అన్వేషించండి

Bigg Boss: ‘పెటా ఇండియా‘ ఆగ్రహం, హిందీ బిగ్ బాస్ నుంచి ఆ కంటెస్టెంట్ ఔట్

హిందీ బిగ్ బాస్ షోలోకి గాడిదను కంటెస్టెంట్ గా తీసుకురావడంపై జంతు ప్రేమికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో తొలివారంలో దానిని ఎలిమినేట్ చేశారు.

Bigg Boss 18: బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ‘బిగ్ బాస్‘ అన్ని భాషల్లో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రీసెంట్ గా హిందీలో ఈ షో ప్రారంభం అయ్యింది. గత ఆదివారం బిగ్ బాస్ 18వ సీజన్ మొదలయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేస్తున్న ఈ షో, తొలి రోజునే వివాదానికి కారణం అయ్యింది. మొత్తం 18 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించగా, వారిలో ఓ గాడిద కూడా ఉండటం సంచలనం కలిగించింది. మూగ జీవాలను వినోదం కోసం వేధిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. వెంటనే గాడిదను షో నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. ‘పెటా ఇండియా‘ సైతం రియాలిటీ షో లోకి గాడిదను తీసుకోవడంపై మండిపడింది.

తొలివారం బిగ్ బాస్ నుంచి గాడిద ఎలిమినేట్

బిగ్ బాస్ షోలోకి గాడిదను తీసుకురావడంపై సర్వత్రా విమర్శలు రావడంతో షో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి వారం ఎలిమినేషన్ లో భాగంగా గాడిదను బయటకు పంపించారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం ప్రకటించింది. జంతు ప్రేమికుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ తో షో నుంచి గాడిదను ఎలిమినేట్ చేసినట్లు తెలిపింది. బిగ్ బాస్ షోకు ప్రజలను ఆదరణ లభిస్తుందని వెల్లడించింది. తమ షోకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పింది. అటు గాడిదను బయటకు పంపేలా చర్యలు తీసుకున్న పెటా ఇండియా చైర్ పర్సన్ మేనకా గాంధీకి పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) థ్యాంక్స్ చెప్పింది. ప్రతి ఒక్కరి సమిష్టి కృషితోనే గాడిదను బయటకు పంపించారని వెల్లడించింది.

అక్టోబర్ 6న హిందీ బిగ్ బాస్ షో ప్రారంభం

హిందీ బిగ్ బాస్ సీజన్ 18 అక్టోబర్ 6న ప్రారంభం అయ్యింది. ఇందులో గాడిదను కంటెస్టెంట్ గా తీసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లోని గార్డెన్ ప్లేస్ లో దానికి ప్రత్యేకంగా ప్లేస్ కేటాయించారు. కంటెస్టెంట్లు దానికి సేవలు చేయాలని హోస్టు సల్మాన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పెటా ఇండియా బిగ్ బాస్ షోతో పాటు సల్మాన్ కు లేఖ రాసింది. “మూగ జీవాలను వినోదం కోసం ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. బయట ఆహ్లాదంగా ఉండాల్సిన గాడిదను విద్యుత్ వెలుగులు, మ్యూజిక్ శబ్దాల నడుమ హింసిస్తున్నారు. వెంటనే ఈ షో నుంచి గాడిదను బయటకు పంపించాలని కోరుతున్నాం” అని లేఖలో వెల్లడించింది. ఈ లేఖపై బిగ్ బాస్ నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. తొలివారంలోనే గాడిదను బయటకు పంపించారు. వాస్తవానికి గాడిదను బయటకు పంపించే ఉద్దేశం లేకపోయినా, విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందీ బిగ్ బాస్ 18 రియాలిటీ షో కలర్స్ టీవీలో ప్రసారమవుతుంది. అటు జియో సినిమా యాప్‌ లోనూ స్ట్రీమింగ్ అవుతున్నది.  

Read Also: బిగ్ బాస్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి పారితోషికం ఎంతో తెలుసా? కమల్‌ను రీప్లేస్ చేసిన మక్కల్ సెల్వన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని కేసీఆర్ కు ఆహ్వానం, బీఆర్ఎస్ బాస్ వస్తారా?
Earthquake: తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు - మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Best Gaming Laptops: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!
Ambulance Theft: రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
రోగిని తరలిస్తూనే అంబులెన్స్ చోరీ - హైవేపై ఛేజ్ చేసి మరీ పట్టుకున్న పోలీసులు, వైరల్ వీడియో
Hyderabad:  హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో  మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మల్టీలెవల్ ఫ్లైఓవర్స్ - షాంఘై లుక్ వచ్చేస్తుందా ?
RGV Review On Pushpa 2: ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ
Embed widget