Bigg Boss 5 Telugu: ప్రియాంక-రవిల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్..
బిగ్ బాస్ ఇచ్చిన 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్' టాస్క్ లో హౌస్ మేట్స్ రెచ్చిపోయి నటించారు.
బుధవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే.. 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్'. దేనికోసం ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూపు సూపర్ విలన్స్, మరో గ్రూప్ సూపర్ హీరోస్. రెడ్ కేప్ వేసుకున్నవాళ్లంతా సూపర్ హీరోస్, బ్లాక్ కేప్ వేసుకున్నవాళ్లంతా సూపర్ విలన్స్. హీరోస్ గ్రూపులో షణ్ముక్, ప్రియాంక, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ ఉండగా.. విలన్స్ గ్రూపులో రవి, యానీ మాస్టర్, సన్నీ, జెస్సీ, విశ్వ, సిరి ఉన్నారు.
Also Read:వెనక్కి తగ్గిన 'సర్కారు వారి పాట'.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో విడుదల కాగా.. అందులో అందరూ శ్రీరామచంద్రను టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఇక తాజాగా మరో ప్రోమో విడుదలైంది. హీరోస్ టీమ్ లో ఉన్న షణ్ముఖ్ తన టీమ్ తో డిస్కస్ చేస్తూ.. 'వాళ్లకు ఫిజికల్ టాస్క్ ఇస్తే చేస్తారు.. ఎమోషనల్ ఇవ్వాలి' అని చెప్పాడు. ఆ తరువాత విలన్స్ గ్రూప్ లో రవి.. 'యానీ మాస్టర్ నాకు తెలిసి ఫస్ట్ టార్గెట్ మీరుంటారు. డోంట్ సే ఐ క్విట్.. అయ్యేంతవరకు చేయండి' అని చెప్పాడు.
ఆ తరువాత విశ్వ-ప్రియాంక తలపడుతూ కనిపించారు. దీంతో ప్రియాంక ఫైర్ అయింది. వెంటనే సీన్ లోకి వచ్చిన రవి.. ప్రియాంకతో ఆర్గ్యూ చేస్తూ కనిపించాడు. ఆ తరువాత సిరి-షణ్ముఖ్ ల మధ్య కూడా ఏదో గొడవ జరిగినట్లుగా చూపించారు. 'ఊరికే అన్నింటికీ కంప్లైంట్ చేయకు.. నువ్ చేసింది కూడా మాట్లాడు' అంటూ షణ్ముఖ్.. సిరికి అరుస్తూ చెప్పాడు. ప్రోమో చివర్లో జెస్సీ ట్రిమ్మర్ పట్టుకొని శ్రీరామచంద్ర జుట్టుపై పెడుతూ కనిపించాడు.
Game plans are on!! How far will housemates go!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/pialUAmB0j
— starmaa (@StarMaa) November 3, 2021
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబుAlso Read:పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్కు వెళ్తున్న వీడియో వైరల్
Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి