Bedurulanka 2012 TV Premiere: టీవీలో 'బెదురులంక 2012' - ఎప్పుడు? ఏ ఛానల్‌లో!
Kartikeya and Neha Shetty's Bedurulanka 2012 world television premiere: యువ హీరో కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. టీవీలో ఎప్పుడు విడుదల కానుందంటే?
Bedurulanka 2012 world television premiere on Star maa: తెలుగు ప్రేక్షకుల్ని 2023లో నవ్వించిన సినిమాల్లో 'బెదురులంక 2012' ఒకటి. కంటెంట్ & కామెడీతో విజయం అందుకున్నారు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ. ఈ విజయం తనకు సంతోషాన్ని, అంతకు మించి కాన్ఫిడెన్స్ సక్సెస్ మీట్‌లో పేర్కొన్నారు. థియేటర్లు, ఓటీటీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతోంది.
'స్టార్ మా' ఛానల్‌లో 'బెదురులంక 2012'
కార్తికేయ సరసన నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటించిన 'బెదురులంక 2012'తో క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సెప్టెంబర్ నెలాఖరున అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ విడుదల అయ్యింది. ఇప్పుడు టీవీ రిలీజ్ అన్నమాట!
'బెదురులంక 2012' శాటిలైట్ హక్కులను ప్రముఖ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఈ ఆదివారం (డిసెంబర్ 24న) మధ్యాహ్నం ఒంటి గంటకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ సెలవులు కనుక పిల్లలతో పాటు పెద్దలు కూడా సినిమా చూస్తూ హాయిగా నవ్వుకోవచ్చు.
Also Read: 'సలార్' ఫ్లాప్, ప్రభాస్ కంటే డెడ్ బాడీ నయం - విషం చిమ్ముతున్న బాలీవుడ్
Enjoy the crazy world of #Bedurulanka2012 on your screens at home, tomorrow, 1 PM @StarMaa ✨@iamnehashetty @yesclax @Benny_Muppaneni #Manisharma @Loukyaoffl @SonyMusicSouth pic.twitter.com/2n3DqVV8Yu
— Kartikeya (@ActorKartikeya) December 23, 2023
అసలు సినిమా కథ ఏంటి?
'బెదురులంక 2012' సినిమా కథ విషయానికి వస్తే... యుగాంతం వస్తుందా? ఒకవేళ వస్తే ప్రపంచం అంతం అవుతుందా? అని టీవీ ఛానళ్లలో ఒక్కటే వార్తలు. దాంతో బెదురులంక గ్రామంలో భూషణం (అజయ్ ఘోష్) జనాల దగ్గర డబ్బులు కొట్టేసే నాటకానికి తెర తీస్తాడు. బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), డేనియల్ (ఆటో రాంప్రసాద్)తో కలిసి రంగంలోకి దిగుతాడు. ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భూషణం అండ్ కో ఆడుతున్న నాటకానికి శివ (కార్తికేయ గుమ్మకొండ) ఎలా అడ్డుకట్ట వేశాడు? ఎటువంటి బుద్ధి చెప్పాడు? ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర (నేహా శెట్టి)తో అతని ప్రేమకథ ఏమిటి? అనేది సినిమాలో చూడాలి.
Also Read: ఆ ఓటీటీలోకి ‘మంగళవారం’ - ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్, మరి స్ట్రీమింగ్ డేట్?
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.