Bigg Boss 5 Promo: ‘ఐ లవ్ యూ డాడీ’.. రవిని చూసి ఏడ్చేసిన కూతురు.. గుండె బరువెక్కడం ఖాయం!
ఈ రోజు (శుక్రవారం) ప్రసారం కానున్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి.. ప్రేక్షకులు భావోద్వేగానికి గురికావడం ఖాయం.
‘బిగ్ బాస్ 5’ తెలుగు.. ముగింపు దశకు వచ్చేసింది. దీంతో బిగ్ బాస్.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ ఆప్తులను చూడటంతో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. దీంతో ఈ ఎపిసోడ్స్.. ఫన్నీగా.. సరదాగా.. సీరియస్‌గా.. ఎమోషనల్‌గా సాగిపోతున్నాయి. ఇప్పటివరకు హౌస్‌లోకి సిరి, మానస్, సన్నీ, కాజల్, శ్రీరామ్ కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చారు. ఇంకా షణ్ముఖ్ జస్వంత్, రవి కుటుంబ సభ్యులు రావలసి ఉంది. శుక్రవారం ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ ఎపిసోడ్‌లో రవి భార్య, కుమార్తె ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ‘స్టార్ మా’ ప్రోమో విడుదల చేసింది.
ప్రోమోలో ముందుగా రవి భార్య నిత్యా సక్సెనా మాత్రమే వచ్చింది. ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే రవిని గట్టిగా హగ్ చేసుకుంది. అయితే, నిత్యతో కూతురు వియా కనిపించకపోవడంతో రవి చాలా బాధపడ్డాడు. వియాను ఎందుకు తీసుకురాలేదని భార్యను అడిగాడు. హౌస్‌లోకి వియాను తీసుకురావడానికి చాలా ట్రై చేశానని, ఫైట్ కూడా చేశానని నిత్య.. రవిని కాసేపు ఆటపట్టించింది. కొద్ది సేపటికి బిగ్ బాస్ వియాను హౌస్‌లోకి పంపించడంతో రవి ఆనందానికి అవధుల్లేవు. కూతురిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వియా కూడా రవిని చూసి ఏడ్చేసింది. హౌస్ మేట్స్ అంతా కాసేపు వియాతో ఆడుకున్నారు. ఇంటి నుంచి వియా తిరిగి వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ‘బై డాడీ’ అని చెప్పడంతో రవి మరింత ఏడ్చేశాడు. చూస్తుంటే.. ఈ రోజు రవి ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేయడం ఖాయం అనిపిస్తోంది. అయితే, షన్ను కోసం ఇంట్లోకి ఎవరు వస్తున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ 5 తెలుగు ప్రోమో:
Daughter ni chusaka #Ravi emotions are priceless ❤️ #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/RZLbVj0sIT
— starmaa (@StarMaa) November 26, 2021
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
Also Read: శ్రీరామ్ సిస్టర్ స్వీట్ వార్నింగ్, మానస్ మదర్‌కి శ్రీరామ్ కొంటె కాంప్లిమెంట్, సిరీ తల్లిదీ అదేమాట..
Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి