అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 50: 'ఆమె కోసమే బిగ్ బాస్ కి వచ్చా' అర్జున్ ఎలిమినేషన్ స్పీచ్ - కన్నీళ్లు పెట్టుకున్న శ్రీసత్య!

ఆదివారం ఎపిసోడ్ లో అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. 

దీపావళి రోజు ఎపిసోడ్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు బిగ్‌బాస్ టీమ్. స్టేజ్ పైకి వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్, రేవంత్, బాలాదిత్య కలిసి ఒక బిగ్ బాస్ గేమ్ మీద ఒక పాట పాడారు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో సూపర్ మార్కెట్ అనే గేమ్ ఆడించారు. 

'ఆధారపడి బతుకుతావు' అనే ట్యాగ్ ను అర్జున్ కి ఇచ్చారు గీతూ. ఒకరి డెసిషన్ మీద ఆధారపడి అతడి డెసిషన్ ఉంటుందని గీతూ కామెంట్ చేశారు. 'రెచ్చగొడతావ్' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు శ్రీహాన్. గేమ్ లో తన మాటలతో, టాస్క్ తో రెచ్చగొడుతూ ఉంటుందని చెప్పారు. 'కట్ ఆఫ్ యువర్ నెగెటివ్స్' అనే ట్యాగ్ ను రేవంత్ కి ఇచ్చారు ఫైమా. 'ల్యాగ్' అనే ట్యాగ్ ను ఇనయాకు ఇచ్చారు మెరీనా. ప్రతీ విషయాన్ని ల్యాగ్ చేస్తుందని కామెంట్ చేశారు. 'వీక్' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు. ఇంట్లో పనులు చేయడంలో ఆమె చాలా వీక్ అని కామెంట్ చేశారు. 
 
'షో పీస్' అనే ట్యాగ్ ను వసంతికి ఇచ్చారు ఇనయా. హౌస్ లో చాలా అందంగా రెడీ అవుతుందని షో పీస్ మాదిరి అని కామెంట్ చేశారు. 'యువర్ ఈగో గెట్స్ హర్ట్ ఈజీలీ' అనే ట్యాగ్ ను ఇనయాకు ఇచ్చారు వసంతి. 'చల్లబడు' అనే ట్యాగ్ ను రేవంత్ కు ఇచ్చారు కీర్తి. 'గోరంతది కొండంత చేసి చెప్తావ్' అనే ట్యాగ్ ను రేవంత్ కి ఇచ్చారు శ్రీసత్య. 'బుద్ధి శుద్ధి చేస్కో' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు బాలాదిత్య. 'ప్రతీదానికి పొడుస్తావ్' అనే ట్యాగ్ ను ఇనయాకు ఇచ్చారు సూర్య. 'నోరు మూసుకో' అనే ట్యాగ్ ను రేవంత్ కు ఇచ్చారు ఆదిరెడ్డి. 'డస్ట్ బిన్' అనే ట్యాగ్ ను రేవంత్ కు ఇచ్చారు అర్జున్ కళ్యాణ్. 'ట్యూబ్ లైట్' అనే ట్యాగ్ ను రాజ్ కు ఇచ్చారు రోహిత్. 'అవసరానికి వాడుకుంటావ్' అనే ట్యాగ్ ను గీతూకి ఇచ్చారు రేవంత్. 
 
రేవంత్, శ్రీహాన్ సేఫ్:  
నామినేషన్స్ లో ఉన్న పదమూడు మందిని నుంచోమని చెప్పిన నాగార్జున.. రేడియో టాస్క్ ఆడించారు. ఇందులో రేవంత్, శ్రీహాన్ సేఫ్ అని ప్రకటించారు. 
 
అంజలి కోసం రేవంత్ పాట: 
'ఝాన్సీ' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం నటి అంజలి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చింది. ముందుగా తన వెబ్ సిరీస్ గురించి మాట్లాడింది. 'ఝాన్సీ' ట్రైలర్ ను ఆడియన్స్ కు చూపించారు నాగార్జున. ఆ తరువాత అంజలి హౌస్ మేట్స్ తో మాట్లాడింది. వారితో ఓ టాస్క్ ఆడించారు. హౌస్ మేట్స్ ని జంటలుగా విడగొట్టి డాన్స్ లు వేయించారు. అంజలి కోసం రేవంత్.. 'అంజలి అంజలి పుష్పాంజలి' అనే సాంగ్ పాడారు. 
 
గీతూ దొరికేసింది: 
ఇక గీతూ ఈరోజు పండుగ కదా లయర్ , లాయర్ వీడియో వేయండి అడిగింది. అది గతంలో ఆమె బాలాదిత్యను లయర్ అన్న విషయంలో గొడవ జరిగింది. ఆ వీడియోను వేయమంది. వీడియో వేయగానే అందులో లయర్ అనే వినిపించింది. అయినా కూడా గీతూ నేను లాయర్ అనే అన్నాను అంది. చివరికి ‘నేనంతే సర్ గాలికి పోయిన కంపను తెచ్చుకుని నాకు గుచ్చుకుంటా’ అంది.
 
ఆదిరెడ్డి సేఫ్: 
మిగిలిన పదకొండు మందిలో సాంగ్ టాస్క్ పెట్టి ఆదిరెడ్డి సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. 
 
రాజ్, ఫైమా సేఫ్: 
నామినేషన్స్ లో మిగిలిన పది మంది కంటెస్టెంట్స్ కి గన్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇందులో రాజ్, ఫైమా సేఫ్ అయినట్లు ప్రకటించారు. 
 
సింగర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ శ్రీరామ్ స్టేజ్ పై తన సాంగ్స్ తో అలరించారు. ఆ తరువాత శ్రీరామ్ ని హౌస్ మేట్స్ తో మాట్లాడించారు నాగార్జున. తరువాత హౌస్ లో మేల్ కంటెస్టెంట్లంతా అమ్మాయిల్లా రెడీ అయి ర్యాంప్ వాక్ చేశారు. వారు ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు శ్రీరామ్ ఒక్కొక్కరి కోసం ఒక్కో పాట పాడారు. రేవంత్ నడిచే సమయానికి  శ్రీరామచంద్ర 'చూడు పిన్నమా' అనే పాట పాడాడు. దానికి రేవంత్ 'సార్ మీరు నాకోసమే పిలిచారు కదా శ్రీరామ్ ని ఈరోజు' అంటూ నవ్వుతూ అన్నారు. తరువాత గెటప్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి డాన్స్ చేశారు. అది చూసిన వారంతా పడి పడి నవ్వారు. 
 
కీర్తి, శ్రీసత్య సేఫ్: 
నామినేషన్స్ లో మిగిలిన ఎనిమిది మందికి పూల టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో కీర్తి, శ్రీసత్య సేఫ్ అని ప్రకటించారు. 
 
స్టేజ్ పై హైపర్ ఆది: 
ప్రతి సీజన్ లో ఎంట్రీ ఇచ్చే హైపర్ ఆది ఈసారి కూడా బిగ్ బాస్ వేదికపై మెరిశారు. ఆ తరువాత హౌస్ మేట్స్ పై పంచ్ లు వేశారు ఆది. ఈ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదని అన్నారు. మధ్యలో దూరే అవార్డ్స్ ఏమైనా ఉంటే అది గీతూకే ఇవ్వాలని అన్నారు ఆది. ఆదిరెడ్డి డాన్స్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు. అర్జున్ కళ్యాణ్ ని సత్య పేరుతో ఏడిపించారు. ఇనయాను ఉద్దేశిస్తూ.. రెండో వారంలో ఆమె బయటకు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారని.. ఆ తరువాత ఆమె గ్రాఫ్ పెరిగిందని చెప్పారు. 
 
కార్తీ ఎంట్రీ.. 
'సర్దార్' సినిమా ప్రమోషన్లో భాగంగా కార్తీ వేదికపై మెరిశాడు. దీపావళి కాబట్టి స్వీట్లు కూడా తీసుకొచ్చానని కంటెస్టెంట్స్ తో చెప్పారు. దానికి ఇనయా 'స్వీట్లు అందరికీ వచ్చేలా చూడండి' అంది. అయినా నాగార్జున స్వీట్ల కోసం పోటీ పెట్టారు. ఇందులో ఫైమా చాలా కామెడీగా ఆడి నవ్వించింది. 
 
రోహిత్ సేఫ్: 
నామినేషన్స్ లో మిగిలిన ఆరుగురిలో ఒకరిని సేవ్ చేయమని కార్తికి చెప్పారు నాగార్జున. మ్యాజిక్ బాక్స్ లో ఉన్న నామినేటెడ్ కంటెస్టెంట్స్ పేర్లు తీసి చదివిన కార్తి.. రోహిత్ సేఫ్ అని చెప్పారు. 
 
ఇనయా, మెరీనా సేఫ్:
అర్జున్, వసంతి, ఇనయా, మెరీనాలకు కాయిన్స్ టాస్క్ ఇచ్చి ఇనయా, మెరీనా సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. 
 
అర్జున్ ఎలిమినేషన్: 
అర్జున్, వసంతిలలో ఎవరు సేఫ్ అవుతారో.. స్టేజ్ పై నుంచి ఒక టాస్క్ ద్వారా చూపించారు నాగార్జున. ఈ టాస్క్ లో వసంతి సేఫ్.. అర్జున్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. 
 
అర్జున్ ఎలిమినేషన్ ని ఊహించని హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. శ్రీసత్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది. 'ఎవరికోసం ఏడవనని అన్నావ్ ఎందుకు ఏడుస్తున్నావ్ అని' సత్యని అడిగింది గీతూ. 
 
ఎవరు ఆటం బాంబ్ - ఎవరు తుస్: 
అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచిన నాగార్జున.. హౌస్ లో ఎవరు ఆటం బాంబ్, ఎవరు తుస్ అని అడిగారు. దానికి అర్జున్.. శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతూ, ఫైమాలను ఆటం బాంబ్స్ అని.. రోహిత్, మెరీనా, కీర్తి, ఇనయా, బాలాదిత్యలకు తుస్ అని ఇచ్చారు. 
 
శ్రీసత్య కోసమే హౌస్ లోకి వచ్చానని.. స్టేజ్ పై చెప్పారు అర్జున్ కళ్యాణ్. బిగ్ బాస్ కి రావడానికి ముందు శ్రీసత్యని ఓ సినిమా కోసం రిఫర్ చేశానని.. దానికి ఆమె కుదరదు బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పిందని.. వెంటనే నేను కూడా అప్లై చేశానని అర్జున్ చెప్పుకొచ్చారు. తనకు బిగ్ బాస్ లో ఛాన్స్ రాగానే ఫస్ట్ శ్రీసత్యకే ఫోన్ చేసి చెప్పానని తెలిపారు అర్జున్. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABPPerada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
UPSC 2023 Ranker Ananya Reddy: కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget