Bigg Boss Telugu 7: ఎవరూ మంచివారు కాదు, వారికి అసలు క్యారెక్టర్ లేదు - హౌజ్‌మేట్స్‌పై శివాజీ, అశ్విని ఘాటు వ్యాఖ్యలు
Bigg Boss Telugu 7: నామినేషన్స్ ముగిసిన తర్వాత యావర్, శివాజీ, అశ్విని కలిసి ఇతర హౌజ్‌మేట్స్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు.
బిగ్ బాస్ సీజన్ 7లో మరోసారి నామినేషన్స్ రెండోరోజు కూడా ప్రసారం జరిగాయి. మొదటిరోజు నామినేషన్స్ ప్రక్రియ ఎంత వాడివేడిగా సాగిందో.. రెండోరోజు కూడా అలాగే జరిగింది. అంతే కాకుండా నామినేషన్స్ అయిపోయాక కూడా అశ్విని, శివాజీ, యావర్.. ఇతర కంటెస్టెంట్స్ గురించి కొన్ని స్టేట్‌మేంట్స్ పాస్ చేశారు. శివాజీ అయితే నామినేషన్స్ వల్ల తనకు ఫ్రస్ట్రేషన్ వస్తుందని, బూతులు వస్తున్నాయని నేరుగా బిగ్ బాస్‌తోనే చెప్పాడు. ఈసారి హౌజ్‌మేట్స్ అంతా నామినేషన్స్ ముగిసిన తర్వాత కూడా దానిగురించి చాలాసేపే మాట్లాడుకున్నారు.
శివాజీ మాటలకు అశ్విని ఏడుపు..
ముందుగా శివాజీ నామినేషన్స్‌తో నేటి ఎపిసోడ్ మొదలయ్యింది. గౌతమ్‌ను నామినేట్ చేస్తున్నట్టు శివాజీ చెప్పాడు. వాదించుకోకుండా పాయింట్స్ మాట్లాడుకుందామని గౌతమ్‌ను పిలిచాడు. గౌతమ్.. తనను నామినేట్ చేసిన పాయింట్ నచ్చలేదని, తిరిగి నామినేట్ చేస్తూ తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు శివాజీ. బాల్స్ గేమ్‌లో ప్రియాంక మాత్రమే సరిగా ఆడిందని చెప్పడం తనకు నచ్చలేదని అన్నాడు. గౌతమ్ తర్వాత అశ్విని నామినేట్ చేయాలనుకున్నాడు. అనుమతి లేకుండా పిల్లికి పాలు పెట్టింది అనే కారణంతో తనను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. కానీ అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకున్న కారణంగా తనను ఇంకెవరు నామినేట్ చేసే అవకాశం లేదని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. దీంతో అర్జున్‌ను ఎంచుకున్నాడు శివాజీ. కానీ శివాజీ అన్న మాటలు అశ్విని మైండ్‌లో ఫిక్స్ అయిపోయాయి. సిల్లీ కారణాలకు నామినేట్ చేయకూడదని శివాజీని వదిలేశానని, తన తల్లి వచ్చినప్పుడు కూడా పెద్దాయనతో గొడవపెట్టుకోకుండా మంచిగా ఉండమని చెప్పిందని గుర్తుచేసుకుంటూ ఏడ్చింది అశ్విని.
యావర్‌పై అలిగిన అర్జున్..
ఆ తర్వాత యావర్ వచ్చి అమర్‌దీప్ సంచాలకుడిగా తప్పు చేశాడని తనను నామినేట్ చేశాడు. అమర్‌దీప్ తర్వాత అర్జున్‌ను నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు యావర్. ఎక్కువగా ఎవరితో కలవడం లేదని, తనకంటూ సొంత అభిప్రాయం లేదని కారణాలు చెప్పాడు. కానీ అర్జున్‌కు ఆ విషయం నచ్చలేదు. కావాలని నామినేట్ చేశాడని ఆరోపించాడు. ‘‘హౌజ్‌లో ఉన్నన్ని రోజులు కలవడం అనేది జరగదు’’ అంటూ యావర్‌కు సూటిగా చెప్పేశాడు అర్జున్. అన్నట్టుగానే నామినేషన్స్ ముగిసిన తర్వాత యావర్‌కు దూరంగానే ఉన్నాడు. యావర్ మరీ మరీ వెంటపడగా.. మామూలుగా మాట్లాడతానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఎవరితో కలవడం లేదు అనే పాయింట్.. రతిక యావర్‌తో చెప్పడం వల్లే తనను యావర్ నామినేట్ చేశాడని అర్జున్ డిసైడ్ అయిపోయాడు. దీంతో రతికపై నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నాడు.
ఎవరూ మంచివాళ్లు కాదు..
శోభా శెట్టి వచ్చి శివాజీని, అర్జున్‌ను నామినేట్ చేసింది. ప్రియాంక కూడా శివాజీనే నామినేట్ చేయగా.. వారిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. యావర్‌తో కూడా నామినేషన్ విషయంలో పెద్ద వాగ్వాదమే చేసింది ప్రియాంక. ఇలా నామినేషన్స్ ముగిశాయి. ఈవారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ శివాజీ, అర్జున్, రతిక, గౌతమ్, ప్రశాంత్, యావర్, అమర్‌దీప్, అశ్విని అని బిగ్ బాస్ ప్రకటించారు. నామినేషన్స్‌లో శివాజీతో జరిగిన వాగ్వాదం ప్రియాంకను బాగా డిస్టర్బ్ చేసింది. దీంతో తనతో కూడా తప్పేంటి అని చర్చించే ప్రయత్నం చేసింది. కానీ శివాజీ మాత్రం తనతో మాట్లాడడానికి కూడా సిద్దంగా లేడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వెళ్లిన తర్వాత కూడా ప్రియాంక, శోభాలను ఎప్పటికీ కలవాలని అనుకోవడం లేదని యావర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆటలో స్ట్రాటజీలు ఉండవచ్చు కానీ క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యమని యావర్ చెప్పిన మాటలతో అంగీకరించాడు శివాజీ. ఇదే మాట వచ్చి అశ్వినితో కూడా అన్నాడు యావర్. తనకు కూడా అలాగే అనిపించిందని, హౌజ్‌లో ఉన్నవారు ఎవరు మంచివాళ్లు కాదని అశ్విని కూడా ఆరోపించింది.
Also Read: బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి - ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం మళ్లీ పోటీ, ప్రియాంకకు మరోసారి ఎదురుదెబ్బ