X

Bigg Boss Telugu 5 Salary: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కి నాగార్జున అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా?

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీషో ప్రారంభమైంది. మూడు, నాలుగు సీజన్లకి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే ఈ సీజన్ కూడా హోస్ట్. మరి ఈ సారి నాగ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

FOLLOW US: 

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న మూడో సీజన్ ఇది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నాడు. మూడో  సీజన్లో ఒక ఎపిసోడ్ కి దాదాపు 12 లక్షలు వసూలు చేసిన నాగ్ నాలుగో సీజన్లో పారితోషికం కొద్దిగా పెరిగిందట. ఇక ఐదో సీజన్ వచ్చేసరికి భారీగానే తీసుకుంటున్నాడని టాక్. ఈ సీజన్ మొత్తానికి దాదాపు రూ.11 కోట్ల నుంచి 12 కోట్లు వరకు రెమ్యునరేషన్ అందుతోందని టాక్.

బిగ్ బాస్ రియాల్టీ షోని రసవత్తరంగా నడిపించడంలో హోస్ట్ ది ముఖ్యమైన పాత్ర. ప్రతి వారాంతంలో వచ్చే హోస్ట్ ఆ వారం మొత్తం మీద ఇంటి సభ్యుల ఆటతీరు మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏ సందర్భంలో ఎవరెలా ప్రవర్తిస్తున్నారో గమనించి అవసరమైతే ప్రోత్సహించాలి…అనవసరంగా అతిగా ప్రవర్తించేవారిని కంట్రోలే చేసేలా ఉండాలి. ఈ ప్రాసెస్ లో సందర్భానుసారం మాట్లాడాల్సి ఉంటుంది. ఏమాత్రం కాస్త అటు ఇటుగా మాట్లాడినా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటారు. పైగా హౌజ్ లో కంటిస్టెంట్స్ కి కూడా హోస్ట్ కి అందరం సమానమే అనిపించాలి. అంటే అటు ఇంట్లో సభ్యుల్ని నొప్పించకుండా అక్కడి సమస్యలకు చెక్ పెడుతూ ఆటసాగేలా చేయాలి..ఇటు ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. బిగ్ బాస్ భాషలో చెప్పాలంటే వారం వారం హోస్ట్ కి ఇదో పెద్ద టాస్క్. అందుకే మూడు, నాలుగు సీజన్లను సక్సెస్ ఫుల్ గా నడిపించిన నాగార్జుననే ఐదో సీజన్ హోస్ట్ గా ఎంపిక చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ వార్తలపై నాగార్జున కానీ, మేకర్స్ కానీ స్పందించలేదు. అందుకే ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

Also read: సరయు vs సన్నీ.. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తానంటూ హీట్ పెంచిన భామ, నామినేషన్లలో రచ్చ!

ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించడంపై నాలుగు రోజుల క్రితం మాట్లాడిన నాగార్జున ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో అందరిలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలన్నదే తమ ప్రయత్నం అన్నాడు. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని చెప్పాడు. ప్రతి నట్టింట్లో వినోదాన్ని పంచే ఈ షోలో భాగస్వామ్యం కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

Also Read: ‘చెత్త’ నామినేషన్లు.. పాయిఖానాలు, చిప్పలు కడుగుతా కానీ.. ప్రియ, రవిలపై లోబో ఫైర్!

Also Read: బిగ్ బాస్‌ 5లో స్మోకింగ్ బ్యాచ్.. లోబోతో కలిసి దమ్ముకొట్టిన సరయు, హమీద.. ప్రియా గురించి చర్చ

Tags: nagarjuna Bigg Boss Telugu 5 Hikes His Remunerationow In Details

సంబంధిత కథనాలు

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

RRR: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 

Chiranjeevi: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని! 
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandra Babu : దొరకని మోడీ, షా అపాయింట్‌మెంట్లు.. ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Covid 19 Vaccine For Children: చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌పై అపోలో శుభవార్త.. వారికి ఉచితంగా టీకాలపై ప్రకటన

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

Divi Vadthya Photos: ‘దివి’ నుంచి భువికొచ్చిన యాపిల్ బ్యూటీ

AP HighCourt : పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !

AP HighCourt :  పోలీసు శాఖలో వారిని విలీనం చేయడంపై పిటిషన్ ! ఎలా చేశారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం !