అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోగొట్టాడంటూ.. వెక్కి వెక్కి ఏడ్చేసిన కాజల్..
బిగ్ బాస్ ఇంట్లో ఇది చివరి కెప్టెన్సీ అని 'నియంత మాటే శాసనం' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
శ్రీరామ్ సోలో గేమ్ ఆడుతున్నానని చెప్పి.. రవి, యానీ మాస్టర్ లతో కలిసి ఆడాడని, కానీ ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకునే సత్తా లేదంటూ సన్నీ-కాజల్ లు డిస్కస్ చేసుకున్నారు. అదే సమయానికి అక్కడకి వచ్చిన శ్రీరామ్ తో కాజల్ కి వాగ్వాదం జరిగింది. ఇక రాత్రి షణ్ముఖ్-సిరిలకు చిన్న గొడవ జరిగింది. ఎప్పటిలానే షణ్ముఖ్ బెడ్ పైకి వెళ్లి అతడిని హత్తుకొని సారీ చెప్పింది.
నియంత మాటే శాసనం..
బిగ్ బాస్ ఇంట్లో ఇది చివరి కెప్టెన్సీ అని 'నియంత మాటే శాసనం' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఒక నియంత సింహాసనం ఉంటుంది. బజర్ మోగగానే ఎవరు ముందుగా కూర్చుంటారో వాళ్లు ఆ రౌండ్ లో సేఫ్ అవడమే కాదు నియంతగా వ్యవహించాలి. మిగిలిన ఇంటి సభ్యులు తమని తాము సేవ్ చేసుకునేందుకు ఛాలెంజ్ లో పాల్గొనడంతో పాటూ బాటమ్ లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్ తమని సేవ్ చేయమని నియంతని రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా సేవ్ అయిన వారు కెప్టెన్ పోటీదారులు అవుతారంటూ బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను డిజైన్ చేశారు.
కావాలనే టార్గెట్ చేస్తున్నారు..
ముందుగా సిరి కుర్చీలో కూర్చుంది. మిగిలిన హౌస్ మేట్స్ కి హ్యాట్స్ కి సంబంధించిన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో సన్నీ, రవి లాస్ట్ లో మిగిలిపోయారు. దీంతో వీరిద్దరిలో ఒకరిని సిరి సేవ్ చేయాలి. రవి-సన్నీ ఆమెని కాపాడమని రిక్వెస్ట్ చేసుకున్నారు. దీనికి సిరి.. తనకు ఇద్దరితో మంచి ర్యాపో ఉందని.. కానీ గేమ్ ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి కాబట్టి రవిని సేవ్ చేయాలనుందని చెప్పింది. దానికి సన్నీ 'కెప్టెన్సీ కంటెండర్స్ కి ఇది లాస్ట్ ఛాన్స్ ఒక్కసారి ఆలోచించు' అని సిరిని అడిగాడు. కానీ సిరి రవినే సేవ్ చేయడంతో సన్నీ హర్ట్ అయ్యాడు. కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రతిసారి తనను టార్గెట్ చేస్తున్నారని.. సిరి మనసులో ఏదో పెట్టుకొని తనను గేమ్ నుంచి తప్పించిందని సన్నీ వాపోయాడు.
వెక్కి వెక్కి ఏడ్చేసిన కాజల్..
రెండోసారి శ్రీరామ్ కుర్చీలో కూర్చున్నాడు. దీంతో మిగిలిన హౌస్ మేట్స్ కి స్లిప్పర్స్ కి సంబంధించిన టాస్క్ ఇచ్చారు. ఇందులో రవి, కాజల్ లాస్ట్ లో రావడంతో.. వారిద్దరూ శ్రీరామ్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు. కెప్టెన్సీ అనేది రెస్పాన్సిబుల్ గా ఉండే వ్యక్తుల చేతుల్లో ఉండాలని నీకివ్వడం కరెక్ట్ అని అనిపించడం లేదని కాజల్ కి చెప్పి.. రవిని సేవ్ చేశాడు శ్రీరామ్. కెప్టెన్ అయ్యే ఛాన్స్ పోగొట్టాడంటూ కాజల్ బాధపడింది. బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చేసింది. ఆ తరువాత శ్రీరామ్ వెళ్లి కాజల్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడు.
మానస్ అవుట్..
మూడోసారి రవి కుర్చీలో కూర్చున్నాడు. దీంతో మిగిలిన హౌస్ మేట్స్ కి ఫ్రూట్స్ కి సంబంధించిన ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో షణ్ముఖ్, మానస్ లు లాస్ట్ లో రావడంతో.. రవిని సేవ్ చేయమని ఇద్దరూ రీజన్స్ చెప్పారు. ఫైనల్ గా రవి.. షణ్ముఖ్ ని సేవ్ చేశాడు.
శ్రీరామ్ అవుట్..
నాల్గోసారి ప్రియాంక కుర్చీలో కూర్చోగా.. మిగిలిన హౌస్ మేట్స్ కి డ్రమ్స్ కి సంబంధించిన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో షణ్ముఖ్-శ్రీరామ్ లాస్ట్ లో రావడంతో.. ఇద్దరూ తమను సేవ్ చేయమని ప్రియాంకను రిక్వెస్ట్ చేసుకున్నారు. పేబ్యాక్ ని స్ట్రాంగ్ గా నమ్ముతానని.. షణ్ముఖ్ ని నామినేట్ చేసినా, అతడు మాత్రం తనను నామినేట్ చేయలేదని ఈసారి అతడిని సేవ్ చేస్తున్నట్లు చెప్పింది.
ఫెయిర్ గేమ్ కాదంటూ సిరి ఫైర్..
ఆ తరువాత బజర్ కి సిరి, ప్రియాంక ఒకేసారి కూర్చున్నారు. 'నేనే ఫస్ట్ కూర్చున్నా..' అంటూ సిరి చెప్పింది. ప్రియాంక కూడా తనే ముందుగా కూర్చున్నానని చెప్పడంతో సంచాలక్ మానస్.. ప్రియాంకకు సపోర్ట్ చేశాడు. 'ఇదే నీ డెసిషన్ అయితే చెప్పు.. నేను వదిలేస్తా.. కానీ ఇది ఫెయిర్ కాదు' అని చెప్పింది సిరి. అప్పటికీ మానస్.. ప్రియాంకకే సపోర్ట్ చేయడంతో ఆమె కోపంగా బెడ్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేసింది. 'అన్నీ అబద్దాలు.. పింకీని గెలిపించుకోవాలంటే డైరెక్ట్ గా చెప్పేయొచ్చు కదా' అంటూ సిరి ఫైర్ అయింది. 'గేమ్ ఆడుతున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్.. చెత్తలా ఉంటాది ఇలాంటి వాటికి ఏడిస్తే.. ఇంత వీక్ అయితే నాకు ఫ్రెండ్ గా ఉండకు' అంటూ షణ్ముఖ్.. సిరిపై అరిచేశాడు.
Also Read: నాటు నాటు... ఆ స్టెప్పులు అంత ఈజీ ఏం కాదు! ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎన్ని టేక్స్ తీసుకున్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement