Allu Arjun: ఆ తమిళ దర్శకుడితో అల్లు అర్జున్ తరువాతి సినిమా?
పుష్ప తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
సూర్యతో ‘సెవెన్త్ సెన్స్’ వంటి అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ సినిమా తీసిన దర్శకుడు మురుగదాస్. అతని సినిమాలంటే తమిళ ప్రజలతో పాటూ, తెలుగు సినీ అభిమానులు కూడా భారీ అంచనాలే పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన మరో సైన్స్ ఫిక్షన్ సినిమాకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే కథను కూడా సిద్ధం చేసుకున్నారట. ఆ సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ హీరోగా చేయబోతున్నట్టు టాక్. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి గత ఏడాది నుంచే మురుగదాస్ కథను తేల్చే పనిలో బిజీ అయ్యాడని, ఇప్పటికి కథ పూర్తయిందని అంటున్నారు. పుష్ప సినిమా పూర్తయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాదే వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే అల్లు అర్జున్ మరో భారీ హిట్ దక్కడం ఖాయమే.
అల్లు అర్జున్ పుష్పరాజ్ గా నటిస్తున్న ‘పుష్ప’ సినిమాను డిసెంబర్ 17న విడుదలచేస్తున్నట్టు చిత్రయూనిట్ కూడా ప్రకటించింది. ఆ సినిమా తరువాత సంక్రాంతి వరకు అర్జున్ కాస్త విరామం తీసుకునే అవకాశం ఉంది. పండుగ తరువాత కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చు. పుష్ప సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు రెండూ హిట్లు గా నిలిచాయి. ఇక పుష్ప పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆమె తొలిసారి శ్రీవల్లిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ పతాకంపై సినిమాను నిర్మించారు.
Also read: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: ఈ మహాత్ముడు మనకే కాదు ఎన్నో దేశాల ప్రజలకు స్పూర్తి
Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
Also read: కన్నుకొట్టి కవ్విస్తున్న దీప్తి... అభిమానుల ఫిదా
Also read: కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మీ అకౌంట్లోకి మూడు నెలల జీతం