Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
త్వరలోనే బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. బాలయ్యతో పాటు ఎన్టీఆర్ హీరోగా అనిల్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి.
టాలీవుడ్ లో కామెడీ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ఆయన ఎలాంటి కథలు ఎన్నుకున్నా.. వెండితెరపై చాలా వినోదాత్మకంగా ప్రెజంట్ చేస్తుంటారు. జంథ్యాల, ఈవీవీ తరువాత ఆ రేంజ్ కామెడీ పండించడమంటే అనిల్ రావిపూడికి మాత్రమే సాధ్యమని అంటుంటారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ 'ఎఫ్2'కి సీక్వెల్ గా 'ఎఫ్3'ని రూపొందించారు. ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.
ఈ సినిమా తరువాత అతడి అప్ కమింగ్ సినిమాల గురించి కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి కూడా కన్ఫర్మ్ చేశారు. బాలయ్యతో పాటు ఎన్టీఆర్ హీరోగా అనిల్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ తో కథా చర్చలు కూడా మొదలయ్యాయని కథనాలను ప్రచురించారు.
ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఇవన్నీ మాటలు వరకు మాత్రమేనని.. ఇప్పటివరకు ఏది ఫైనలైజ్ కాలేదని చెప్పారు. బాలకృష్ణతో మాత్రం సినిమా ఉంటుందని.. సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని చెప్పారు. ఇక ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నానని.. ఆయనకి ఇంకా ఎలాంటి లైన్ చెప్పలేదని.. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ తో సినిమాకు సంబంధించి ఏదీ ఫైనలైజ్ కాలేదని తెలిపారు.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం 'ఎఫ్3' సినిమా రిజల్ట్ పైనే ఉందని.. ఆ తరువాత బాలకృష్ణ సినిమాపై ఫోకస్ చేస్తానని.. ఎన్టీఆర్ తో సినిమా గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'ఎఫ్3' సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
View this post on Instagram