Ashwini Dutt : ఓటీటీలు కాదు, అదే అత్యంత ప్రమాదకరం - వారికి మాత్రమే థియేటర్లు: అశ్వనీదత్
తెలుగు సిని ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన విజయవంతమైన చిత్రాలని అందించిన నిర్మాత అశ్వినీదత్. ఇటీవల విడుదలైన సీతారామం సినిమాతో మరో సూపర్ హిట్ క్లాసిక్ ని తన ఖాతాలో వేసుకున్నారు.
తెలుగు సిని ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన విజయవంతమైన చిత్రాలని అందించిన నిర్మాత అశ్వినీదత్. ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమాతో మరో సూపర్ హిట్ క్లాసిక్‌ను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ షోకి విచ్చేసిన ఆయన తనకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినీ నిర్మాతలు చేస్తున్న సమ్మెపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలన సృష్టిస్తున్నాయి.
అశ్వినిదత్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను ఆలీతో పంచుకున్నారు. ఎన్టీఆర్‌ను ఎప్పటికీ దైవంగానే భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. “హిందీలో మొదటి సినిమా ‘పెళ్లి సందడి’. నేను, అరవింద్ కలిసి అనిల్ కపూర్‌తో “చూడాలని ఉంది’ సినిమా తీశాం. మా ఇద్దరికీ చాలా మంచి కానుక వచ్చింది. ఆయనకి రూ.6 కోట్లు, నాకు రూ.6 కోట్లు పోయినట్లు” చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో తన మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’ తియ్యడానికి రూ. 16 లక్షలు ఖర్చు అయిందని అన్నారు. ఒక సినిమా కోసం వాణిశ్రీ గారిని ఫిక్స్ చేశాం. ఆవిడ నాకు రూ.2 లక్షలు కావాలని అడిగారు. ఆమెకి రెండు ఇచ్చా కాబట్టి ఎన్టీఆర్ రెండున్నర అడుగుతారు కదా అని ఒక పొట్లంలో యాభై వేలు కట్టుకుని తీసుకెళ్లాను. అది చూసి మనం తీసుకునేది రెండే అని మిగతా బ్యాలెన్స్ తిరిగి ఇచ్చారు. అటువంటి గొప్ప మనిషి ఆయన’’ అని పొగిడారు.
‘జాతిరత్నాలు’ గురించి మాట్లాడుతూ.. ‘‘అసలు అందులో కథ ఏమి లేదు. అంతా కామెడీ సీన్సే కదా’’ అని అన్నారు. ‘‘రాజకుమారుడు - మహేష్ బాబు, రామ్ చరణ్- చిరుత, అల్లు అర్జున్- గంగోత్రి వంటి హీరోల మొదటి సినిమాలన్నీ ఈయన బ్యానర్ లో వచ్చి విజయం సొంతం చేసుకున్నవే. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెం.1 సినిమా గురించి మాట్లాడుతూ మొదట అందులో ప్రభాస్‌ను అనుకున్నట్టు చెప్పారు. తర్వాత హరికృష్ణ ఫోన్ చేయడంతో కథ అంతా మారిపోయింది. ప్రభాస్‌ను కాకుండా తారక్‌ను తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంది. అందులో మెంబర్‌గా కూడా ఉన్నాను. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనిపించలేదు’’ అని అన్నారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పార్ట్ 2 తన ఆఖరి చిత్రమని ఆయన చెప్పారు. ఓటీటీలు ఎంతమాత్రం ప్రమాదకరం కాదని అన్నారు. యూట్యూబ్ వల్లే ప్రమాదం.. అలీ, అశ్వినీదత్ కొట్టుకున్నారు అని చెప్తే.. అన్ని ఆపేసి అందరూ యూట్యూబ్ మీద పడతారు. థియేటర్లన్నీ ముగ్గురు, నలుగురుకు ఇస్తున్నారన్నారు. ‘శక్తి’ సినిమా విడుదలైనప్పుడు తనలో చాలా శక్తి విహీనమైనట్టు చెప్పుకొచ్చారు. రజనీకాంత్, తన వైఫ్ చెప్పిన మాట వినకపోవడం వల్లే అలా అయిందని తెలిపారు.
Also Read: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?