అన్వేషించండి
Nithya Menen: డబ్బులు పోయినా పర్వాలేదు కానీ రాజీ పడకూడదని అనుకున్నాం! - నిత్యా మీనన్
నిత్యా మీనన్ ఓ ప్రధాన పాత్రలో నటించిన, నిర్మాణంలో భాగస్వామి అయిన 'స్కైల్యాబ్' డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సంగతులు...
![Nithya Menen: డబ్బులు పోయినా పర్వాలేదు కానీ రాజీ పడకూడదని అనుకున్నాం! - నిత్యా మీనన్ We don't want to compromise on film production says Nithya Menen who is turning producer with SkyLab movie Nithya Menen: డబ్బులు పోయినా పర్వాలేదు కానీ రాజీ పడకూడదని అనుకున్నాం! - నిత్యా మీనన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/27/0d9e474f3488b9551d0f359aaa09c92c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిత్యా మీనన్
"స్కైల్యాబ్' కథ విన్నప్పుడు... ఇటువంటి సినిమా ఖచ్చితంగా తెర మీదకు రావాలని అనుకున్నాను. అయితే కొన్ని సమస్యల వల్ల అనుకోకుండా నేను నిర్మాత అయ్యా. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి సినిమా తీయాలంటే చాలా కష్టం. అటువంటి తరుణంలోనే నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి ఈ సినిమా నిర్మాణంలో ఓ భాగమయ్యా" అని నిత్యా మీనన్ అన్నారు. ఆమె ఓ ప్రధాన పాత్రలో నటించిన, నిర్మాణంలో భాగస్వామి అయిన సినిమా 'స్కైల్యాబ్'. హీరో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ మరో రెండు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిత్యా మీనన్ మీడియాతో మాట్లాడారు.
"ఇటువంటి కథ వింటే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. అంత పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్ ఇది. తెలంగాణలోని ఓ చిన్న ఊరిలో జరిగే కథ. కానీ, నేపథ్య సంగీతంలో పాశ్చాత్య సంప్రదాయ సంగీతం వినిపిస్తుంది. తెలుగు సినిమాకు ఇది చాలా కొత్తగా ఉంటుంది. కథ విన్నప్పుడు నాకు స్కైల్యాబ్ గురించి తెలియదు ఇంటికి వెళ్లి అమ్మానాన్నలను అడిగితే చాలా కథలు చెప్పారు. ఈ తరానికి తెలియకపోయినా... మన తల్లిదండ్రులకు తెలుసు. అందరూ కనెక్ట్ అవుతారని చెప్పి ఈ సినిమా తీశా" అని నిత్యా మీనన్ అన్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కు మధ్య కాంబినేషన్ సీన్స్ ఉన్నాయని... వారిద్దరితో తనకు సన్నివేశాలు ఏమీ లేవని ఆమె చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత చూస్తే... వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారన్నారు.
'స్కైల్యాబ్' సినిమాలో జర్నలిస్టు గౌరీ పాత్రలో, దొర బిడ్డగా నిత్యా మీనన్ కనిపించనున్నారు. చిత్రీకరణ జరిగేటప్పుడు నిర్మాణ వ్యవహారాల్లో పృథ్వీ మేనేజ్ చేయడంతో... నటిగా తనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని, చిత్రీకరణ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తాను చూసుకున్నానని నిత్యా మీనన్ తెలిపారు. చిత్రీకరణ అంతా సింక్ సౌండ్ (sync sound) పద్ధతిలో చేయడం వలన డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం రాలేదన్నారు. డబ్బులు పోయినా పర్వాలేదు కానీ సన్నివేశాల విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకుని సినిమా చేశామని నిత్యా మీనన్ తెలిపారు.
డా. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యా మీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు 'స్కైల్యాబ్' సినిమా నిర్మించారు. ఈ సినిమా కథ 1979 నేపథ్యంలో ఉంటుంది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన 'స్కైల్యాబ్' భూమ్మీద పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలొచ్చిన నేపథ్యంలో తెలంగాణలోని బండలింగం పల్లి అనే ఊరిలో ఎం జరిగిందనేది కథ.
Also Read: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: జైలులో ఎన్టీఆర్... ఎర్ర గాజులు... పిల్లలు... ప్రేక్షకులకు రాజమౌళి వదిలిన ప్రశ్నలు!
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
Also Read: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
Also Read: జైలులో ఎన్టీఆర్... ఎర్ర గాజులు... పిల్లలు... ప్రేక్షకులకు రాజమౌళి వదిలిన ప్రశ్నలు!
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion