఇప్పటివరకు తనపై ఎలాంటి రూమర్స్ లేవని.. కానీ ఇప్పుడేమో ఇలా అంటూ ఫీల్ అవుతుండగా.. రూమర్స్ రాకపోవడమే బ్యాడ్ అని.. రూమర్స్ అనేవి ఉంటేనే సెలబ్రిటీ అవుతావని అన్నాడు. పబ్లిక్ ఫిగర్ వి కాబట్టి పది మంది పది మాటలు అంటారని ఇండస్ట్రీ వాళ్ల పరిస్థితుల గురించి చెప్పాడు. 

ఇక ఉదయాన్నే 'వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే' సాంగ్ కి హౌస్ మేట్స్ డాన్స్ చేశారు. ఆ తరువాత మానస్ ని కాసేపు ఆటపట్టించాడు రవి. శ్రీరామచంద్ర పెళ్లి క్యాన్సిల్ చేయమని షణ్ముఖ్ ని రిక్వెస్ట్ చేసింది సిరి. 

Also Read: 'అబ్బాయిలతో మాట్లాడితే తేడాగా చూస్తావ్.. బాడీ షేమింగ్ చేస్తావ్..' ప్రియాపై హమీద ఫైర్..

షణ్ముఖ్-శ్వేతా డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. లోబోకి హ్యాండ్ ఇచ్చి ఇద్దరం జెండా ఎత్తేద్దాం అంటాడు షణ్ముఖ్. ఫిఫ్టీ ఫిఫ్టీ పెర్సెంటేజ్ ఇస్తే ఓకే అంటాది శ్వేతా. దానికి షణ్ముఖ్ తనను పెళ్లి చేసుకుంటే మొత్తం డబ్బులు నీవే అంటాడు. దానికి ఆమె ఓకే చెప్పేసి హగ్ చేసుకుంటుంది. ఈ విషయంలో లోబో సీరియస్ అవుతూ అలా ఎలా చేస్తావ్ శ్వేతా అంటూ తెగ ఫీలైపోతూ ఉంటాడు. ఈ స్కిట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సిరి, శ్రీరాంచంద్ర, సన్నీ, కాజల్, జెస్సీ, ప్రియాంక ఇలా అందరూ తమకిచ్చిన పాత్రల్లో నిమగ్నమై నటించేశారు. 

ఆ తరువాత లోబో శ్వేతకు ప్రపోజ్ చేస్తాడు. అది షన్ను చూసి శ్వేతను పిలిచి 'ఆయన పట్టుకుంటే ఆపట్లేదేంటి నువ్వు?' అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంటాడు. దానికి శ్వేత 'సార్ ఆగండి' అనుకుంటూ వెనకే వెళ్తుంది. 'ఏమైనా అందామంటే ముఖంమ్మీద పెయింటేసి కొడతాది మళ్లీ' అని నోరు జారాడు షణ్ముఖ్. ఆ డైలాగ్ కు శ్వేతకు చాలా కోపం వచ్చి 'దట్ వజ్ నాట్ ఫన్నీ' అంటూ రెస్ట్ రూమ్ లోకి వెళ్లిపోయింది.

ఈ విషయంలో లోబో కాస్త సీరియస్ అవుతూ.. షణ్ముఖ్ తో డిస్కషన్ పెట్టాడు. ''హౌస్ లో చాలా మంది నన్ను తీసి పడేస్తారు.. జోకర్ అంటారు.. లఫంగ్ అంటారు.. అన్నీ తీసుకుంటున్నా కదా.. అబ్బాయిలను ఏమైనా అనొచ్చు.. అమ్మాయిలను అంటే మాత్రం తప్పు.. అమ్మాయిలు చేసేది మాత్రం తప్పు కాదు. కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలి'' అంటూ శ్వేతాను ఉద్దేశిస్తూ లోబో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత సీన్ లో పిల్లలు గుర్తొచ్చారంటూ లోబో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

సీక్రెట్ టాస్క్ లో భాగంగా రవి దొంగిలించిన నగలు బాక్స్ ను వెతుక్కుంటూ ఉంటుంది ప్రియా. కానీ ఆమెకి బాక్స్ మాత్రం దొరకదు. 
ఆ తరువాత హౌస్ మేట్స్ అందరూ కలిసి లహరి-శ్రీరామ్ లకు పెళ్లి చేసేశారు. 

ఇక షణ్ముఖ్-లోబో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. స్కిట్ లో వాళ్లిద్దరికీ ఫ్యామిలీ మెంబర్ రోల్స్ ఇవ్వలేదంటే.. పెర్ఫార్మర్స్ అనే విషయం బిగ్ బాస్ కి తెలుసనీ.. చాలా సంతోషంగా ఉందని షణ్ముఖ్ అన్నాడు. మరోపక్క రవి-కాజల్-లహరి ఎవరి పెర్ఫార్మన్స్ బాగుందో మాట్లాడుకుంటూ ఉంటారు. షణ్ముఖ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందని.. లోబో-శ్వేతాలకు ఎటాచ్ అయి ఉండిపోయాడంటూ రవి కామెంట్ చేశాడు. 

రాత్రి హమీదతో కలిసి ముచ్చట్లు పెట్టాడు విశ్వ. హౌస్ లో వీక్ కంటెస్టెంట్ ఎవరని హామీదను విశ్వ అడగ్గా.. ప్రియాంక పేరు చెప్పింది. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పెర్సన్ ప్రియా అని చెప్పింది. శ్రీరామచంద్ర ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడని, మానస్ కూడా త్వరగా చేంజ్ అయిపోతాడని చెప్పింది. జెస్సీ.. తేడా క్యారెక్టర్ అని, అసలు ఏం అర్ధం కాడని అంది. షణ్ముఖ్ విషయంలో అసలు క్లారిటీ లేదని, రవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని చెప్పుకొచ్చింది. 

Also Read: కాజల్ మెస్మరైజింగ్ లుక్.. ఫోటోషూట్ తో రూమర్లకు చెక్ పెట్టిన బ్యూటీ..

Published at : 22 Sep 2021 11:21 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Ravi Shanmukh Lobo Swetha

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

టాప్ స్టోరీస్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల