News
News
X

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ హౌస్‌లో యాంకర్ అనసూయ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆడియన్స్ తరపు నుంచి కొన్ని ప్రశ్నలు అడిగింది.

FOLLOW US: 
Share:

‘బిగ్ బాస్’ చివరి దశకు చేరుకుంది. దీంతో కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. ఇక నామినేషన్లలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరిపై ఒకరు మాటలతో దాడి చేసుకుంటున్నారు. బిందు, నటరాజ్ మాస్టర్‌ల మధ్య శత్రుత్వంగా బాగా పెరిగిపోయింది. నామినేషన్ల విషయంలో బిగ్ బాస్.. కంటెంస్టెంట్లు అందరికీ షాకిచ్చాడు. ఈ వారం అంతా నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం హౌస్‌లో మిత్రా శర్మ, బాబా భాస్కర్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాష్టార్మ్ అరియనా, అఖిల్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చని భావిస్తున్నారు. 

అనసూయ ఎంట్రీ: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి యాంకర్, నటి అనసూయ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టార్ అమ్మాయి వేషంలో ఎంట్రీ ఇచ్చారు. ‘‘బావొచ్చాడోయ్ మామ..’’ పాటకు నాటు స్టెప్పులతో ఇరగదీశారు. ఈ ప్రోమో చూసిన నెటిజనులు ‘పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్’ అని కామెంట్లు చేస్తున్నారు. అనసూయ.. హౌస్‌మేట్స్‌కు ఆడియన్స్ వేసిన పలు ప్రశ్నలను అడిగింది. అరియానా, అఖిల్‌ను ఉద్దేశిస్తూ ఫ్యామిలీ వచ్చిన తర్వాత బిందుకు ఎందుకు క్లోజ్ అయ్యారని పలువురు ప్రశ్నించారు. వీటికి వారు ఏం సమాధానం చెప్పారో తెలియాలంటే తాజా ఎపిసోడ్ చూడాల్సిందే.  

Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!

బిందు, నటరాజ్ మధ్య మాటల యుద్ధం: నామినేషన్లు సందర్భంగా బిందు, నటరాజ్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నటరాజ్ బిందు, బాబా మాస్టర్‌, అరియానాలను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా బిందు, నటరాజ్‌ల మధ్య వాగ్వాదం నెలకొంది. ‘‘నెగటివిటీ కంప్లీట్‌గా ఉన్న ఓన్లీ వన్ పర్శన్ నువ్వు మాత్రమే’’ అని నటరాజ్ వ్యాఖ్యానించాడు. ‘‘నీ సైడ్ నుంచి ఏమి వచ్చింది ఇన్ని రోజులు? పాజిటివిటీనా?’’ అని బిందు మాధవి ఎదురు ప్రశ్నించింది. ‘‘ఇప్పటివరకు బిందు చేసినవన్నీ దొంగ నామినేషన్లే’’ అని కెమేరాల వైపు తిరిగి నటరాజ్ చెప్పాడు. కెమేరాలకు ఎందుకు చెబుతున్నారని బిందు మాధవి అడిగితే.. ‘‘నీ ఫేస్ చూడలేక కెమేరాలకు చెబుతున్నా. నీ కళ్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో, నరాలన్నీ ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసి.. నేను అటగు చూస్తున్నా. ‘‘శూర్పణక నీ టైమ్ ఆసన్నమైంది. ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు’’ అని నటరాజ్ కామెంట్ చేశారు. దీంతో బిందు మాధవీ ఏమీ మాట్లాడకుండా దుర్గ మాత పోజులో నటరాజ్‌కు సమాధానం ఇచ్చింది. ఈ ప్రోమో చూసి నెటిజనులు నటరాజ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాస్త ఓవర్‌గా మాట్లాడుతున్నారని అంటున్నారు. 

Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?

Published at : 13 May 2022 01:36 PM (IST) Tags: Nataraj master Bigg Boss Telugu OTT bigg boss non stop Bindu Madhavi Anasuya in Bigg Boss Anchor Anasuya in Bigg Boss Akhil Sardhak

సంబంధిత కథనాలు

Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా

Vishnu Priya Manas New Song : నల్లంచు చీరెదాన, నకిలీసు పెట్టేదానా - విష్ణుప్రియ, మానస్ మళ్లీ దుమ్మురేపారుగా

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!