Jyothi Rai: గుడ్ న్యూస్ చెబుతానన్న జగతి మేడం... ఆమె చెప్పబోయే ముచ్చట ఇదేనా?
సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే బుల్లితెర జగతి మేడం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇంతకీ ఆమె చెప్పబోయే న్యూస్ ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
జ్యోతి రాయ్ అనగానే అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ‘గుప్పెడంత మనసు‘ జగతి మేడం అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో, దానికి ఆమె పెట్టిన క్యాప్షన్ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె చెప్పబోయే విషయం ఏంటా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
యువ దర్శకుడితో పెళ్లి!
నిజానికి జ్యోతి రాయ్ 20 ఏండ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. పద్మనాభ అనే వ్యక్తితో సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. వీరిద్దరికి ఓ అబ్బాయి కూడా పుట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. చాలా కాలంగా ఆమె కొడుకుతో పాటు ఉంటుంది. గత కొద్ది కాలంగా యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో డేటింగ్ చేస్తోంది. ఈ మధ్య తరచుగా అతడితో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. గతంలో వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని వార్తా సంస్థలు పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు రాశాయి. అయితే, తరచుగా సుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ఇద్దరి పెళ్లి అయినట్లు భావిస్తున్నారు.
జగతి మేడం చెప్పే గుడ్ న్యూస్ ఏంటి?
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ గ్లామరస్ ఫోటోను షేర్ చూస్తూ.. 'త్వరలో ఒక గుడ్ న్యూస్ ఉంది' అని రాసుకొచ్చింది. ఇంతకీ ఆమె చెప్పబోయే న్యూస్ ఏంటా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. గత కొంత కాలంగా ప్రియుడితో డేటింగ్ చేస్తున్న నేపథ్యంలో పెళ్లి గురించి చెప్పే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇప్పటికే పెళ్లి చేసుకుంటే ప్రెగ్నెంట్ అనే విషయాన్ని చెప్పి షాకిస్తుందా? అని చర్చించుకుంటున్నారు. మరోవైపు బుల్లితెరపై సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో తన సినిమా ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా విషయాలు చెప్తుందా? అని ఆలోచిస్తున్నారు. మొత్తంగా జగతి మేడం చెప్పే గుడ్ న్యూస్ ఏంటో తెలియాలంటే కాస్త వెయిట్ చేయకతప్పదు.
View this post on Instagram
వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ
జ్యోతి రాయ్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి. కన్నడలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. ‘కన్యాదానం’ సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ చేస్తోంది. ఇందులో జగతి పాత్రలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఓవైపు సీరియల్స్ తో పాటు మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తుంది. కన్నడలో 'సీతారామ కల్యాణ', 'స్టేషన్ 3', 'దియ వర్ణపాటల' లాంటి సినిమాల్లోనూ నటించింది. 'దియా', 'గంధాడ్ గుడి', '99', 'మడిపు', 'నో మోర్ సీక్రెట్స్', 'ప్రెట్టీ గర్ల్' అనే వెబ్ సరీస్ లలోనూ నటించింది.
Read Also: విజయ్ సేతుపతిని కలిసి రామ్ గోపాల్ వర్మ- సినిమాల కంటే బయటే బాగున్నాడంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్