X

Bellamkonda Srinivas: గుజ‌రాత్‌కు వెళ్లిన‌ బాలీవుడ్ 'ఛత్రపతి'... అక్కడ ఏం సీన్స్ తీశారంటే?

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గుజరాత్ రాష్ట్రంలోని భావ్ న‌గ‌ర్‌లో ఉన్నారిప్పుడు. 'ఛత్రపతి' హిందీ రీమేక్ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఏం సీన్స్ తీశారంటే...

FOLLOW US: 
'బాహుబలి' కంటే ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా 'ఛత్రపతి'. మదర్ సెంటిమెంట్, మాస్ కమర్షియల్ అంశాలు ఉన్న ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు 'ఛత్రపతి' హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ 'ఛత్రపతి'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. హీరో, దర్శకుడు... ఇద్దరికీ తొలి హిందీ సినిమా ఇది. 'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వి.వి. వినాయక్... 'ఛత్రపతి' రీమేక్‌తో అతడిని హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ రాష్ట్రంలోని  భావ్ న‌గ‌ర్‌లో జరుగుతోంది. 'ఛత్రపతి'లో ప్రభాస్ బస్‌లో వెళ్లే సన్నివేశాలు ఉంటాయి కదా! అక్కడ ఓ ఫైట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఆ సన్నివేశాలను హిందీ సినిమా కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద భావ్ న‌గ‌ర్‌లో షూట్ చేశారు. షూటింగ్ కారణంగా పట్టణం అంతా సందడి సందడి నెలకొంది. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు జానీ లివర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' సినిమాలో కథ విశాఖ నేపథ్యంలో సాగుతుంది. హిందీ రీమేక్ కోసం గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లాను ఎంపిక చేసుకున్నట్టు ఉన్నారు. ఆ ఏరియా కూడా సముద్ర తీర ప్రాంతమే. 
బెల్లకొండ సాయి శ్రీనివాస్ నటించిన తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యాయి. అలా ఆయన ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయమే. ఉత్తరాదిలో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'ఛత్రపతి'తో స్ట్రయిట్ హిందీ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ 'స్టూవ‌ర్ట్‌పురం దొంగ‌' చేయనున్నారు.
 
Also Read: డబ్బులు పోయినా పర్వాలేదు కానీ రాజీ పడకూడదని అనుకున్నాం! - నిత్యా మీనన్
Also Read: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: జైలులో ఎన్టీఆర్‌... ఎర్ర గాజులు... పిల్లలు... ప్రేక్షకులకు రాజమౌళి వదిలిన ప్రశ్నలు!
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 
Tags: Bellamkonda Srinivas Shooting Updates Chatrapathi Hindi Remake Bhimavaram VV Vinayak

సంబంధిత కథనాలు

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Karthika Deepam Nirupam : డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

Tollywood: పెళ్లి విషయంలో నవదీప్ పాలసీ ఇదే.. రెహ్మాన్ ప్లేస్ కొట్టేసిన కీరవాణి..

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

BhamaKalapam: భామాకలాపం టీజర్ చూశారా..? డేంజరస్ హౌస్ వైఫ్.. 

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Akhanda: 'అఖండ' సినిమాలో సీన్.. హైదరాబాద్ పోలీసులు ఇలా వాడేశారు..

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?

Samantha Next Item Song: 'లైగర్' సినిమాలో సమంత ఐటెం సాంగ్.. నిజమెంత..?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

  ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు

  ప్రముఖ జ్యోతిష్య పండితులు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఇకలేరు

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Netaji Jayanti 2022: ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

PV Sindhu Wins: సయ్యద్ మోదీ ఓపెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకున్న పీవీ సింధు... మాళవికా బన్సోద్ పై వరుస సెట్లలో విజయం

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా

NZ PM Update: న్యూజిలాండ్ లో కోవిడ్ ఆంక్షలు... వివాహాన్ని రద్దు చేసుకున్న ప్రధాని జసిండా