News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sohel's Lucky Lakshman : సోహైల్ కోసం రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా పాట - కలర్‌ఫుల్ గాళ్స్, కాలేజ్ బ్యాక్‌డ్రాప్

College Song Lyrical video : 'బిగ్ బాస్' సోహైల్ హీరోగా నటించిన సినిమా 'లక్కీ లక్ష్మణ్'. ఇందులో రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా ఓ పాట పాడారు. ఆ పాటను నేడు విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

'బిగ్ బాస్' సోహైల్ (Syed Sohel) కథానాయకుడిగా నటించిన సినిమా 'లక్కీ లక్ష్మణ్' (Lucky Lakshman Movie). ఇందులో మోక్ష కథానాయిక. ఎ.ఆర్. అభి దర్శకత్వం వహించారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై హరిత గోగినేని' నిర్మించారు. ఈ సినిమాలో యువ గాయకుడు, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), రోల్ రైడా (Roll Rida) కలిసి ఓ పాట పాడారు. దానిని ఈ రోజు విడుదల చేశారు.

కాలేజ్ అంటేనే వాయిస్ ఆఫ్ యూత్!
'లక్కీ లక్ష్మణ్' నుంచి ఈ రోజు 'కాలేజ్ సాంగ్' విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల రవి కుమార్ (Bhaskarabhatla Ravi Kumar) రాసిన ఈ పాట కాలేజీ నేపథ్యంలో సాగింది.
 
''రింగ రింగ రోజెస్...
కాలేజ్ ఫుల్ ఆఫ్ పోజెస్
కాలేజీ డేస్ ఆర్ ఫన్ ఫిల్ డ్యూడ్
కలర్ ఫుల్ గాళ్స్... ఖతర్నాక్ బాయ్స్...
కాలేజీ అంటేనే వాయిస్ ఆఫ్ యూత్'' అంటూ సాగిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ర్యాప్ లిరిక్స్ రోల్ రైడా పాడారు.  

'లక్కీ లక్ష్మణ్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో   ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. త్వరలో అనౌన్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. 

Lucky Lakshman Teaser : 'లక్కీ లక్ష్మణ్' టీజర్ చూస్తే... కాన్సెప్ట్ ఏంటి? అనేది ఈజీగా అర్థం అవుతుంది. తానొక అన్ లక్కీ అని ఫీలయ్యే అబ్బాయి కథతో సినిమా రూపొందించినట్టు దర్శక నిర్మాతలు గతంలో చెప్పారు. అతడి దురదృష్టం ఎలా ఉంటుందో టీజర్‌లో చూపించారు. 

'అందరూ అదృష్టం ఇంటిలో ఉండాలని అనుకుంటారు. కానీ, అదే అదృష్టం ఇంటి పేరు అయితే?' అని సోహైల్ చెప్పే డైలాగుతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చే సీన్స్ చూస్తే... అతడికి అదృష్టం కాదు, దురదృష్టం అని మనకు తెలియడానికి ఎక్కువ సేపు పట్టదు. 

స్కూల్‌లో తోటి విద్యార్థులతో పిక్‌నిక్‌కు వెళ్ళడానికి వంద రూపాయలు అడిగితే... 'ఆ వంద ఉంటే (కొత్త సాక్స్ కొంటాను కాను) ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి ఎందుకు పంపిస్తాను?' అని కుమారుడితో తండ్రి చెప్పడం చూస్తే విషయం అర్థం కాలేదూ! ఇక, అమ్మాయిల విషయంలో కూడా లక్ష్మణ్ దగ్గర లక్ లేదు. ఇద్దరూ ఒకేసారి 'గుడ్ బై' చెప్పేసి వెళతారు. ''నువ్వు కాకపోతే లక్ష్మణ్ గాడిని లక్ష మంది కోరుకుంటున్నారు'' అని సోహెల్ చెప్పే డైలాగ్ హీరో క్యారెక్టర్, యాటిట్యూడ్ చెబుతోంది. ''ఆస్తుల్ని  అమ్ముకున్నోడు అయినా పైకి వస్తాడు ఏమో గానీ... అమ్మాయిలను నమ్ముకున్నోడు మాత్రం పైకి రాలేదురా'' అని హీరో చెప్పే డైలాగుతో టీజర్ ముగించారు.

Also Read : మహేష్, త్రివిక్రమ్ షూటింగ్‌కు పూజా హెగ్డే రెడీ - పుకార్లకు చెక్ పెట్టిన బుట్టబొమ్మ

సోహెల్, మోక్ష జంటగా నటించిన 'లక్కీ లక్ష్మణ్' సినిమాలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, రచ్చ రవి , 'జబర్దస్త్' కార్తిక్, జబర్దస్త్ గీతూ రాయల్, 'కామెడీ స్టార్స్' ఫేమ్ యాదమ్మ రాజు తదితరులు ఇతర తారాగణం.

ఈ చిత్రానికి నృత్యాలు : విశాల్, కూర్పు : ప్రవీణ్ పూడి,  ఎగ్జిక్యూటివ్ నిర్మాత : విజయానంద్ కీత,  ఛాయాగ్రహణం : ఐ. ఆండ్రూ, పాటలు : భాస్కరభట్ల రవికుమార్, సంగీతం : అనూప్ రూబెన్స్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం : ఏఆర్ అభి.

Published at : 09 Dec 2022 04:31 PM (IST) Tags: Lucky Lakshman Movie Bigg Boss Sohel Syed Sohel

ఇవి కూడా చూడండి

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?