Anchor Suma: నువ్ ఇబ్బంది పడ్డావని నాకు తెలుసు.. భర్తపై యాంకర్ సుమ ఎమోషనల్ పోస్ట్ వైరల్..
రాజీవ్ కనకాల, సుమ మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుంచో వార్తలొస్తున్న నేపథ్యంలో ఆమె తాజాగా పెట్టిన పోస్ట్ సమాధానం చెప్పినట్లైంది.
తన భర్త రాజీవ్ కనకాల చాలా ఇబ్బంది పడిన విషయం తనకు తెలుసని.. యాంకర్ సుమ అంటున్నారు. 'లవ్ స్టోరీ' సినిమాపై తన అభిప్రాయాలను ఆమె పంచుకునే సందర్భంలో ఎమోషనల్ గా స్పందించారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి బాబాయ్ పాత్రలో రాజీవ్ కనకాల నటించారు. కూతురు వరసయ్యే అమ్మాయిపై లైంగిక దాడి చేసే పాత్రలో రాజీవ్ ని చూసినవారంతా షాకయ్యారు.
Also Read: 'రిపబ్లిక్' మూవీ క్లైమాక్స్.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..
ఈ పాత్ర ద్వారా అమ్మాయిలపై కుటుంబసభ్యులు లైంగిక దాడికి పాల్పడుతున్నారనే నిజాన్ని చూపించాలనుకున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. రాజీవ్ కనకాల ఎప్పటిలానే తన పాత్రలో ఇమిడిపోయి నటించారు. దీనిపై సుమ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా 'లవ్ స్టోరీ' సినిమాపై ఆమె ప్రశంసలు కురిపించింది. తన భర్త నటన అద్భుతంగా ఉదంటూ ఆమె పొగడ్తలు కురిపించడం విశేషం.
సినిమా సెట్‌లో రాజీవ్ స్టిల్‌ను షేర్ చేస్తూ.. అతి తక్కువ మంది నటీనటులు మాత్రమే తన నటనతో మన మనస్సులను తాకుతారు.. అలాంటి నటీనటుల్లో నా భర్త రాజీవ్ కూడా ఒకరని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. నరసింహగా ఎంతో అద్భుతంగా నటించినందుకు రాజీవ్ కి అభినందనలు చెప్పింది. ఈ పాత్ర చేయడానికి నువ్ ఎంత ఇబ్బందిపడ్డావో, బాధపడ్డావో నాకు తెలుసు కానీ ఎంతోమంది జీవితాలను నువ్ ప్రభావితం చేశావంటూ భర్త గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.
ఇలాంటి సున్నితమైన కథను మరింత సున్నితంగా తెరకెక్కించిన శేఖర్ కమ్ముల, చైతన్యలకు థాంక్స్ చెప్పింది సుమ. సాయిపల్లవి డాన్స్ చూసి తన కళ్లు అలసిపోయాయని.. డాన్స్ ఎక్కడ మిస్ అవుతానో అని కంటిరెప్ప కూడా వాల్చలేదని చెప్పుకొచ్చింది సుమ. చాలా కాలంగా రాజీవ్ కనకాల, సుమ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు ఈ జంట క్లారిటీ ఇస్తూనే ఉంది. తాజాగా సుమ పెట్టిన పోస్ట్ తో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్లైంది!
View this post on Instagram
Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?