ఇంత పిచ్చి ప్రేమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు - బాలయ్య క్రేజ్‌కు అర్జున్ రాంపాల్ ఫిదా
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన రీసెంట్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించారు. అయితే అభిమానుల రెస్పాన్స్ చూడటం కోసం మూవీ టీమ్ ఓ థియేటర్ ను సందర్మించారు.
సినిమా ఇండస్ట్రీలో హీరో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఆయన స్క్రీన్ మీద కనబడితే చాలు ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. ప్రపంచాన్ని మర్చిపోయి బాలయ్య సినిమాను ఎంజాయ్ చేస్తూ జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాల చేస్తారు. బాలయ్య సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆయన ఫ్యాన్స్ చేసే హంగామాతో థియేటర్ల టాప్ లేచిపోద్ది. అంతగా బాలయ్యను అభిమానిస్తారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం బాలకృష్ణ తన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా ఈ ఏడాది జనవరిలో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ థియేటర్ లో సందడి చేశారు.
బాలయ్య క్రేజ్ చూసి షాక్ అయిన అర్జున్ రామ్ పాల్..
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన రీసెంట్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించారు. అయితే అభిమానుల రెస్పాన్స్ చూడటం కోసం మూవీ టీమ్ ఓ థియేటర్ ను సందర్మించారు. మూవీ లో విలన్ గా చేసిన అర్జున్ రామ్ పాల్ కూడా థియేటర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా బాలయ్య ను చూసిన అభిమానులు కేరింతలతో థియేటర్ అంతా సందడిగా మారిపోయింది. జై బాలయ్య జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ సందడి చేశారు. అభిమానుల కేకలు, కేరింతలతో థియేటర్ దద్దరిల్లింది. బాలకృష్ణ క్రేజ్ చూసి బాలీవుడ్ నటుడు అర్జున్ పాల్ షాక్ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పిచ్చి ప్రేమను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. బాలకృష్ణ క్రేజ్ చూసి తనకు గూస్ బంబ్స్ వచ్చాయన్నారు. ఈ సినిమాలో బాలయ్యతో కలసి నటించడం సంతోషంగా అనిపించిందన్నారు. మూవీ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెప్పారు.
View this post on Instagram
‘భగవంత్ కేసరి’ లో విలన్ గా అర్జున్ రామ్ పాల్..
‘భగవంత్ కేసరి’ సినిమాలో విలన్ గా చేశారు బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్. వాస్తవానికి అర్జున్ రామ్ పాల్ ను పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో విలన్ గా అనుకున్నారు. అయితే ఆ సినిమా బాగా ఆలస్యం అవ్వడంతో బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకున్నారు. హిందీ సినిమాలు ఎక్కువగా చూసే వారికి అర్జున్ రామ్ పాల్ గురించి తెలిసే ఉంటుంది. పలు సినిమాల్లో నటించిన అర్జున్ ఇప్పుడు తెలుగులో బాలయ్య సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.
మునుపెన్నడూ చూడని పాత్రలో బాలయ్య..
బాలయ్య నటిస్తోన్న ‘భగవంత్ కేసరి’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కామెడీ యాక్షన్ తీయడంలో ఓ ట్రెండ్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా అదే స్టైల్ లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మూవీలో బాలయ్య మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అలాగే అనిల్ రావిపూడి మార్క్ సన్నివేశాలు బాగానే ఉంటాయని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అది అర్థమవుతుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కాజన్ నటిస్తోంది. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Read Also: గొడ్డలితో ఆ నరుకుడేంది రణబీర్? రక్తంతో నిండిపోయిన 'యానిమల్' ప్రీ టీజర్!