Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్ కి షాకిచ్చిన జెస్సీ... ఎమోషనల్ గా మారిన బిగ్ బాస్ హౌస్
బిగ్ బాస్ ఆదేశాల మేరకు హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు జెస్సీ సిద్ధమయ్యాడు. ఏమైందంటే...
బిగ్ బాస్ సీజన్ 5 తొమ్మిదివారాలు పూర్తై పదోవారంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకూ తొమ్మది మంది ఎలిమిమేట్ కాగా పదోవారం నామినేషన్లలో సిరి, రవి, సన్ని, మానస్, కాజల్ ఉన్నారు. వీరిలో ఎవరు బయటకు వెళతారన్నది ఈ వీకెండ్ ఓటింగ్ ఆధారంగా డిసైడ్ అవుతుంది. అయితే ఇంతలో హౌజ్ నుంచి బయటకు రావాల్సిందిగా జెస్సీని ఆదేశించారు బిగ్ బాస్. జస్వంత్ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందని చెప్పారు. మెయిన్ గేట్ నుంచి బయటకు రావాలని చెప్పారు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ నుంచి వచ్చిన జెస్సీ ఇంటి సభ్యులకు తాను వెళ్లిపోతున్నానని చెప్పాడు. హౌస్ మొత్తం ఒక్కసారిగా ఎమోషన్ అయిపోయింది. సిరి, షణ్ముక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిగిలిన సభ్యులు కూడా జెస్సీ స్ట్రాంగ్ అంటూ ధైర్యం చెప్పారు.
Health issue valla #Jessie house bayatiki vellalsi undi #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/GDDNA5VNyc
— starmaa (@StarMaa) November 9, 2021
బిగ్ బాస్ సీజన్ 4 నుంచి నోయల్ కూడా ఇలాగే బయటకు వచ్చేశాడు. ఆర్థరైటిస్ వ్యాధితో తీవ్ర అనారోగ్యం పాలైన సింగర్ నోయల్ చేతులు పనిచేయడం లేదని, కాళ్లు సహకరించక నడవలేని స్థితికి వచ్చేశానని, భుజాలు కూడా పనిచేయడం లేదని బిగ్ బాస్‌కి మొరపెట్టుకున్నాడు నోయల్. దీంతో స్పెషలిస్ట్‌ల సలహా మేరకు.. మెరుగైన వైద్యం చేయాల్సి ఉందని.. ఇందుకోసం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉందని చెప్పారు బిగ్ బాస్. సీజన్ 4లో నోయల్, సీజన్ 5 లో జెస్సీ అనారోగ్యం కారణంగా ఎలిమినేషన్ తో సంబంధం లేకుండా బయటకు వచ్చేశారు.
సీజన్ 4నో నోయల్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినప్పటి ప్రోమో...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కార్తీక సోమవారం రోజు ఇలా చేయండి...
Also Read: పాదాలకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి? బంగారపువి ఎందుకు ధరించకూడదు?
Also read: పిల్లలకు రోజుకో ఉడికించిన గుడ్డు తినిపించండి... ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Also read: మనసు స్థిరంగా లేదా, ఆందోళనగా అనిపిస్తోందా... వీటిని తినండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి