X

Bigg Boss 5 Telugu: లోబోకి షాకిచ్చిన హౌస్ మేట్స్ .. కిల్లర్ టెడ్డీ చేతిలో పెట్టి క్లాస్ పీకిన నాగార్జున

41 వ రోజు షో లో భాగంగా ''అలవైకుంఠ పురంలో'' సినిమాలో '' బుట్ట బొమ్మ'' సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఈ రోజు అనుకోని ఎలిమినేషన్ జరిగి..చివర్లో ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున.

FOLLOW US: 

శ్వేత జైలు శిక్ష పూర్తికావడంతో హౌజ్ లోకి వచ్చింది. ఇంకోసారి నువ్వు చెప్పిన ఐడియా అస్సలు ఫాలో కానంటూ రవికి సెటైర్ వేయడంతో ఇద్దరి మధ్యా కాసేపు చర్చ జరిగింది. Bigg Boss 5 Telugu: లోబోకి షాకిచ్చిన హౌస్ మేట్స్ .. కిల్లర్ టెడ్డీ చేతిలో పెట్టి క్లాస్ పీకిన నాగార్జున
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యాషన్ షో:
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారి దుస్తులు ధరించి ఇంటి సభ్యులంతా  ఫ్యాషన్ షో చేశారు. బ్యాగ్రౌండ్ లో ''భారతీయుడు'' సినిమాలో అదిరేటి డ్రెస్సు మీరేస్తే సాంగ్,  మ్యూజిక్ ప్లే అవుతుండగా హౌస్ మేట్స్ ర్యాంప్ వాక్ అదరగొట్టారు. కలర్ ఫుల్ డ్రెస్సులందించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి థ్యాంక్స్ చెప్పారు ఇంటి సభ్యులు.


Bigg Boss 5 Telugu: లోబోకి షాకిచ్చిన హౌస్ మేట్స్ .. కిల్లర్ టెడ్డీ చేతిలో పెట్టి క్లాస్ పీకిన నాగార్జున


హౌస్ మేట్స్ కి క్లాస్ పీకిన నాగార్జున
కెప్టెన్ విశ్వకి కంగ్రాట్స్ చెప్పిన నాగార్జున స్టోర్ రూంలో ఉన్న టెడ్డీ తీసుకొచ్చి లోబోకి ఇమ్మని చెప్పారు. పిల్లో లోంచి కాటన్ ఎందుకు తీసుకుని పెట్టారని అడిగిన నాగ్ తో బిగ్ బాస్ ఇంట్లో ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదన్న విషయం తనకు తెలియదన్నాడు లోబో. సంచాలక్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెబితే వినడం బాధ్యత అని సిరికి సూచించారు నాగార్జున. ఓ టాస్క్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అవసరమైతే సంచాలక్ తో మాట్లాడాలి కానీ అనవసర వాదన సరికాదన్నారు. ఇన్నాళ్లూ అద్భుతంగా ఆడి ఈ వారం ఎందుకు డల్ అయ్యావని శ్రీరామ్ ని క్వశ్చన్ చేసిన హోస్ట్... నువ్వు నీలా ఉండమని చెప్పారు. నటులను తక్కువ చేసి మాట్లాడటం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు.  కిల్లర్ టెడ్డీ పట్టుకుని శ్వేత ఎమోషనల్ అయింది.  క్రైమ్ అని తెలిసినప్పటికీ రవి చేశాడని చెప్పేసింది శ్వేత. కెప్టెన్ అవ్వాలన్న కలని కూడా ఎందుకు పట్టించుకోలేదని కాజల్ ని ప్రశ్నించారు నాగ్. కిల్లర్ టెడ్డీని సన్నీ చేతికి ఇప్పించిన నాగార్జున కాసేపు టెన్షన్ పెట్టించిన తర్వాత  చాలా బాగా ఆడావని కితాబిచ్చారు. షణ్ముక్ అస్సలు ఇన్ ఫ్లుయెన్స్ కానందుకు గుడ్ అన్నారు.  ఐడియా ఇచ్చి వాళ్లతో చేయించాలనుకోలేదని ...బయట కాటన్ లేకపోవడంతో కుషన్స్ లో ఉన్న కాటన్ తీసి బొమ్మలు కుట్టామని చెప్పాడు రవి. అస్సలు శ్వేతతో చెప్పలేదని రవి అనగానే  రవి మాట మారుస్తున్నాడని నాగార్జునకి క్లారిటీ ఇచ్చేసింది శ్వేత. స్ట్రాటజీ ఉండొచ్చు కానీ బ్లేమ్ చేయడం సరికాదని రవిని ఉద్దేశించి నాగార్జున అన్నారు. 


కన్ఫెషన్ రూమ్ కి హౌస్ మేట్స్ 
హౌస్ లో ఉండేందుకు అర్హత లేనివారు ఎవరని అడిగిన ప్రశ్నకు ఇంటి సభ్యులు ఎవరు ఎవరి పేర్లు ఎందుకు చెప్పారంటే...
మానస్- ఇంట్లో ఉండేందుకు శ్రీరామ్ కి అర్హత లేదని చెప్పిన మానస్ చిన్న చిన్న విషయాలను కూడా పర్సనల్ గా తీసుకుంటాడని చెప్పాడు.
సన్నీ- ప్రియకి ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పిన సన్నీ ఆమె గేమ్ తనకు అర్థం కాలేదన్నాడు. టాస్కుల్లో వంద శాతం ఇవ్వలేకపోతున్నారన్నాడు.
కాజల్- బయటకు కనిపించినంత స్వీట్ గా ప్రియ ఉండరని చెప్పిన కాజల్..ఆమెకు ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పింది.
యానీమాస్టర్- కొన్ని టాస్కుల్లో లోబో సొంతంగా ఆడకుండా డిపెండ్ అవుతున్నాడని చెప్పింది.
శ్రీరామ్- స్ట్రాటజీ, మైండ్ గేమ్స్ ఆడే రవి ఇంట్లో ఉండకూడదని చెప్పాడు.
ప్రియ- ఎవరికి గొడవలు అవుతాయా చూద్దామని కాజల్ ఎంజాయ్ చేస్తుందని..ఆమెకు ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పింది 
ప్రియాంక సింగ్- చిన్న విషయాన్ని కూడా కాజల్ పెద్దగా చేస్తుందని..అందుకే ఆమె ఇంట్లో ఉండేందుకు అర్హురాలు కాదంది
శ్వేత- తన మైండ్ వాడకుండా గేమ్స్ లో పక్కవారి అభిప్రాయాలు తీసుకుంటాడని లోబో నాట్ ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పింది
జెస్సీ- తన గేమ్ ఆడకుండా పక్కవారి గేమ్ ని చెడగొట్టే రవి అన్ ఫిట్ ఫర్ హౌస్ అని చెప్పాడు జెస్సీ
సిరి- ప్రతి చిన్న విషయంపైనా రవిపై ఆధారపడే లోబోకి ఇక్కడ ఉండే అర్హత లేదంది.
షణ్ముక్- ఆర్డర్స్ ఫాలో అవడం తప్ప తన గేమ్ తను ఆడడని లోబో పేరు చెప్పాడు
రవి- టూ మచ్ నెగెటివిటీని నింపే కాజల్ కి ఇంట్లో ఉండే అర్హత లేదన్నాడు
విశ్వ-  టాస్కుల్లో సరిగా పార్టిసిపేట్ చేయలేని ప్రియ హౌస్ కి అన్ ఫిట్ ఫర్ హౌస్ అన్నాడు
లోబో-  టాస్కుల్లో ఉండని ప్రియకి ఇంట్లో ఉండే అర్హత లేదన్నాడు


Bigg Boss 5 Telugu: లోబోకి షాకిచ్చిన హౌస్ మేట్స్ .. కిల్లర్ టెడ్డీ చేతిలో పెట్టి క్లాస్ పీకిన నాగార్జున


షాకింగ్ ఎలిమినేషన్..ఫైనల్ గా ట్విస్ట్...
ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పిన సభ్యుల్లో ప్రియకి నాలుగు ఓట్లు, లోబోకి నాలుగు ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరిలో ఎవర్ని హౌస్ లో ఉంచాలన్నది ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలని నాగార్జున సూచించారు. ఈ మేరకు కేవలం నలుగురు మాత్రమే మద్దతివ్వడంతో లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వచ్చిన లోబో హౌస్ మేట్స్ అందరూ మంచోళ్లే అని చెప్పాడు. ఇంట్లో నేను నా లెక్కనే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు.  బై..గుడ్ నైట్ చెప్పేయడంతో స్టేజ్ నుంచి వెళ్లిపోతున్న లోబోని వెనక్కి పిలిచి నాగ్ షాకిచ్చారు. కేవలం ఆడియన్స్ ఓట్ల ద్వారా మాత్రమే ఎలిమినేట్ అవుతారని చెబుతూ లోబోని సీక్రెట్ రూమ్ కి పంపించారు. మళ్లీ బిగ్ బాస్ చెప్పినప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఉంటుందన్న మాట.


Also Read:  పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్... పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా.. ఎన్నికల ముందు విడుదలకు ప్లాన్ 
Also Read : ఫస్ట్ టైం కార్పొరేట్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరో
Also Read: ఆహా 'టాక్ షో' కోసం బాలయ్యకి కళ్లు చెదిరే రెమ్యునరేషన్….!
Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్ బాబు కామెంట్స్ వైరల్
Also Read: 'జబర్ధస్త్' షో కి జడ్జీగా వస్తానన్న బాలకృష్ణ, నటసింహంతో ఫోన్లో మాట్లాడిన రోజా
Also Read:  పాపిట్లో సింధూరం..మెడలో నల్లపూసలు.. బాలయ్య బ్యూటీ పెళ్లెప్పుడు చేసుకుందబ్బా...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Kajal Bigg Boss 5 Telugu Ravi Sunny Priya Host Nagarjuna Lobo Shocking Elimination Housemates Mistakes

సంబంధిత కథనాలు

Yahoo Year End 2021: అల్లు అర్జున్ పై ఎందుకింత ఆసక్తి..సమంత కోసం ఎందుకీ వెతుకులాట..

Yahoo Year End 2021: అల్లు అర్జున్ పై ఎందుకింత ఆసక్తి..సమంత కోసం ఎందుకీ వెతుకులాట..

Vicky-Katrina Wedding: కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..

Vicky-Katrina Wedding: కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..

Bheemla Nayak: పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో.. 

Bheemla Nayak: పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో.. 

Project K: ప్రభాస్ సినిమా కోసమే... హైదరాబాద్ వచ్చిన దీపికా పదుకోన్!

Project K: ప్రభాస్ సినిమా కోసమే... హైదరాబాద్ వచ్చిన దీపికా పదుకోన్!

Rosayya No More: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం

Rosayya No More: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్‌.. మరొకరు ఎవరంటే?

Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్‌.. మరొకరు ఎవరంటే?

Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!

Oxford Dictionary: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2021 ఏంటో తెలుసా.. మీకు బాగా తెలిసిన పదమేలే!

మీ రక్తంలో చక్కెర ఉందా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.. డయాబెటిక్స్‌కు బ్యాడ్ న్యూస్!

మీ రక్తంలో చక్కెర ఉందా? పళ్లు ఊడిపోతాయ్ జాగ్రత్త.. డయాబెటిక్స్‌కు బ్యాడ్ న్యూస్!

Snake Infestation: పామును పట్టుకోబోయి ఇల్లు తగలెట్టేసిన యజమాని..

Snake Infestation: పామును పట్టుకోబోయి ఇల్లు తగలెట్టేసిన యజమాని..