అన్వేషించండి
Antim Release Date: సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?
'నవరాత్రి' స్పెషల్ గా సల్మాన్ నటిస్తోన్న 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' అనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ ఏడాది 'రాధే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లో, ఓటీటీలో ఒకేసారి విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బోల్తా కొట్టింది. తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన మరో సినిమా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. సల్మాన్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హడావిడి చేస్తారో తెలిసిందే. 'నవరాత్రి' స్పెషల్ గా సల్మాన్ నటిస్తోన్న 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్' అనే సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
ముందుగా దర్శకుడు మహేష్ మంజ్రేకర్, సల్మాన్ ఖాన్ ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు నేరుగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది. నవంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సల్మాన్ ట్విట్టర్ లో చిన్న టీజర్ ను వదిలారు. దాన్ని బట్టి ఇదొక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అతడి చెల్లెలి భర్త ఆయుష్ శర్మ కూడా నటిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!
#Antim releases in theatres worldwide on 26.11.2021
— Salman Khan (@BeingSalmanKhan) October 12, 2021
It has been a gr8 & cherished association with ZEE and @punitgoenka over the years having done many films Race3,Loveyatri, Bharat, D3,Radhe & now Antim
I am confident he will take Zee to much greater heights in the coming years pic.twitter.com/TwzlvA0anR
Also Read: నాకు డ్రామాలాడడం రాదు.. సిరిపై యానీ మాస్టర్ ఫైర్..
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆటో
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
క్రైమ్
Advertisement





















