News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Elimination: ఓడియమ్మ.. బ్రహ్మకే దిమ్మతిరిగేలా చేస్తున్న సిరి గేమ్ ప్లాన్.. ఇదే జరిగితే షన్ను ఔట్?

బిగ్ బాస్ అన్ని సీజన్లలో మోస్ట్ ఇరిటేడెడ్ కపుల్.. సిరి, షన్ను అనే టాక్ వినిపిస్తోంది. మరి, షన్ను టైటిల్ గెలిచేందుకు సిరి మైనస్ కానుందా?

FOLLOW US: 
Share:

కొందరి ఫ్రెండ్‌షిప్‌ను చూస్తే.. చాలా ముద్దొస్తుంది. ఫ్రెండ్స్ అంటే వీళ్లే అనిపిస్తుంది. కానీ, ‘బిగ్ బాస్ 5’లో సిరి, షన్ముఖ్‌లను చూసిన తర్వాత అభిప్రాయాలు మారిపోతాయి. వీరు ఫ్రెండ్సో.. లవర్సో.. మరేదో తెలియక.. జుట్టు పీక్కుంటూ.. హెయిర్‌లాస్ అవుతున్న ప్రేక్షకుల సంఖ్య.. క్రమేనా పెరుగుతోంది. బిగ్ బాస్ ఎండింగ్‌కు వచ్చేసరికి.. వీరి ఇరిటేషన్ మరింత పెరిగిపోయిందంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ జోడిలో ఒకరు పక్కా గేమ్ ప్లాన్‌తో వస్తే.. మరొకరు మాత్రం ఏ ప్లాన్ లేకుండా.. ఫ్రెండ్‌షిప్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. అతడే షన్ముఖ్ జస్వంత్. 

బిగ్ బాస్ తెలుగులో ఇప్పటివరకు ప్రసారమైన సీజన్లలో.. మోస్ట్ ఇరిటేటింగ్ కపుల్ ఎవరంటే.. షన్ను-సిరి అనే చెప్పుకోవాలి. ఈ విషయాన్ని వారి అభిమానులు అంగీకరించకపోవచ్చు. కానీ, ఈ షో చూస్తున్న ప్రేక్షకుల్లో చాలామంది అభిప్రాయం ఇదే ఉంది. మొదట్లో వీరి స్నేహం చాలా ముద్దొచ్చేది. కానీ, ఇప్పుడు హద్దుదాటి సహనానికి పరీక్ష పెడుతోంది. మొదట్లో సిరి.. షన్నుకు మంచి ఫ్రెండ్‌గా కనిపించేవారు. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకొనేవారు. అప్పుడు ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటం వల్ల అది పెద్ద సమస్యగా కనిపించేది కాదు. జస్సీ కూడా వీరితో కలిసి ఉండటం వల్ల దోస్తీ బాగుండేది. కానీ, జస్సీ బయటకు వెళ్లిన తర్వాతి నుంచి సిరిలో మార్పు కనిపించింది. షన్ముఖ్‌తో బాగా చనువుగా ఉండటం మొదలుపెట్టింది. హగ్గులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. షన్నుకు ఊపిరి సలపకుండా చేసింది. షన్ను‌కు సైతం ఆమె అలవాటైపోయింది. ఆమెతో తప్పా మరెవ్వరికీ దగ్గర కాకుండా.. దాదాపు ఒంటరిగానే గేమ్ ఆడటం మొదలుపెట్టాడు. అయితే, సిరి మాత్రం.. ఒంటరి కాదు. ఆమె ఇంటి సభ్యులతో కలిసిపోతూ.. మంచి చేసుకుంటూనే.. తన గేమ్ చెడిపోకుండా జాగ్రత్తపడుతూ వస్తోంది. కానీ, ఆమె వల్ల షన్ను గేమ్ పాడైపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలోనే కాదు.. చివరికి టాస్కుల్లో కూడా తన సత్తా చాటలేక చతికిలపడ్డాడు. కానీ, సిరి మాత్రం టాస్క్‌ వస్తే ప్రాణం పెడుతుంది. గెలిచేవరకు పోరాడుతూనే ఉంటుంది. ఆ స్పిరిట్ ఇంటి సభ్యులకు కూడా బాగా నచ్చేసింది. 

బ్రహ్మకే షాకిచ్చే గేమ్ ప్లాన్: సిరి చూసేందుకు అమాయకంగా కనిపిస్తుంది. కానీ, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడే ఓ గేమ్ ప్లాన్‌తో వచ్చింది. అప్పటికే ఫ్యాన్ బేస్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షన్నుతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. సిరి-షన్ను ఇదివరకే యూట్యూబ్‌లో కలిసి వీడియోలు చేశారు. దీంతో ఈ జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. వారిని ఆకట్టుకోవడంలో ఈ జోడి సక్సెస్ అయ్యింది. దీనివల్ల సిరికే ఎక్కువ లాభం వచ్చింది. షన్ను.. నామినేషన్లలో లేనప్పుడు సిరి సేవ్ అవడానికి అతడి ఓట్లు పనికొచ్చాయి. ఇద్దరు నామినేషన్లో ఉన్నప్పుడు మాత్రం.. ఒక్కోసారి సిరి ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లొచ్చింది. దీంతో సిరి.. గేమ్ ప్లాన్ మార్చుకుంది. షన్నుకు మరింత దగ్గరైంది. చివరికి తల్లి, ఆమెకు కాబోయే భర్త నుంచి ప్రతికూల స్పందన వచ్చినా.. ఆమె తన గేమ్ ప్లాన్‌ను మార్చలేదు. రవి బయటకు వెళ్లిన తర్వాత.. ఆమె తన ప్లాన్‌ను మార్చింది. తాజాగా ఎపిసోడ్‌లో రవి కలలోకి వచ్చాడంటూ కథల్ చెప్పింది. గుర్తొచ్చినప్పుడల్లా రవిని తలచుకుంటూ బయట ఉన్న అతడి ఫ్యాన్స్ సపోర్ట్ పొందేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల సిరి సేఫ్‌గా టాప్-5లోకి వెళ్లేలా కనిపిస్తోంది.  అయితే, బిగ్ బాస్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన షన్ను మాత్రమే విలన్‌గా మారిపోతున్నాడు. సిరిపై తన ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కుతున్న విధానాన్ని చూసి.. కొందరు సైకో షన్ను అంటున్నారు. సిరి మీద జాలి చూపిస్తున్నారు. పరిస్థితి ఈ వారం ఇలాగే కొనసాగితే.. షన్నుకు గండమే. మరి తనను తాను బ్రహ్మగా భావించే షన్ను.. తన తలరాతను ఎలా మార్చుకుంటాడో చూడాలి. ఇప్పుడికిప్పుడు మారి ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా.. అతడి చేతిలో పట్టుమని పది రోజులు కూడా లేవు. 

సన్నీ లీడ్.. షన్ను?: బిగ్ బాస్‌లో ఇప్పుడు అందరి చూపు సన్నీ మీదే ఉన్నాయి. కాజల్ కూడా అతడికి సపోర్ట్‌గా ఉంటూ మంచి మార్కులే కొట్టేస్తోంది. కానీ, శ్రీరామ్‌తో వాదన వల్ల.. కాజల్‌పై వ్యతిరేకత ఉంది. అయితే, మానస్ ఇంకాస్త యాక్టీవ్‌గా ఉంటే.. టాప్5లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే.. టాస్కుల్లో ముందుంటాడు. ఎమోషనల్లను కంట్రోల్ చేసుకోవడంలో మానస్ తర్వాతే మరెవరైనా.. చిన్న స్మైల్‌తో అందరికీ కూల్ చేస్తాడు. ఏదైనా ఉంటే ముఖం మీదే చెప్పేస్తాడు. కాబట్టి.. ఈ వారం ఎలిమినేషన్‌లో కాజల్, మానస్ మధ్య టఫ్ వార్ సాగే అవకాశం ఉంది. మరోవైపు సిరి పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. చివరి వారాల్లో హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న సిరికి.. ఇప్పుడు షన్ను విలన్‌గా మారాడు. షన్నూ సీరియస్‌గా ఉండటం, ఆమెను తప్పుబట్టడం.. సిరి కూడా తప్పదు అన్నట్లు భరించడం వల్ల షన్ను-సిరి మధ్య ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రస్తుతం వీరిని కాపాడేది కేవలం అభిమానుల ఓట్లు మాత్రమే అనే టాక్ వినిపిస్తోంది. సన్నీ ఇప్పుడు మాంచి ఫన్ క్రియేట్ చేస్తుండటంతో కొందరికి నచ్చుతోంది. మరికొందరికి మాత్రం కాస్త ఓవర్ చేస్తున్నాడనే ఫీలింగ్ ఉంది. కానీ, అతడు ఆ మాత్రం కూడా చేయకపోతే.. జనాలు టీవీ కట్టేసి నిద్రపోతారనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి.. ఈ వారం టాప్-5లో ఎవరు ఉంటారనేది చూడాలి. సిరి గేమ్ ప్లాన్ ఎఫెక్ట్‌తో షన్ను.. ఔటయ్యే అవకాశాలు తక్కువే. కానీ, టాప్ 5లో ఏ స్థానంలో నిలుస్తాడనేదే అనుమానం. ఇప్పటివరకు సన్నీ నెంబర్ వన్, షన్ను నెంబర్ 2లో ఉన్నట్లు తెలుస్తోంది. షన్నుకు గతంలో కంటే ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఆ ఓట్లు సన్నీకి పడుతున్నాయా లేదా సిరికా.. అనేది మాత్రం స్పష్టత లేదు. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఔట్ అవుతారని మీరు భావిస్తున్నారు? 

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 09 Dec 2021 03:43 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh jaswanth బిగ్ బాస్ 5 తెలుగు Shanmukh Siri Sunny షన్ముఖ్ VJ Sunny సిరి

ఇవి కూడా చూడండి

Gruhalakshmi December 1st Episode : ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: సంజయ్ కోసం ఇంటికొచ్చిన పోలీసులు - షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి

Gruhalakshmi December 1st Episode : ‘గృహలక్ష్మీ’ సీరియల్‌: సంజయ్ కోసం ఇంటికొచ్చిన పోలీసులు - షాకింగ్ నిర్ణయం తీసుకున్న తులసి

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Jagadhatri December 1st Episode: 'జగద్ధాత్రి' సీరియల్: నిషికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ధాత్రి - భయంతో వణికిపోతున్న మాధురి!

Jagadhatri December 1st Episode: 'జగద్ధాత్రి' సీరియల్: నిషికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ధాత్రి - భయంతో వణికిపోతున్న మాధురి!

Krishna Mukunda Murari Serial December 1st Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్: శ్రీనివాస్ ఇంట్లో కృష్ణని చూసేసిన మురారి, భవాని.. రచ్చ రచ్చే!

Krishna Mukunda Murari Serial December 1st Episode: కృష్ణ ముకుంద మురారి సీరియల్:  శ్రీనివాస్ ఇంట్లో కృష్ణని చూసేసిన మురారి, భవాని.. రచ్చ రచ్చే!

టాప్ స్టోరీస్

LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!

Tamil Nadu Rains: మూడు రోజుల్లో తుపాన్‌-తమిళనాడుకు రెడ్‌ అలర్ట్‌

Tamil Nadu Rains: మూడు రోజుల్లో తుపాన్‌-తమిళనాడుకు రెడ్‌ అలర్ట్‌

Elections Exit Polls : గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?

Elections Exit Polls :  గందరగోళం ఎగ్జిట్ పోల్స్ - ప్రజా నాడిని ఎవరూ పట్టలేకపోతున్నారా ?