అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nandamuri Balakrishna: బాలయ్య షోలో ముందుగా మంచు ఫ్యామిలీ.. ఆ తరువాత మెగాఫ్యామిలీ..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేయబోయే షోలో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి పార్టిసిపేట్ చేయబోతున్నారట.
బాలయ్య షోలో ముందుగా మంచు ఫ్యామిలీ
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ 'ఆహా' కోసం ఓ టాక్ షో చేయబోతున్నారు బాలయ్య. 'Unstoppable With NBK' అనే పేరుతో ఈ షోని టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ షోలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయబోతున్నారు. అయితే ఇందులోని తొలి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు అతిథిగా రానున్నారని ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబుతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ కూడా రాబోతున్నారట.
దీనికి సంబంధించిన ప్రోమోను దసరా నాడు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ షోలో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తో కలిసి పాల్గొనే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అల్లు అరవింద్ దీనికి సంబంధించిన చర్చలు మొదలుపెట్టేశారు. ఈ ఇద్దరి స్టార్ల వీలుని బట్టి ఎపిసోడ్ ని ప్లాన్ చేయబోతున్నారు.
చిరంజీవిని బాలయ్య ఇంటర్వ్యూ చేయడమనేది అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడం ఖాయం. ఆ విధంగా రెండు వర్గాల ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది 'ఆహా' టీమ్. ప్రస్తుతం బాలయ్య నటించిన 'అఖండ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు బాలయ్య. అలానే మరికొంతమంది దర్శకులు లైన్లో ఉన్నారు.
Aayana adugesi, Show modaledithe...
— ahavideoIN (@ahavideoIN) October 10, 2021
The Baap of all talk shows is here! 💥
Get ready for the Paisa Vasool entertainment.🤑#NBKonAHA pic.twitter.com/bPExyZ0Fbd
Also Read: నాకు డ్రామాలాడడం రాదు.. సిరిపై యానీ మాస్టర్ ఫైర్..
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion