News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: కాజల్ అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చేసిన మానస్, సన్నీ.. టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. 

ఈరోజు బిగ్ బాస్ షో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతుండడంతో ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది.

FOLLOW US: 
Share:

ఎప్పటిలానే స్టేజ్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్ ఆడించారు. ఉన్న ఆరుగురిని రెండు టీమ్ లుగా విడగొట్టి.. వారికి సాంగ్స్ టాస్క్ ఇచ్చారు. ఇందులో హౌస్ మేట్స్ పాటలు పాడుతూ.. డాన్స్ లు వేస్తూ ఆడియన్స్ ను అలరించారు. 

థర్డ్ ఫైనలిస్ట్.. : సెకండ్ ఫైనలిస్ట్ ను ఫస్ట్ ఫైనలిస్ట్ రివీల్ చేశారు. ఇప్పుడు థర్డ్ ఫైనలిస్ట్ ను సెకండ్ ఫైనలిస్ట్ రివీల్ చేస్తారని సన్నీకి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున. స్విమ్మింగ్ పూల్ దగ్గరకి సన్నీని వెళ్లమని చెప్పిన నాగ్.. అక్కడున్న పుల్లీను బయటకు తీయమని చెప్పారు. దానిపై సిరి ఫొటో ఉండడంతో ఆమె సంతోషానికి అవధుల్లేవు. వెంటనే వెళ్లి షణ్ముఖ్ ని హగ్ చేసుకుంది. 

ఎక్స్ హౌస్ మేట్స్ లో కొందరు ప్రెజంట్ హౌస్ మేట్స్ ని కొన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పారు నాగార్జున. ముందుగా జెస్సీ.. 'షన్ను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. నీకు సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. వేరే జనాలు ఏం అనుకుంటున్నారో.. నువ్ ఎప్పుడైనా ఆలోచించావా..?' అని ప్రశ్నించాడు. దానికి షణ్ముఖ్.. 'సిరితో నా రిలేషన్ ఏంటో నీకు తెలుసు.. కానీ అది బయటకు ఎలా వెళ్తుందో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చిన తరువాతనే తెలిసింది.. సిరి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తనకి ఎప్పటికీ సపోర్ట్ సిస్టంలా ఉంటాను' అని చెప్పుకొచ్చాడు. 

యానీ మాస్టర్.. సన్నీను ప్రశ్నిస్తూ.. 'నేను హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా నువ్ నన్ను బ్యాక్ బిచ్ చేస్తున్నావ్.. నేను చాలా బాధ పడుతున్నా..' అని చెప్పగా.. 'నేనెప్పుడూ అలా చేయలేదు.. నా ఒపీనియన్ చెప్పాను. ఆమె చెప్పేవన్నీ చెబుతుంది కానీ దానిపై స్టాండ్ తీసుకోరు. ఆమె ఎప్పటికీ నాకు మంచి ఫ్రెండ్' అని చెప్పాడు సన్నీ. 

నటరాజ్ మాస్టర్.. శ్రీరామ్ ని ప్రశ్నిస్తూ.. 'ఐస్ టాస్క్ లో నీకు పింకీ ఇచ్చిన ట్రీట్మెంట్ వలన హెల్త్ పాడైంది. ఆ తరువాత నువ్ ఎలా ఆడతావో అనుకున్నా.  పింకీ చేసిన ట్రీట్మెంట్ గేమ్ పరంగా నీకు ప్లస్ అయిందా..? మైనస్ అయిందా..?' అని ప్రశ్నించారు. 'ప్లస్, మైనస్ అనే సంగతి పక్కన పెడితే.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను. కానీ లోపల నా ఆట నేను ఆడలేకపోయానే అనే ఫీలింగ్ ఉంది. సో.. మైనస్ అయిందనే అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్.  

ఆ తరువాత ప్రియాంక.. 'హాయ్ మానస్.. నేను నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. ఇన్ని హౌస్ లో నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..? ఎందుకంటే బయటకొచ్చాక కొన్ని ఎపిసోడ్స్ చూశాను' అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న విన్న మానస్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి. 'భరించాను.. ఎప్పుడూ నటించలేదు. జెన్యూన్ ఎమోషన్స్ డిస్ ప్లే చేశాను' అని బదులిచ్చాడు. 

జెస్సీ.. షణ్ముఖ్ తో పాటు సిరిని కూడా ప్రశ్నించాడు. 'నువ్ బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడడానికి వెళ్లావ్ కదా సిరి.. ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను.. అది కనెక్ట్ అయిపోతున్నాను.. ఇది కనెక్ట్ అయిపోతున్నాను అని పిచ్చెక్కిపోతున్నావ్. అవసరమా నీకు..?' అని గట్టిగానే నిలదీశాడు. 'బిగ్ బాస్ కి గేమ్ ఆడడానికే వచ్చాను.. కానీ మధ్యలో కొన్ని ఎమోషన్స్ వచ్చాయి. బట్ నేనెప్పుడూ గేమ్ లో ఎమోషన్స్ పెట్టలేదు' అని చెప్పింది సిరి. 

ఆ తరువాత ప్రియా.. 'కాజల్ నువ్ బయట ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది.. నిజంగా నువ్ ఇలానే ఉంటావా..? లేక గేమ్ వరకేనా..?' అని ప్రశ్నించింది.'ఇక్కడ నేను ఎలా ఉంటున్నానో అదే నేను. ఇలాంటి సిట్యుయేషన్ లో నేను ఇలానే ఉంటాను.. ఇలానే రియాక్ట్ అవుతాను' అని చెప్పింది కాజల్. 

ఫోర్త్ ఫైనలిస్ట్..: సిరితో హౌస్ లో నాల్గో ఫైనలిస్ట్ ను రివీల్ చేశారు నాగార్జున.  షణ్ముఖ్ ఫొటో రావడంతో సిరి ఎగిరి గంతేసింది. 

ఆ తరువాత హౌస్ మేట్స్ ఇతర ఇంటి సభ్యుల ఫొటోలతో ఉన్న బోర్డులను మెడలో వేసుకొని వారిలా మాట్లాడడం మొదలుపెట్టారు. ముందుగా మానస్.. శ్రీరామ్ ఫొటోను మెడలో వేసుకొని తనలా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత శ్రీరామ్.. కాజల్ ని ఇమిటేట్ చేస్తూ నవ్వించాడు. షణ్ముఖ్ ఫొటో బోర్డు మెడలో వేసుకున్న కాజల్ ని 'షణ్ముఖ్.. కాజల్ పై నీ అభిప్రాయం' అని అడిగారు నాగ్. దానికి ఆమె 'కాజల్ చాలా మంచిది సార్.. కాజల్ ఆలోచనా విధానం, నా ఆలోచనా విధానం ఒకేలా ఉంటాయి' అని తనను తాను పొగుడుకుంది. దానికి నాగార్జున 'అంటే నువ్ బ్రహ్మ, కాజల్ బ్రహ్మియా..?' అని ప్రశ్నించారు. ఆ తరువాత సన్నీ ఫొటో బోర్డు మెడలో వేసుకున్న షణ్ముఖ్ నవ్వించే ప్రయత్నం చేశాడు. 

లాస్ట్ ఫైనలిస్ట్..: మానస్ ని లాస్ట్ ఫైనలిస్ట్ గా రివీల్ చేశారు నాగార్జున. కాజల్ ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేయడంతో మానస్, సన్నీ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. మానస్ వెక్కి వెక్కి ఏడ్చేయడంతో కాజల్ కూడా ఏడ్చేసింది. సన్నీ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. వెళ్లిపోతూ.. శ్రీరామ్ కి సారీ చెప్పింది కాజల్. ఇప్పటినుంచి నువ్ నేను బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పాడు శ్రీరామ్. 

బిగ్ బాస్ వేదికపైకి మంత్రి సంతోష్ కుమార్ వచ్చి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'ను ప్రమోట్ చేశారు. మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు. అలానే ప్రతీఒక్కరూ మూడు మొక్కలను నాటాలని కోరారు సంతోష్ కుమార్.  నాగార్జున కూడా ఒక ఫారెస్ట్ ను అడాప్ట్ చేసుకుంటానని చెప్పారు. 

స్టేజ్ పైకి వచ్చిన కాజల్ కి ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున. హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యులకు ఏం ట్యాగ్స్ ఇస్తావో చెప్పమని అడిగారు నాగార్జున. సన్నీకి  5 టైమ్స్ ఎంటర్టైన్మెంట్, మానస్ కి 5 టైమ్స్ ఫ్రెండ్షిప్, సిరికి 5 టైమ్స్ ఎమోషన్, శ్రీరామచంద్రకి 5 టైమ్స్ యాక్షన్, షణ్ముఖ్ కి 5 టైమ్స్ డ్రామా ఇచ్చింది. 

Also Read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?

 

Also Read:  'ఐకాన్' సినిమా అటకెక్కినట్లే.. ఇదిగో క్లారిటీ..

Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ.. 

Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో

Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at : 12 Dec 2021 10:14 PM (IST) Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Shanmukh Siri Sunny sreeram Bigg Boss 5 Telugu 99 Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో కొడతానంటూ సైగలు, చివరికి..

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో  కొడతానంటూ సైగలు, చివరికి..

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్‌దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!

Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్

Bigg Boss 7 Telugu: వెధవ కారణాలు చెప్పకు - పల్లవి ప్రశాంత్‌పై అర్జున్ సీరియస్

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?