Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ
బాలయ్య కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా టెస్ట్ చేయించగా.. ఆయన నెగెటివ్ వచ్చిందట.
ప్రముఖ తెలుగు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని బాలయ్య చెప్పారు. ఇప్పుడు ఆయన కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా టెస్ట్ చేయించగా.. ఆయన నెగెటివ్ వచ్చిందట. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలయ్య ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే వారం నుంచి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటారట. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన చిన్న టీజర్ ని వదిలారు. అందులో బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో పేలాయి. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గోనున్నారు బాలయ్య. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య.
Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర
Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి
View this post on Instagram