Bigg Boss OTT Telugu Contestants: ‘బిగ్ బాస్’ ఓటీటీ కంటెస్టెంట్ల జాబితే ఇదే! వీళ్లను మీరు ఊహించి ఉండరు
‘బిగ్ బాస్’ ఓటీటీకి సర్వం సిద్ధమైంది. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. వీరిని కొద్ది రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. హౌస్‌లోకి పంపుతారు.
Bigg Boss OTT Telugu | ఇన్ని రోజులు మీరు బిగ్ బాస్‌ను గంట మాత్రమే చూశారు. ఇకపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో 24 గంటలు ఆ హౌస్‌లో ఏమవుతుందో చూసేయొచ్చు. ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటికే ప్రోమోతో నాగార్జున ఈ క్లారిటీ ఇచ్చేశారు. అయితే, ఎవరెవరు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారనేదే ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన జాబితా ఒకటి ఇప్పటికే లీకైంది. దీని ప్రకారం.. ‘బిగ్ బాస్ ఓటీటీ’ తొలి సీజన్‌లో గతంలో వివిధ బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లకు మరోసారి తమ లక్ పరీక్షించుకొనేందుకు అవకాశం ఇస్తున్నారు. వీరితోపాటు కొత్తవారిని కూడా హౌస్‌లోకి పంపించనున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన కొంతమందికి ఇందులో అవకాశాన్ని ఇస్తున్నట్లు తెలిసింది. మీరు ఊహించని కంటెస్టెంట్లు ఈ సారి బిగ్ బాస్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్రెడీ బిగ్ బాస్ హౌస్ సాంప్రదాయాలు గురించి తెలిసిన కంటెస్టెంట్లకు.. జీరో నాలెడ్జ్‌తో హౌస్‌లో ఉండేందుకు వెళ్తున్న కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీయే నెలకొనే అవకాశం ఉంది. విశ్వసనీయ సమచారం ప్రకారం.. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొంటారని తెలిసింది.
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీరే..:
‘బిగ్ బాస్’ సీజన్ 1 నుంచి..:
1. ఆదర్శ్,
2. ధనరాజ్
3. ముమైత్ ఖాన్
సీజన్ 2 నుంచి..:
4. తనీష్
5. తేజస్వి
సీజన్ 3 నుంచి..:
6. మహేష్ విట్టా
7. అషు రెడ్డి
సీజన్ 4 నుంచి..:
8. అఖిల్
9. అరియానా
సీజన్ 5 నుంచి..:
10. నటరాజ్ మాస్టర్
11. సరయూ
12. హమీద
కొత్తగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేది వీళ్లే..:
13. చైతు (ఆర్జే)
14. స్రవంతి (యాంకర్)
15. మిత్రా శర్మ (నటి)
16. అనిల్ రాథోడ్ (మిస్టర్ ఇండియా 2021)
17. నిఖిల్ (యూట్యూబర్)
18. శివ (యూట్యూబ్ యాంకర్)
19. బమ్ చిక్ బబ్లూ (నటుడు)
గమనిక: ఇది లీకైన జాబితాలోని పేర్లు మాత్రమే. తుది జాబితాలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ఎంపిక చేసిన కంటెస్టెంట్లలో అందరినీ క్వారంటైన్‌లో ఉంచుతారు. చివరిగా 17 మంది కంటెస్టెంట్లను మాత్రమే హౌస్‌లోకి పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Image Credit: Disney Plus Hotstar