Bigg Boss 6 Telugu Episode 19: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు, మధ్యలో శ్రీహాన్ - ఇనయా పిట్టగోల, నేనే ఆ ‘పిట్టని’ అంటూ మధ్యల వచ్చిన గీతూ
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6లో బాగా గొడవలు పడిన వ్యక్తులుగా ముగ్గురు పేర్లు వినపించడం ఖాయం. వారు ఇనయా, గీతూ, రేవంత్.
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు 19వ రోజుకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటి రోజు నుంచి కొందరు గొడవలు పడుతూనే ఉన్నారు. వారిలో మొదట చెప్పుకోవాల్సిన పేరు ఇనయాసుల్తానా. ప్రతి చిన్న మాటకి లాగి లాగి గొడవ పడడం ఈమె స్పెషాలిటీ. ఇక రేవంత్ కూడా సమయానుసారంగా గొడవ పడతాడు. కాకపోతే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిపోతాడు. ఇక గీతూ... ఈ పిల్లని చేస్తే ముందు ఈమె పుట్టి, తరువాత ఓవరాక్షన్ పుట్టిందా అనిపిస్తుంది. ఒక్కోసారి ఈమె చేష్టలు, మాటలు చాలా చికాకును కలిగిస్తాయి. కాకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ వీళ్ల ముగ్గురు లేకపోతే చాలా కష్టంగా మారేది. ఎందుకంటే ఎక్కువ కంటెంట్ ఇచ్చేది వీళ్లే.
కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు
బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘అడవిలో ఆట’. ఇందులో పోలీస్ టీమ్ గెలిచింది. దీంతో పోలీస్ టీమ్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు, దొంగల టీమ్ నుంచి శ్రీహాన్, అత్యాశ గల వ్యాపారిగా నటించిన గీతూ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. వీరికి మొదటి రౌండ్ లో భాగంగా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. బ్రిక్స్ ని పిరమిడ్‌లా కట్టి వాటిని కాపాడుకోవాలి. ఇందులో ఫైమా, గీతూ అవుట్ అయ్యారు. దీంతో శ్రీహాన్, ఆదిరెడ్డి,శ్రీసత్య రెండో రౌండ్ కు వెళ్లారు. ఈ టాస్క్‌కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు.
గొడవ మొదలు...
అయితే శ్రీహాన్ బ్రిక్స్‌ని తాకాడంటూ కంప్లయింట్ ఇచ్చింది ఫైమా. దానికి ఇనయ నేను కూడా చూశానంటూ సాక్ష్యం చెప్పింది. దీంతో శ్రీహాన్ ‘ఏ పిట్ట వచ్చిన నీ దగ్గర ఏం కూసినా... సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్వు తీసుకో’ అన్నాడు రేవంత్‌తో. దాంతో ఇనయా ‘నన్ను పిట్ట అని ఎలా అంటావ్’ అంటూ గొడవ పెట్టుకుంది. మధ్యలోకి గీతూ అనవసరంగా వచ్చింది. ఆమెకు ఇనయ అంటే పడదు. నేను ఆ పిట్టని అంటూ వచ్చి పాటలు పాడింది. ఆమె ఈ ఇష్యూలో ఇన్వాల్స్ అవ్వాల్సిన అవసరం లేకున్నా కూడా అయ్యింది. ఈ గొడవ చాలా సేపు సాగింది. ఇనయా ముందురోజు ‘వీడు’ అంటే పడని శ్రీహాన్, ఇనయాను మాత్రం పిట్ట అనవచ్చా? అయినా సరే పిట్ట అంటే తప్పేంటి అంటూ కనిపించాడు శ్రీహాన్.
ఆమెకు చిప్ కరప్ట్ అయిపోయింది...
ఇక ఇనయా అంటే పడని వారంతా ఆదిరెడ్డి గీతూ ఒక చోట, నేహా - ఆర్జే సూర్య మరో చోట కూర్చుని ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆమెకు చిప్ కరప్ట్ అయిపోయింది అన్నాడు ఆర్జే సూర్య. ఇక గీతూ ‘శ్రీహాన్ ని మగాడివైతే’ అని ఇనయా అంది దానికి ఆమెకు క్లాస్ పడుతుంది అని చెప్పింది గీతూ. నిన్నటి ఎపిసోడ్‌లో పిట్ట గోల బాగా హైలైట్ అయింది.
Also read: నువ్వరిస్తే అరుపులే నేనరిస్తే మెరుపులే - ఓవర్ అవుతున్న గీతూ, ఫిజికల్ అయిపోయిన టాస్క్