అన్వేషించండి

Keerthi Bhat : డబ్బు కోసం దొంగతనం చేశా, వెళ్లి అద్దంలో ముఖం చూసుకోమని హేళన చేశారు, కష్టాలు తలచుకొని కంటతడి పెట్టిన బిగ్ బాస్ కీర్తి భట్

Keerthi Bhat About Her Life :తన జీవితం అంతా కష్టాలతో నిండిపోయిందని బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే భయపటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Bigg Boss Keerthi Bhat About Her Life: సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కీర్తీ భ‌ట్. తెలుగులో వరుస సీరియల్స్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. తాజాగా కీర్తి ‘కాఫీ విత్ శోభా’ ప్రోగ్రాంలో పాల్గొని సందడి చేసింది. కాబోయే భర్త కార్తిక్ తో కలిసి ఈ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటి నుంచి బయట పడేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించింది. కార్తిక్ తో పరిచయం, నిశ్చాతార్థం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ఏడేళ్ల పరిచయంలో మూడుసార్లు మాట్లాడుకున్నాం!

అందరు ప్రేమికుల మాదిరిగా తమ ప్రేమ కథ ఉండదని కీర్తి భట్ చెప్పింది. “కార్తిక్, నేను ఏడేళ్లుగా ఫ్రెండ్స్ గా ఉన్నాం. కానీ, మూడుసార్లే మాట్లాడుకున్నాం. సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు అవకాశాల కోసం నా వివరాలను తనకు పంపించాను. అప్పుడు తను కన్నడ సినిమా చేస్తున్నారు. నా సినిమాలో క్యారెక్టర్ ఉంది. చేస్తారా? అని మెసేజ్ పెట్టారు. కానీ ఆమెసేజ్ చూడలేకపోయాను” అని చెప్పింది.

మూడు నెలల తర్వాత మెసేజ్ కి రిప్లై

సినిమాలో అవకాశం ఉందని కీర్తికి మెసేజ్ పెడితే మూడు నెలల తర్వాత రిప్లై ఇచ్చిందని కార్తిక్ చెప్పారు. “2016 నవంబర్ లో మీరు మా సినిమాలో మెయిన్ లీడ్ చేయాలని మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ కు కీర్తి మూడు నెలల తర్వాత రిప్లై ఇచ్చింది. అప్పటికే మేం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాం. ఆ తర్వాత ఒకసారి హైదరాబాద్ వచ్చే సమయంలో కాసేపు చాట్ చేసుకున్నాం. ఆ తర్వాత కార్తి బిగ్ బాస్ కు వెళ్లే సమయంలో ఓ మెసేజ్ పెట్టాను. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫోన్ లో మాట్లాడుకున్నాం. సుమారు 45 నిమిషాల పాటు మాట్లాడుకున్నా కేవలం ఇండస్ట్రీ గురించే మాట్లాడుకున్నాం” అని చెప్పారు.

కలిసిన తొలి రోజే పెళ్లి ప్రస్తావన

కలిసిన తొలి రోజే కార్తిక్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడని కీర్తి చెప్పింది. “ఓ సినిమా చేస్తున్నాను. మిమ్మల్ని హీరోయిన్ గా అనుకుంటున్నాం. ఇప్పుడైనా 5 నిమిషాలు కలవాలని కార్తిక్ కాల్ చేశాడు. అప్పుడే నాకు తెలిసింది తను ఉండేది మాకు దగ్గర్లోనే అని. నేను తనను కలిసేందుకు హోటల్ కు వెళ్లాను. కథ చెప్పారు. ఇంటికి వచ్చాను. ఆ రోజు ఫిబ్రవరి 14. రాత్రి 12 గంటలు కావడానికి కొద్ది సేపటి ముందు తను మెసేజ్ చేశాడు. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉందా? అన్నారు. సారీ అండీ. నా లైఫ్ లో అలాంటి ఛాప్టర్ లేదు. ఒకే వేళ మీకు ఆ ఉద్దేశం ఉంటే పక్కన పెట్టండని చెప్పాను. కొద్ది రోజుల ఆలోచించి చివరకు తనకు ఓకే చెప్పాను” అని కీర్తి వెల్లడించింది.

అద్దంలో ముఖం చూసుకున్నావా? అన్నారు!

“అమ్మానాన్న చనిపోయిన తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చాక.. ఓ సీరియల్ ఆడిషన్ కు  వెళ్లాను. ఓ పేపర్ ఇచ్చారు. ఆడిషన్ చేశారు. “సర్.. మమ్మల్ని సెలెక్ట్ చేశారా?” అని అడిగాను. “నీ ముఖం అద్దంలో చూసుకున్నావా?” అన్నారు అక్కడ ప్రొడక్షన్ మేనేజర్. అదే సీరియల్ లో రెండు సంవత్సరాల తర్వాత నేను మెయిన్ లీడ్ చేశాను.  అప్పుడు అదే ప్రొడక్షన్ మేనేజర్ తో పక్కన కూర్చొని, “సర్ ఇప్పుడు నా ముఖం బాగుందా?” అని అడిగాను. తను సిగ్గుతో తల దించుకున్నాడు” అని చెప్పింది.   

పెళ్లికి ముందుక కలిసి ఉండటంతో తప్పులేదు

పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండటంలో తప్పు లేదని కీర్తి చెప్పింది. “పెళ్లికి ముందు కలిసి ఉండటంలో తప్పులేదు. ఈ టైమ్ లో ఇద్దరం ఒకరికి ఒకరం కరెక్ట్ కాదని తెలిస్తే విడిపోవచ్చు. కానీ, మాకు కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. కార్తిక్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ కావాలి. నాకు ఒక ఇల్లు కావాలనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మేం పెట్టే మొదటి అడుగు మా సొంత ఇంట్లోనే పెట్టాలనేది మా కల. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఒకరినొకరం బాగా అర్థం చేసుకోవచ్చు” అని చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతోపాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఈ ప్రమాదంలో కీర్తి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. తీవ్రగాయాలైన కీర్తి చాలాకాలం పాటు కోమాలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్లకు కోలుకున్న కీర్తి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి ప్రస్తుతం ‘మధురానగరిలో’ సీరియల్ చేస్తోంది.

Read Also: గుడ్ న్యూస్ చెబుతానన్న జగతి మేడం... ఆమె చెప్పబోయే ముచ్చట ఇదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amrapali Kata  : రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
Telangna Congress Politics : కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
NTR Health University: ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
In Pics: పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Hyper Aadi At Alliance Victory Celebrations: పీపుల్స్ మీడియా ఈవెంట్లో హైపర్ ఆది స్పీచ్Vande Bharat for Bhimavaram: భీమవరం రైల్వే ప్రయాణికులకు శుభవార్తKamal Haasan on Krishnam Raju: kalki 2898AD సినిమా ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గురించి కమల్ హాసన్Kamal Haasan on Kalki 2898AD: కల్కి 2898AD తన విలన్ రోల్ గురించి కమల్ హాసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amrapali Kata  : రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
రేవంత్ సర్కార్‌లో ఐఏఎస్ ఆమ్రపాలి హవా - ఒకే సారి ఐదు కీలక పోస్టులు - ఈ ఆఫీసర్ స్పెషాలిటీ ఏమిటంటే ?
Telangna Congress Politics : కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
కాంగ్రెస్‌లో చేరికల సైడ్ ఎఫెక్టులు - ఎమ్మెల్యే సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి అలక
NTR Health University: ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
ఇకనుంచి అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ - ఏపీ కేబినెట్ ఆమోదం
In Pics: పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
పవన్ కల్యాణ్‌తో టాలీవుడ్‌ నిర్మాతల భేటీ, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి వారితో సమావేశం
Nara Lokesh: 'నాకెందుకు స్పెషల్ - అలాంటివేమీ వద్దు' - మంత్రి నారా లోకేశ్ సింప్లిసిటీ, బాధ్యతల స్వీకరణ
'నాకెందుకు స్పెషల్ - అలాంటివేమీ వద్దు' - మంత్రి నారా లోకేశ్ సింప్లిసిటీ, బాధ్యతల స్వీకరణ
Hydeabad: భార్య జల్సాల కోసం దొంగగా మారిన భర్త! గోవా వెళ్లేందుకు చైన్ స్నాచింగ్!
భార్య జల్సాల కోసం దొంగగా మారిన భర్త! గోవా వెళ్లేందుకు చైన్ స్నాచింగ్!
TGBIE Supplementary Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Revanth Delhi Tour :  ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు -  కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
Embed widget