Bigg Boss 5 Telugu Finale Live Updates: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే.. విన్నర్ గా సన్నీ.. రన్నరప్ గా షణ్ముఖ్..
బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు.
LIVE
Background
బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియాభట్, నాని, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి ఇలా చాలా మంది స్టార్స్ అతిథులుగా రాబోతున్నారు. అంతేకాదు.. శ్రియ లాంటి హీరోయిన్లతో డాన్స్ పెర్ఫార్మన్స్ లు ప్లాన్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో విన్నర్ ను అనౌన్స్ చేస్తుండడంతో ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో చివరికి ఐదుగురు ఫైనలిస్ట్ లు మిగిలారు. వారు శ్రీరామ్, సన్నీ, మానస్, షణ్ముఖ్, సిరి.
ట్రోఫీ సన్నీకి వస్తుందని కొందరు.. కాదు, కాదు శ్రీరామ్ కే ఆ హక్కు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకొందరేమో షణ్ముఖ్ ని సపోర్ట్ చేస్తున్నారు. మరికాసేపట్లో ఈ విషయంలో క్లారిటీ రానుంది. సోషల్ మీడియాలో చేపట్టిన పోలింగ్ బట్టి చూస్తుంటే మాత్రం సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో చెప్పలేం. మెజారిటీ ఆడియన్స్ మాత్రం సన్నీ విన్నర్ అని ఫిక్సయిపోయారు.
నిజానికి హౌస్‌లో ఉన్న సభ్యులు ఎవరికి వారే స్ట్రాంగ్. చెప్పాలంటే.. మానస్, సన్నీలకు మొదట్లో పెద్దగా అభిమానులు లేరు. దీంతో వారు ఎన్నివారాలు ఉంటారనేది కూడా డౌట్‌గా ఉండేది. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్‌గా మారిన సిరి, షన్నులకు యూత్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌గా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇక శ్రీరామ చంద్రకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు తక్కువే. ఇండియన్ ఐడల్‌లో పాల్గొనడం వల్ల జాతీయస్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే, వారు కూడా అతడిని ఆదుకుంటారనే గ్యారంటీ మొదట్లో లేదు. వీరంతా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాతే అభిమానులను పొందారు.
షన్ను, సిరిలు మొదటి నుంచి కలిసే ఆడటం.. అభిమానులకు కూడా నచ్చట్లేదని తెలుస్తోంది. అయినా సరే.. వారిని ఫ్యాన్స్ ఏ రోజు నిరాశ పరచలేదు. సిరి టాస్కుల్లో ప్రాణం పెడుతూ.. గెలవడానికి కష్టపడేది. దీంతో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేసేవారు. ఆఖరి రోజు వారంలో కాజల్.. శ్రీరామ్‌తో గొడవ పడి ఉండకపోతే.. తప్పకుండా టాప్-5లో ఉండేదని అంచనా. అంతా సాఫీగా సాగుతుందనే సమయానికి.. బిగ్ బాస్ ఇంట్లో ఫన్ క్రియేట్ చేస్తున్న సన్నీతో సిరి గొడవ పెట్టుకుంది. ఆమెకు షన్ముఖ్ సపోర్ట్ చేశాడు. పైగా.. చివరి రోజు ఫేక్ ఎలిమినేషన్ ద్వారా సిరిని బయటకు పంపడం కూడా ఆ జంటకు మైనస్ అయ్యింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలామందికి సహన పరీక్ష పెట్టింది. ఆ ప్రభావం.. సన్నీ, శ్రీరామ్‌లకు ఓట్ల వర్షం కురిపించినట్లు తెలిసింది.
షణ్ముఖ్ అవుట్.. విన్నర్ గా సన్నీ..
ఎప్పుడూ కూడా విన్నర్, రన్నరప్ ని స్టేజ్ పై అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున అన్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ ని ఈజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెతో కలిసి సన్నీ, షణ్ముఖ్ డాన్స్ లు చేశారు. ఆ తరువాత వారిద్దరితో చిన్న గేమ్ ఆడించారు. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. బిగ్ బాస్ మీతో గేమ్ ఆడారంటూ.. నాగార్జున మరింత టెన్షన్ పెట్టారు. ఫైనల్ గా నాగార్జున హౌస్ లోకి వెళ్లి సన్నీ, షణ్ముఖ్ లను స్టేజ్ పైకి తీసుకొచ్చారు. చాలా మంది షణ్ముఖ్ గెలవాలని కోరుకున్నారు. కానీ ఎక్కువ ఫాలోయింగ్ సన్నీ సంపాదించడంతో అతడే ట్రోఫీ కొట్టేశాడు.
శ్రీరామచంద్ర అవుట్..
నాగచైతన్య గోల్డెన్ బ్రీఫ్ కేస్ పట్టుకొని హౌస్ లోకి వెళ్లారు. సిల్వర్ సూట్ కేస్ కంటే ఇందులో మూడు రెట్లు ఎక్కువ అమౌంట్ ఉందని హౌస్ మేట్స్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ ముగ్గురూ కూడా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ ని ఫ్యామిలీ సజెషన్ తీసుకోమని అడగ్గా.. వాళ్లు కూడా సూట్ కేసు తీసుకోవద్దని చెప్పారు. ఆ తరువాత చిన్న గేమ్ ఆడి శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు చెప్పారు.
హౌస్ మేట్స్ కి నాని ఆఫర్..
'శ్యామ్ సింగరాయ్' సినిమా నటీనటులు నాని, సాయి పల్లవి, కృతిశెట్టిలు స్టేజ్ పైకి వచ్చారు. ముందుగా సాయిపల్లవి, కృతిశెట్టిలను హౌస్ లోకి పంపించారు. ఆ తరువాత నానిని ఓ సిల్వర్ బాక్స్ తో హౌస్ లోకి పంపించారు నాగార్జున. అలా వెళ్లిన నాని హౌస్ మేట్స్ కి ఒక ఆఫర్ చేశారు. తన చేతిలో ఉన్న సిల్వర్ బాక్స్ కావాలంటే ఈ నిమిషమే బయటకు వచ్చేయాలని చెప్పారు. విన్నర్ ఒక్కరే అని.. ప్రాక్టికల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. కానీ హౌస్ మేట్స్ ఎవరూ కూడా ఆ ఆఫర్ ని తీసుకోలేదు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించి.. మానస్ ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు.
సిరి అవుట్..
ఐదు డ్రోన్స్ లో ఒక్కోదానికి హౌస్ మేట్స్ ఫొటోలు ఉంటాయని.. అందులో ఒకటి ఎగిరిపోతుందని.. వాళ్లే ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. వీరిలో సిరి డ్రోన్ ఎగిరిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు.
స్టేజ్ పై పరంపరం టీమ్..
స్టేజ్ పైకి 'పరంపర' వెబ్ సిరీస్ టీమ్ మెంబర్స్ జగపతిబాబు, నవీన్ చంద్రని ఇన్వైట్ చేశారు నాగార్జున. ఈ సిరీస్ లో తను మంచివాడిగా నటించానని అన్నారు. జగపతిబాబు లాంటి నటుడితో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు నవీన్ చంద్ర. డిసెంబర్ 24న ఈ సిరీస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.