Bigg Boss 6 Telugu: శనివారం ఎపిసోడ్ హైలైట్స్ - అర్జున్ ను ఆడేసుకున్న నాగార్జున, చంటి ప్లాప్!
శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన బిగ్ బాస్ హైలైట్స్ మీకోసం..
ఈ వారం అంతా ఇల్లు గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది. రెండు మూడు రోజులు బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు చేయడంతో అంతా ఎంటర్టైన్మెంట్ తో నిండిపోయింది. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. శనివారం ఫన్ డేగా డిజైన్ చేశారు. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించారు. అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడారు. గత వారం కీర్తి కెప్టెన్సీ ఎలా ఉందని.. ఆదిరెడ్డిని అడిగారు నాగార్జున. దానికి ఆయన బాగానే చేసిందని చెప్పగా.. కెప్టెన్సీ పోటీదారులు ఎన్నుకునే విషయంలో కరెక్ట్ అనే అనిపించిందా..? అని అడిగారు.
ఆమె ఎవరినైతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు చూశారో.. వారి పేర్లే చెప్పారని.. ఆవిడ బయాస్డ్ గా ఉండరని ఆదిరెడ్డి అన్నారు. శ్రీహాన్ తన పేరు చెప్పకపోవడంతో ఫీల్ అయిన విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. దానికి కీర్తి.. శ్రీహాన్ ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు తను చూడలేదని వివరణ ఇచ్చింది. ఇక కెప్టెన్ గా కీర్తికి 80 మార్కులు వేశారు నాగార్జున. ఈ వారం కెప్టెన్ గా ఎన్నికైన రేవంత్ కి కంగ్రాట్స్ చెప్పిన నాగార్జున.. హౌస్ మేట్స్ తో ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ప్రోపర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయమని సలహా ఇచ్చారు.
ఇనయా కంప్లీట్ ప్యాకేజ్:
ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు. ఇంట్లో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ పెట్టారు. తాను ఇద్దరి పేర్లు పిలుస్తానని, వారిద్దరిలో ఎవరు హిట్, ఎవరు ఫ్లాప్ అనేది వాళ్లే తేల్చుకోవాలని చెప్పారు నాగార్జున. మొదట ఇనయా, సూర్యను పిలిచారు. ఇనయా మాత్రం తెగ సిగ్గుపడిపోతూ కనిపించింది. ముందుగా సూర్య తనను హిట్ అని చెప్పుకుంటూ.. 'హౌస్ లో తను పెర్ఫెక్ట్ గా ఉంటున్నానని.. హౌస్ మేట్స్ తో ఏమైనా గొడవ అయితే నేను వెంటనే మర్చిపోయి మాట్లాడతానని.. కానీ ఇనయా క్యారీ చేస్తుందని' చెప్పుకొచ్చాడు. ఇక ఇనయా తన గురించి మాట్లాడుతూ 'హిట్ అంటే అన్నీ కలిపిన ఒక ప్యాకేజే హిట్ అవుతుంది' అంది. వీరిద్దరిలో హౌస్ మేట్స్ అందరూ సూర్యకి హిట్ అని.. ఇనయా ప్లాప్ అని ఓట్లు వేశారు. నాగార్జున ఇనయా కంప్లీట్ ప్యాకేజ్ అని నేను ఒప్పుకుంటున్నా అని చెప్పడంతో.. ఇనయా చాలా ఆనందపడింది. ఇనయా క్రష్ టాపిక్ మాట్లాడారు నాగార్జున.
ఆదిరెడ్డి హిట్టు, గీతూ ప్లాప్:
ఆ తరువాత గీతూ, ఆదిరెడ్డి మధ్య ఇదే పోటీ పెట్టారు. దీంతో గీతూ తాను ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్పాడు. కానీ ఆదిరెడ్డి ఎంటర్టైన్మెంట్ తో పనేముంది, ఇది బిగ్ బాస్ షో అన్నాడు. దానికి గీతూ 'బిగ్ బాస్ 6, ఎంటర్టైన్మెంట్ కు అడ్డా ఫిక్స్' అని అంది. దీనికి ఆదిరెడ్డి.. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే కాదని, గేమ్ సరిగ్గా ఆడాలని.. ఆ విషయంలో గీతూ కంటే తనే బెటర్ అని ఆదిరెడ్డి అన్నారు. హౌస్ మేట్స్ లో ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి రావడంతో అతడికి హిట్, గీతూకి ప్లాప్ వచ్చింది.
చంటి ప్లాప్:
ఇక చంటి - సుదీపలను పిలిచారు నాగార్జున. సుదీప తాను అందరిని కలుపుకుని, ఎవరేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించానని, చంటి మాత్రం తెలుసుకుని అక్కడే ఆగిపోయారని అంది. దానికి చంటి తాను హిట్ అని చెప్పుకోవడం లేదు అన్నారు. దానికి నాగార్జున మీరు ఫ్లాప్ అని ఒప్పుకుంటున్నారా? అంటే... అవును అన్నాడు చంటి. చూసే ప్రేక్షకులకు మీరు ఫ్లాప్ అని మీరే చెబుతున్నారా అని రెట్టించి అడిగారు నాగార్జున. అప్పుడు కూడా చంటి అవుననే అన్నారు. దానికి తగ్గట్లే హౌస్ మేట్స్ ఓట్లు కూడా వచ్చాయి. దీంతో చంటి ప్లాప్ అని తేలిపోయింది.
వసంతి, అర్జున్ కళ్యాణ్ ల మధ్య గేమ్ పెట్టగా.. తను గేమ్ లో ఎప్పుడూ రూల్స్ క్రాస్ చేయలేదని, ఎవరితో గొడవలు లేవని కాబట్టి తనే హిట్ అని చెప్పింది. అర్జున్ గేమ్ పక్కన పెట్టేశాడని.. త్యాగాలు ఎక్కువయ్యాయని చెప్పింది వసంతి. అర్జున్ మాత్రం వసంతి మాటలను యాక్సెప్ట్ చేయలేదు. ఆమె కంటే తనే ఎక్కువ గేమ్ ఆడానని, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని తెలిపాడు. వీరిద్దరిలో ఎవరు హిట్టు..? ఎవరు ప్లాప్..? అనేది చెప్పమని సత్యని అడగ్గా.. ఆమె అర్జున్ హిట్ అని చెప్పింది. అయితే హౌస్ మేట్స్ మాత్రం వసంతి హిట్ అని.. అర్జున్ ప్లాప్ అని చెప్పారు.
ఆదిరెడ్డి సేఫ్:
నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందికి బెలూన్స్ టాస్క్ ఒకటి ఇచ్చారు నాగార్జున. ఇందులో ఆదిరెడ్డికి సేఫ్ వచ్చింది.
బాలాదిత్య, రాజ్ ల మధ్య గేమ్ పెట్టగా.. ఐదు వారాలుగా తప్పో, ఒప్పో గేమ్ అయితే ఆడానని చెప్పాడు బాలాదిత్య. తను గేమ్ లో బాగా ఇంప్రూవ్ అయ్యానని రాజ్ చెప్పాడు. హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు బాలాదిత్యకు రావడంతో అతడు హిట్ అని చెప్పారు నాగార్జున.
మెరీనా, ఫైమాల మధ్య గేమ్ పెట్టగా.. మొదటి నుంచి తను గేమ్ ఆడుతున్నానని.. మెరీనా ఆడడం లేదని చెప్పింది ఫైమా. మెరీనా దానికి ఒప్పుకోలేదు. హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు మెరీనాకి రావడంతో ఆమెకి హిట్, ఫైమాకి ప్లాప్ వచ్చింది.
రోహిత్, కీర్తిల మధ్య గేమ్ పెట్టగా.. కీర్తి చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అయిపోతుందని.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో ఆమె బిహేవియర్ నచ్చలేదని రోహిత్ తెలిపాడు. కీర్తి మాత్రం తను హిట్ అని.. గేమ్ బాగానే ఆడానని చెప్పుకొచ్చింది. హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు కీర్తికి రావడంతో ఆమెని హిట్, రోహిత్ ను ప్లాప్ అని చెప్పారు నాగార్జున.
ఫైమా సేఫ్:
నామినేషన్స్ లో మిగిలిన ఏడుగురికి క్యాప్ టాస్క్ ఇవ్వగా.. అందులో ఫైమాకి సేఫ్ అని వచ్చింది.
శ్రీహాన్, శ్రీసత్యల మధ్య గేమ్ పెట్టగా.. శ్రీసత్య బాగా రెచ్చగొడుతుందని.. అందులో పైశాచిక ఆనందం పొందుతుందని కామెడీగా చెప్పాడు శ్రీహాన్. అర్జున్ ని ఏడిపించడంతో కోసం ఆమె చేసే కొన్ని పనులు చెప్పాడు శ్రీహాన్. ఇక శ్రీసత్య తను గేమ్ ఆడుతున్నానని.. పక్కవాళ్లను హర్ట్ చేసేలా ఏం చేయడం లేదని తెలిపింది. శ్రీహాన్ కి వెటకారం చాలా ఎక్కువ అని చెప్పింది. హౌస్ మేట్స్ ఎక్కువ ఓట్లు శ్రీహాన్ కి రావడంతో అతడు హిట్ అని.. శ్రీసత్య ప్లాప్ అని చెప్పారు నాగార్జున.
ఆ తరువాత హౌస్ మేట్స్ కోసం ఒక వీడియోను చూపించారు నాగార్జున. అందులో శ్రీహాన్, శ్రీసత్య డాన్స్ చేస్తుంటే అర్జున్ కళ్యాణ్ ఫీల్ అయినట్లు ఉంది. వీడియో చాలా ఫన్నీగా ఉండడంతో అందరూ పడిపడి నవ్వారు.
గేమ్ లో రేవంత్ ఒక్కడే మిగిలిపోవడంతో హౌస్ మేట్స్ ని అతడి గురించి అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ఎక్కువ మంది హిట్టు అని చెప్పడంతో రేవంత్ హిట్ అని అన్నారు నాగార్జున.
బాలాదిత్య సేఫ్:
నామినేషన్స్ లో మిగిలిన ఐదుగురుకి ఒక టాస్క్ ఇచ్చి.. బాలాదిత్య సేఫ్ అని చెప్పారు.
Also Read : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...
Also Read : ఎక్స్‌పోజ్డ్ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ