By: ABP Desam | Updated at : 26 Nov 2021 08:44 AM (IST)
Edited By: RamaLakshmibai
image credit / Star Maa Hot Star
తన భర్త విజయ్ హౌస్‌కి వచ్చి వెళ్లడంతో కాజల్ చాలా సంతోషంగా ఉంది. తను నీలా కాదంటూ మస్త్ చిల్ అని సన్నీ, మానస్ పంచ్ వేశారు. ఇక శ్రీరామ్, రవిలకు తన భర్త ఇచ్చిన జలక్‌ని కాజల్ మానస్, సన్నీలతో షేర్ చేసుకుంది. మీ ఫ్రెండ్‌ని మీరు కాపాడుకోలేకపోయారని అన్నట్టుగా వాళ్లతో చెప్పింది. అదే టైమ్ లో శ్రీరామ్, రవిలు ఇదే విషయంపై డిస్కస్ చేసుకున్నారు. కాజల్ భర్త హౌస్ నుంచి వెళ్తూ వెళ్తూ శ్రీరామ్‌ని ఉద్దేశించి గొడవల్ని షార్టౌట్ చేసుకోమని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని కూడా రవి స్ట్రాటజీతో ఆలోచించాడు. అతను తన భార్యకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు.. కాజల్ టాప్ 1లో ఉంటే.. నువ్ బాగానే ఆడుతున్నావ్ అలాగే ఆడు అని చెప్తాడు. కానీ.. ఒకరి పేరు మెన్షన్ చేసి అతనితోనే షార్టౌట్ చేసుకో అని చెప్పాడంటే.. నిత్య వచ్చి నాకు అలాగే చెప్పిందంటే.. వాడితో పెట్టుకుంటే నేను ఔట్ అవుతా అని లెక్క.. నేను ఆ పర్సన్‌తో మంచిగా ఉండాలి.. నీకు మ్యాటర్ అర్థమైందా? అని రవి శ్రీరామ్‌కి హితబోధ చేశాడు.
Also Read: అందమైన అచ్చతెలుగు గాయని..
బ్రదర్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన శ్రీరామ్ సిస్టర్
ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా గురువారం హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీరామ చంద్ర చెల్లెలు అశ్విని. ఎంట్రీ తోనే సోదరుడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. నీ క్లారిటీ నీకు ఉండొచ్చు కానీ.. నీ అభిప్రాయం నువ్ చెప్పు కానీ.. ఎదుటివాళ్లు చెప్పేది కూడా విను. ఎందుకు ప్రతి విషయాన్ని అంత సాగిదీస్తావ్ అంటూ చెప్పింది. ఈ సందర్భంలో ఆనీ మాస్టర్ ప్రస్తావన రావడంతో ఇంకా ఎందుకు ఇంకా దాని కోసమే ఆలోచిస్తున్నావ్ అని చెప్పింది.
మానస్ తల్లి పంచ్ లు మామూలుగా లేవు
శ్రీరామ్ చెల్లెలు వచ్చి వెళ్లిన తర్వాత మానస్ తల్లి పద్మిని వచ్చారు. మానస్ ఎంత కామ్ గా ఉంటాడో ఆమె ఫుల్ ఆపోజిట్ లో ఉంది. ప్రియాంక మానస్ గేమ్‌ని డిస్ట్రబ్ చేస్తుందన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది పద్మిని. నా కొడుక్కి పెళ్లిళ్లు చేస్తావా? ఏంగేజ్ మెంట్‌లు చేస్తావా? అని రవిపై సెటైర్లు వేసింది. షణ్ముఖ్ నువ్ నాకు హగ్ ఇయ్యి నేను వెళ్లి ఆ హగ్‌ని దీప్తికి ఇచ్చేస్తా అని నవ్విచ్చింది. శ్రీరామ్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి అంటే ఆంటీ అంటావ్ ఏంటి? అక్క అని అనండి అనడంతో వెంటనే రియాక్టైన శ్రీరామ్ ఆంటీ మీరు ఏజ్ తగ్గించుకోవల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారని పంచ్ వేశాడు. ఆ తరువాత మానస్‌కి నాకు మీలాంటి అమ్మాయిని చూడండి ఆంటీ పెళ్లి చేసుకుంటామ్ అని శ్రీరామ్ అనగా.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తాలే అని అంటూ అవునూ.. నీకోసం బయట హమీదా వెయిటింగ్ ఏమో అని పంచ్ వేసింది.
Also Read: ఎవరన్నారు వంటలక్క అని.. ఇక్కడ చూడండి మతిపోతుంది...
హగ్గులు ఆపేస్తే మంచిది
పద్మిని తర్వాత ఇంట్లోకి వచ్చిన సిరి తల్లి...ఆట బాగా ఆడుతున్నావ్ అని చెప్పింది. అదే సమయంలో షణ్ముక్ ని హగ్ చేసుకోడం బాలేదని సూటిగా కూతుర్ని హెచ్చరించింది. దీంతో ఫీలైన సిరి అందరి ముందూ అలా చెప్పడం సరికాదంది.తండ్రి లేని పిల్ల కదా, తండ్రిలాగా, అన్నయ్యలాగా, ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తుంటే దగ్గరయిపోయింది అంటూ మాట్లాడింది. అంతేకాదు, సిరితో పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు టాప్ 5లో ఉంటున్నావని అందరూ చెప్తున్నారని అన్నది. అయితే ఆ తర్వాత దీనిపై రియాక్టైన షణ్ముక్..తల్లిగా ఆ ఫీలింగ్ ఉండడం తప్పులేదని ...బిగ్ బాస్ నా కుటంబ సభ్యులను పంపించండి అంటూ ఎమోషన్ అయ్యాడు. అయితే తల్లి చెప్పి వెళ్లిన వెంటనే సిరి వెళ్లి షణ్ముక్ ని మళ్లీ హగ్ చేసుకుంది. షన్నూ మాత్రం ఆమెను పట్టుకోకుండానే కూర్చున్నాడు.
సన్నీ మదర్ ఫన్
ఆ తర్వాత వచ్చిన సన్నీ మదర్ కళావతి కూడా హౌస్ మేట్స్ తో చాలా ఫన్ చేశారు. బిగ్ బాస్ హౌస్ ని చూస్తూ ఇక్కడికి రావడం నా అదృష్టమన్నారు. బిగ్ బాస్ హౌస్ లో బర్త్ డే కూడా చేసుకోవడంతో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఖుష్ అయ్యారు.
Also Read: దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
Also Read: కాష్మోరా ప్రయోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. 'తులసీ దళం' కి మించి 'తులసి తీర్థం'.
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు సోనూసూద్ భరోసా.. నేను సాయం చేస్తా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్
Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!
Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?
Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>