News
News
X

Vijay Devarakonda: హిందీలో మాట్లాడితే వెక్కిరించాడు, ఇప్పుడేమో - విజయ్ దేవరకొండపై నటి కామెంట్స్!

విజయ్ హిందీ భాషను ఎగతాళి చేసేవాడని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి మలోభిక. 

FOLLOW US: 
 
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ.. బెంగాలీ నటి మలోభిక బెనర్జీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లక్రితం విజయ్, మలోభిక కలిసి 'నీ వెనకాలే నడిచి' అనే మ్యూజిక్ వీడియోలో నటించారు. అప్పటికే విజయ్ 'అర్జున్ రెడ్డి' సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. దీంతో మ్యూజిక్ సాంగ్ పై బజ్ పెరిగింది. ఈ సాంగ్ షూట్ చేసే సమయంలో విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అయిపోయారని చెప్పింది మలోభిక. 

అయితే అతడు హిందీ భాషను ఎగతాళి చేసేవాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్ సమయంలో హిందీలో మాట్లాడుతుంటే.. విజయ్ నవ్వేవాడని, తనకు అసలు లాంగ్వేజ్ అర్ధమయ్యేది కాదని చెప్పారు మలోభిక. అంతేకాదు.. హిందీలో మాట్లాడుతున్నానని వెక్కిరించేవాడని.. హిందీ లాంగ్వేజ్ అరబిక్ టైప్ లో ఉంటుందని.. తనకు అర్ధం కాదని అనేవాడని గుర్తుచేసుకుంది. కావాలనే విజయ్ సెట్స్ లో తెలుగు మాట్లాడేవాడిని.. అలాంటి వ్యక్తి 'లైగర్' అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడని తెలిసినప్పుడు నవ్వుకున్నానని చెప్పారు మలోభిక. 

హిందీ భాషను అంతగా వెక్కిరించిన మనిషి ఇప్పుడు హిందీ సినిమా ఎలా చేస్తున్నాడా..? అని అనిపించిందని.. 'లైగర్' సినిమా సమయంలోనే ఈ విషయం చెబుదామనుకున్నానని.. కానీ విజయ్ మంచి ఫ్రెండ్ కావడంతో చెప్పలేదని తెలిపారు. సినిమా చూసిన తరువాత విజయ్ కి పెద్దగా డైలాగ్స్ లేవని అర్థమైందని అన్నారు. ప్రస్తుతం మలోభిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో 'ఖుషి' అనే సినిమా ఉంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు 'ఖుషి' సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఆల్రెడీ కశ్మీర్ మంచు కొండల్లో ఒక షెడ్యూల్ చేశారు. 

News Reels

'జెర్సీ' డైరెక్టర్ తో విజయ్:
ఇటీవల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. విజయ్ దేవరకొండని కలిసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) మాంచి ఎంటర్‌టైనర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుగు చిత్రసీమ వర్గాల కథనం. ఆల్రెడీ విజయ్ దేవరకొండకు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పడం, దానికి హీరోతో పాటు నిర్మాత నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగాయట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిసింది. 

అశ్వనీదత్ తో మరో సినిమా:
అగ్ర నిర్మాత అశ్వనీదత్.. విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే సరైన కథ మాత్రం దొరకలేదు. ఇప్పుడు కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సౌత్ లో కూడా పాపులర్ అయిన రాజ్ అండ్ డీకే దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇటీవల వారు చెప్పిన కథ విజయ్ కి నచ్చింది. అదే కథ అశ్వనీదత్ దగ్గరకు వెళ్లింది. ఆయనకు కూడా నచ్చడంతో.. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?

Published at : 27 Oct 2022 09:25 PM (IST) Tags: Vijay Devarakonda Liger Movie Malobika Banerjee

సంబంధిత కథనాలు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

RRR Oscar Entry: ఆ సమయంలో చాలా నిరాశ చెందా, ‘ఆర్‌.ఆర్.ఆర్’ ఆస్కార్‌కు ఎంపికపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

RRR Oscar Entry: ఆ సమయంలో చాలా నిరాశ చెందా, ‘ఆర్‌.ఆర్.ఆర్’ ఆస్కార్‌కు ఎంపికపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త