అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'సిరిని కంట్రోల్ చేస్తున్నా..' అందరి ముందు ఒప్పుకున్న షణ్ముఖ్.. 

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు.

ఓట్ అప్పీల్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి ఓ స్కిట్ వేశారు. ఇందులో కాజల్.. శ్రీదేవి గెటప్ లో, సిరి.. జెనీలియా క్యారెక్టర్ పోషించింది. షణ్ముఖ్.. 'సింగం' సూర్యగా, శ్రీరామ్ 'ముఠామేస్త్రి' సినిమాలో చిరంజీవిగా, మానస్ 'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ గా, సన్నీ.. బాలయ్య బాబుగా నటించారు. వీరంతా కలిసి 'అంగుళీకం' టాస్క్ వేశారు. ఆ తరువాత అందరూ కలిసి డాన్స్ లు చేశారు. ఈ మొత్తం టాస్క్ లో కాజల్ పెర్ఫార్మన్స్ హౌస్ మేట్స్ కి నచ్చడంతో ఆమెని బెస్ట్ ఎంటర్టైనర్ గా ఎన్నుకున్నారు. దీంతో ఆమెకి ఆడియన్స్ ను ఓటింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. ప్రేక్షకులతో మాట్లాడిన కాజల్.. తన స్నేహితులతో పాటు టాప్ 5లో ఉండాలనుకుంటున్నానని దయచేసి ఓట్లు వేయమని కోరింది. తనతో పాటు మానస్, సన్నీలకు ఓట్లు వేయమని అడిగింది. 

బిగ్ బాస్.. హౌస్ మేట్స్ అందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరైతే నిజాయితీగా ఆన్సర్స్ చెప్పారని హౌస్ మేట్స్ భావిస్తారో వాళ్లకి ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ వస్తుందని చెప్పారు. అది విన్న హౌస్ మేట్స్ అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. 

షణ్ముఖ్ కి ఎమోషనల్ కనెక్ట్ అయ్యా..: ముందుగా 'మీరు షన్ను కంటే స్ట్రాంగ్ ప్లేయర్.. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సిడర్ చేసుకోవడం లేదు' అనే ప్రశ్న సిరికి వచ్చింది. దానికి సిరి.. 'హౌస్ లో కొన్ని సిట్యుయేషన్స్ లో షణ్ముఖ్ బాగా హెల్ప్ చేశాడని.. తనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యానని.. నేను స్ట్రాంగ్ ప్లేయరే కానీ షణ్ముఖ్ ని టాప్ ప్లేస్ లో చూడాలనుకుంటున్నానని' చెప్పింది.

కాజల్ కి 'యానీ మాస్టర్ తో రెస్పెక్ట్ గురించి మాట్లాడినప్పుడు.. తుడిచినా టిష్యూని సన్నీ మీద కొట్టడం గౌరవం ఇవ్వడమా..?' అనే ప్రశ్న ఎదురైంది. దానికి కాజల్.. 'యానీ మాస్టర్ తో జరిగింది గొడవలో.. సన్నీతో కూడా గొడవే కానీ దాన్ని కూల్ డౌన్ చేసే ప్రాసెస్ లో చనువు ఉందనే ఫీలింగ్ తోనే చేశాను' అంటూ చెప్పుకొచ్చింది. 

షణ్ముఖ్-సిరి కూర్చొని డిస్కషన్ పెట్టుకున్నారు. 'మీరు షన్ను కన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అని అనడం నచ్చింది. సో.. నువ్ టాప్ లో ఉండాలని వాళ్లు(ప్రేక్షకులు) కోరుకుంటున్నారు' అని సిరితో చెప్పాడు షణ్ముఖ్. 

'గిల్టీ బోర్డు వేసుకొని తిరిగినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు..? ఆ ఇన్సిడెంట్ తరువాత మీ కాన్ఫిడెన్ ని ఎలా తిరిగి పొందారు..?' అని సన్నీని ప్రశ్నించారు ప్రేక్షకులు. దానికి అతడు.. 'చాలా హర్ట్ అయిన సిట్యుయేషన్ అది. నా కోపం వలన హౌస్ మేట్స్ ఆ బోర్డు వేశారు. ఆ తరువాత జనాల నుంచి వచ్చిన ధైర్యం, కొన్ని టాస్క్ లలో, వీకెండ్స్ లో వచ్చిన కాంప్లిమెంట్స్ అవన్నీ కాన్ఫిడెన్స్ పెరిగేలా చేశాయి' అని సమాధానమిచ్చాడు. 

శ్రీరామ్ కి 'జెస్సీతో గొడవ జరిగినప్పుడు షణ్ముఖ్ ఇమ్మెచుర్డ్ అని మీరే చెప్పారు. కానీ ర్యాంకింగ్ టాస్క్ లో మీరే షన్నుని మెచ్యూర్డ్ అని సెకండ్ ప్లేస్ ఇచ్చారు. మీ ఒపీనియన్ ఎందుకు మారింది. ఇప్పుడు మీరు షన్ను గ్రూపా..?' అనే ప్రశ్న ఎదురైంది. అది విని శ్రీరామ్ తెగ నవ్వుకున్నాడు. ఆ తరువాత తనే గ్రూప్ లో లేనని.. జెస్సీ ఇన్సిడెంట్ సమయానికి షణ్ముఖ్ తో పరిచయం లేదని.. ఆ తరువాత షణ్ముఖ్ తో ట్రావెల్ అయిన తరువాత తనేంటో అర్థమైందని చెప్పుకొచ్చాడు. 'ఏంటి నాకు గ్రూప్ కూడా ఉందా ఈడ..' అంటూ షణ్ముఖ్ డైలాగ్ కొట్టాడు.  

సన్నీ అలాంటోడు కాదు..: 'ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ గా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా..?' అని మానస్ కి ప్రశ్న రాగా.. దానికి 'ఫ్రెండ్ లా వాడుకుంటున్నాడనేది రాంగ్ పెర్స్పెక్టివ్. నేను జెన్యూన్ గా కనెక్ట్ అయిన వ్యక్తి సన్నీ. ఒకల్ని వాడుకొని పైకి ఎదగాలనే మనస్తత్వం సన్నీకి లేదు. మీకు అలా అనిపిస్తే ఆలోచనా విధానం మార్చుకోండి' అంటూ సమాధానమిచ్చాడు. 

సిరిని కంట్రోల్ చేస్తున్నా: 'సిరి అంటే మీరెందుకు అంత పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు. ప్రతీసారి తనను ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు..? తనను తనలా ఎందుకు ఉండనివ్వరు' అనే ప్రశ్న షణ్ముఖ్ కి ఎదురైంది. 'నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది. నాకే తెలుసు నేను పొసెసివ్ గా ఫీల్ అవుతున్నానని. కొన్ని కొన్ని విషయాల్లో కంట్రోల్ చేస్తే బెటర్ ఈ హౌస్ లో అనేది నా పాయింట్. కొన్ని విషయాల్లో తను తనలా ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. గేమ్ లో నేనెప్పుడూ కంట్రోల్ చేయలేదు. కానీ బయట ఎవరైనా తనతో గేమ్ ఆడాలనుకుంటే మాత్రం కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే తనను నేను టాప్ 5లో చూడాలనుకుంటున్నాను' అని ఆన్సర్ చేశాడు షణ్ముఖ్.     

'నువ్ కంట్రోల్ చేస్తుంటావా తనని(సిరి)..?' అని శ్రీరామ్.. షణ్ముఖ్ ని అడగ్గా.. వెంటనే సిరి కల్పించుకొని 'ప్రతీసారి నేనేం కంట్రోల్ అవ్వను.. నేనెక్కేస్తాను' అంటూ తన భాషలో చెప్పింది. దానికి షణ్ముఖ్.. 'అవ్వకుండా ఆ క్వశ్చన్ రాదు' అని డైలాగ్ కొట్టాడు. మానస్ కి వచ్చిన ప్రశ్న గురించి సిరి మాట్లాడుతూ.. 'అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ క్వశ్చన్' అని అంది. దానికి షణ్ముఖ్ 'అది మానస్ క్వశ్చన్ కాదు.. సన్నీకి రాడ్' అని అన్నాడు. వెంటనే శ్రీరామ్ నవ్వేశాడు.

'అందరి ముందు కాజల్ ని హ్యుమిలియేట్ ఎందుకు చేస్తారు..? స్టాండ్ తీసుకొని మీ కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ తను విన్ అయింది..' అని సన్నీని ప్రశ్నించారు ఆడియన్స్. వెంటనే సన్నీ.. కాజల్ ని 'అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా..?' అని అడిగాడు. దానికి ఆమె ఫ్రెండ్షిప్ లో ఎప్పుడూ అలా తీసుకోలేదని చెప్పింది. అప్పుడప్పుడు కాజల్ ని ఏడిపిస్తా.. అది అంతా సరదా కోసమే.. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తా అని నవ్వుతూ అన్నాడు సన్నీ. 

రవి ఉన్నప్పుడు వాల్యూ తెలియలేదు..: 'మీరు రవిని నామినేట్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు. మళ్లీ టికెట్ టు ఫినాలే టాస్క్ లో నీకోసం గేమ్ ఆడుతున్నా రవి అని అరవడం కరెక్ట్ అనుకుంటున్నారా..?' అని సిరికి క్వశ్చన్ రాగా.. 'రవి ఉన్నప్పుడు తన వాల్యూ తెలియలేదు. నిజానికి తను ఎలిమినేట్ అవుతాడని కూడా ఊహించలేదు. కానీ సడెన్ గా వెళ్లిపోయాడు. ఆరోజు గేమ్ ఆడినప్పుడు కూడా రవి గుర్తొచ్చి అలా మాట్లాడాను అంతే' అంటూ సమాధానం చెప్పింది సిరి. 

ఆడియన్స్ మీద ఫన్ చేసే ఉద్దేశం లేదు: 'ఇవి ఎలా నచ్చుతున్నాయి, అవి ఎలా నచ్చుతున్నాయి అని ఆడియన్స్ ను జడ్జ్ ఎందుకు చేస్తున్నారు. వారిపై ఫన్ ఎందుకు చేస్తున్నారు..?' అనే ప్రశ్న షణ్ముఖ్ కి ఎదురైంది. 'ఆడియన్స్ ను జడ్జ్ కన్నా.. నా ఊహలే అవన్నీ. నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను జనాలకు ఏం నచ్చుతుందో అని. ఆడియన్స్ మీద ఫన్ చేసే ఉద్దేశం నాకు లేదు' అని బదులిచ్చాడు షణ్ముఖ్. 

సింపతీ గేమ్ ఆడడం రాదు.. : 'మీరు బిగినింగ్ నుంచి గ్రూప్ లోనే ఆడుతూ వచ్చారు. కానీ మిమ్మల్ని మీరు లోన్ రేంజర్ గా పోట్రె చేసుకున్నారు. ఇదంతా సింపతీ కోసమా..? మీ స్ట్రాటజీనా..? ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో రవితో కలిసి ఇద్దరి ఫొటోలను కాల్చేయాలని అనుకున్నారు. కానీ అదే కాజల్ చేస్తే మీకెందుకు కోపం వచ్చింది' అని శ్రీరామ్ ను ప్రశ్నించారు. 'లోన్ రేంజర్ అని నేనెప్పుడూ చెప్పలేదు. నాకు సింపతీ గేమ్ ఎలా ఆడాలో కూడా తెలియదు. ఫైర్ ఇంజన్ టాస్క్ లో ఓవర్ రియాక్ట్ అయ్యాను. కానీ ఇద్దరు ఫొటోలను కాల్చేయడం నేను తీసుకోలేకపోయాను' అంటూ ఆన్సర్ చేశాడు శ్రీరామ్. 

కాజల్, మానస్, సన్నీ తెగ ఆనందపడిపోతున్నానని.. కాజల్ ని అసలు చూడలేకపోతున్నామని సిరి, షణ్ముఖ్ మాట్లాడుకున్నారు. 

'మీరు ప్రియాంక, మీ ఫ్రెండ్ అనుకున్నప్పుడు తనను బ్యాక్ బిచ్ ఎందుకు చేశారు.?' అని మానస్ ని ప్రశ్నించగా.. 'కొన్ని సార్లు ప్రియాంక బిహేవియర్ నచ్చకపోతే వేరే వాళ్లతో డిస్కస్ చేశాను. కానీ తనను తక్కువ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రియాంక ఎప్పటికీ నా ఫ్రెండే' అని బదులిచ్చాడు. 

'మీరు బిగినింగ్ లో షణ్ముఖ్ తో ఫ్రెండ్ గా ఉండేవారు. ఆ తరువాత రవితో ఇప్పుడు మానస్, సన్నీలతో ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికే ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా..?' అని కాజల్ ని ప్రశ్నించగా.. 'స్టార్టింగ్ లో షణ్ముఖ్ తో కనెక్ట్ అయ్యాను. కానీ హౌస్ లో కొన్ని సిట్యుయేషన్స్ వలన గ్యాప్ వచ్చింది. రవితో నాకు ఫ్రెండ్షిప్ బాండ్ అసలు లేదు. మానస్ తో ఫస్ట్ వీక్ లోనే బాండింగ్ వచ్చింది. తన కారణంగా సన్నీ క్లోజ్ అయ్యాడు. వాళ్లతో ఏమైనా గొడవలైనా ఎప్పటికీ స్నేహితురాలిగానే ఉంటాను' అంటూ చెప్పుకొచ్చింది. 'అదే ప్రశ్న నేను కాజల్ ని అడిగాను' అని శ్రీరామ్ అనగా.. దానికి సిరి.. 'అది అందరికీ ఉన్న క్వశ్చనే' అని డైలాగ్ వేసింది.

ఈ మొత్తం టాస్క్ లో హానెస్ట్ గా ఆన్సర్స్ చేసిన ఒక వ్యక్తిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకోమని అడిగారు బిగ్ బాస్. సన్నీకి, సిరికి సమానంగా ఓట్లు రావడంతో శ్రీరామ్ ఓటు కీలకంగా మారింది. అతడు సిరి పేరు చెప్పడంతో.. సన్నీ తన పేరు ఎందుకు చెప్పడం లేదని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఫైనల్ గా సన్నీని వెళ్లమని చెప్పింది సిరి. దీంతో సన్నీ.. నేరుగా ప్రేక్షకులను ఓటింగ్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నాడు. 

 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Embed widget