Bigg Boss 5 Telugu: రవికి చుక్కలు చూపించిన షణ్ముఖ్ అండ్ కో..
కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో విలన్ టీమ్ కి చెందిన రవికి సూపర్ హీరోస్ టీమ్ చుక్కలు చూపించింది.
యానీ మాస్టర్ తన పవర్ ని వాడి మానస్ ని సేవ్ చేయడం తనకు నచ్చలేదని శ్రీరామ్.. రవితో డిస్కస్ చేశాడు. అసలు ఊహించలేదని అన్నారు. ఆ తరువాత నేరుగా యానీతో మాట్లాడాడు శ్రీరామ్. 'ఎవరైతే కలిసి ఆడుతున్నారో వాళ్లు బాగానే ఉంటున్నారు.. మనం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ.. మనలో మనకే డిఫరెన్స్ లు వస్తున్నాయని' చెప్పాడు. రవికి పవర్ యూజ్ చేయాల్సిందని శ్రీరామ్ అన్నాడు.
ప్రియాంక గురించి మాట్లాడితే తప్పుగా అనుకోరు కదా మీ ఇద్దరూ అంటూ సన్నీ.. మానస్-కాజల్ ని అడుగుతూ.. 'పింకీ వీడు(మానస్) అనే జోన్ లో ఉంది.. నిన్న రాత్రి కూడా పింకీకి చెప్పాను నీ ఆట నువ్ ఆడు అని.. ఆ అమ్మాయికి నువ్ అంటే ఇష్టం ఉంది.. గేమ్ ఆడుతుంది' అంటూ మానస్ కి చెప్పగా.. 'రెండు వారాల నుంచి ఆమెకి చెప్తున్నా.. కానీ పింకీ మైండ్ ఎలాంటిది అంటే తనకి ఏం అనిపిస్తాదో అదే చేస్తాది. పక్కోళ్లు చెప్తే వినదు' అంటూ మానస్ సమాధానం చెప్పాడు.
Also Read: విజయ్ సేతుపతిపై దాడి.. ఎగిరి మరీ తన్నాడు..
ఇక బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే.. 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్'. దీనికోసం ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూపు సూపర్ విలన్స్, మరో గ్రూప్ సూపర్ హీరోస్. రెడ్ కేప్ వేసుకున్నవాళ్లంతా సూపర్ హీరోస్, బ్లాక్ కేప్ వేసుకున్నవాళ్లంతా సూపర్ విలన్స్. ఏ గ్రూప్ అయితే టాస్క్ లో గెలుస్తుందో.. వాళ్లు కెప్టెన్సీ పోటీదారులవుతారు. హీరోస్ గ్రూపులో షణ్ముక్, ప్రియాంక, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ ఉండగా.. విలన్స్ గ్రూపులో రవి, యానీ మాస్టర్, సన్నీ, జెస్సీ, విశ్వ, సిరి ఉన్నారు.
బిగ్ బాస్ గేమ్ చెప్పిన వెంటనే హౌస్ మేట్స్ తమ స్ట్రాటజీలు వేసుకోవడం మొదలుపెట్టారు. హీరోస్ టీమ్ లో ఉన్న షణ్ముఖ్ తన టీమ్ తో డిస్కస్ చేస్తూ.. 'వాళ్లకు ఫిజికల్ టాస్క్ ఇస్తే చేస్తారు.. ఎమోషనల్ ఇవ్వాలి' అని చెప్పాడు. ఆ తరువాత విలన్స్ గ్రూప్ లో రవి.. 'యానీ మాస్టర్ నాకు తెలిసి ఫస్ట్ టార్గెట్ మీరుంటారు. డోంట్ సే ఐ క్విట్.. అయ్యేంతవరకు చేయండి' అని చెప్పాడు.
ఆ తరువాత విశ్వ-ప్రియాంక తలపడుతూ కనిపించారు. దీంతో ప్రియాంక ఫైర్ అయింది. వెంటనే సీన్ లోకి వచ్చిన రవి.. ప్రియాంకతో ఆర్గ్యూ చేస్తూ కనిపించాడు. విశ్వ మొదటి నుంచి ప్రియాంకను కావాలని టార్గెట్ చేస్తూనే ఉన్నాడని మానస్ తన టీమ్ తో డిస్కస్ చేశాడు.
విలన్స్ టీమ్ అందరూ అనుకొని శ్రీరాంచంద్రను టార్గెట్ చేశారు. సోయా సాస్, ఎగ్, చిల్లీ సాస్ కలిపి చేసిన జూస్ ని శ్రీరామ్ తో తాగించారు. అతడితో శీర్షాసనాలు వేయించి.. తల మీద నుంచి పెయింట్ ను వేసుకోవాలని చెప్పారు. వాళ్లు చెప్పిన పనులన్నీ శ్రీరామ్ ఎంతో ఓపికగా చేశాడు. చివర్లో జెస్సీ ట్రిమ్మర్ పట్టుకొని శ్రీరామచంద్ర జుట్టుపై పెడుతుండగా.. ఎండ్ బజర్ మోగడంతో శ్రీరామ్ బతికిపోయాడు.
ఆ తరువాత సూపర్ హీరోస్ కి ఛాన్స్ రావడంతో వారు.. విలన్స్ టీమ్ నుంచి రవిని సెలెక్ట్ చేసుకున్నారు. రవిని ఇబ్బంది పెడుతూ పేడను ఒంటిపై పూసుకోవాలని చెప్పారు. అలానే మరికొన్ని టాస్క్ లు చేయించారు. ఇబ్బందిపడుతూనే రవి టాస్క్ లన్నీ చేశాడు.
Also Read: 'దీపావళి పండగ ముందే వచ్చేసింది..' 'లాలాభీమ్లా' ప్రోమోలో పవన్ మాస్ అవతార్..
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబు